ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 నేపథ్యంలో పరిశ్రమ నుండి స్వీకరించిన 585 సమస్యలలో 581 సమస్యలను ఎంఓఎఫ్పిఐ గ్రీవెన్స్ సెల్ పరిష్కరిస్తుంది

శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వాటాదారులతో క్రమం తప్పకుండా వీడియో సమావేశాలు

Posted On: 30 MAY 2020 2:50PM by PIB Hyderabad

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ  గ్రీవెన్స్ సెల్ అందుకున్న 585 సమస్యల్లో 581 సమస్యలను పరిష్కరించగలిగింది, క్రియాశీలక దృక్పథం, సకాలంలో పరిష్కారం అనేది ముఖ్యంగా భావించింది మంత్రిత్వ శాఖ. టాస్క్ ఫోర్స్ ఈ సమస్యలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సహా ఇతర సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. టాస్క్ ఫోర్స్ రాష్ట్రాలలోని ప్రముఖ పరిశ్రమల సంఘాలు, ఆహార ప్రాసెసర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది, దేశవ్యాప్తంగా ప్రస్తుత కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో, ఉత్పత్తి, సరఫరా గొలుసు అంతరాయంలో, ఫిర్యాదులను, ఆహార ప్రాసెసింగ్ రంగం ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలు covidgrievance-mofpi[at]gov[dot]in కి మెయిల్ చేయవచ్చు.

మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు అయ్యాయి, ఇందులో మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, ఇన్వెస్ట్ ఇండియా సభ్యులు ఉన్నారు. పరిశ్రమల నుండి వచ్చే సమస్యలు నేరుగా కానీ వివిధ పరిశ్రమ సంఘాల ద్వారా కానీ గ్రీవెన్స్ సెల్ కి చేరుతుంది. గ్రీవెన్స్ సెల్ వద్ద అందుకున్న ప్రధాన సమస్యలు: లాక్ డౌన్  కారణంగా ప్లాంట్ మూసివేత, లాజిస్టిక్స్ సంబంధిత సమస్యలు, గిడ్డంగి మూసివేత, కార్మికుల లభ్యత. కార్మికులు, సిబ్బంది కదలికలు.    

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్, పరిశ్రమల సంఘాలు, కోల్డ్ చైన్ డెవలపర్లు, ఎగుమతిదారులు మొదలైన వారితో వరుస వీడియో సమావేశాలకు అధ్యక్షత వహించారు. కోల్డ్ చైన్ ప్రమోటర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్బంగా మంత్రిత్వ శాఖకు వివిధ సమస్యలు వచ్చాయి, దీనిపై టాస్క్‌ఫోర్స్ వెంటనే స్పందించి, సంబంధిత వాటాదారులందరితో వారి సమస్యలపై చర్చలు జరిపింది. సాధారణ స్థితికి తిరిగి రావడానికి ఆహారం, అనుబంధ పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ చర్యలు తీసుకున్నారు..

లాజిస్టిక్స్,సరఫరాపై ఉన్న సాధికారిక కమిటీలో మంత్రిత్వ శాఖ కూడా సభ్యుడుగా ఉంది. పండించిన వ్యవసాయ ఉత్పత్తులను పరిశ్రమకు సరఫరా చేయటానికి ఆస్కారం కలిపించి రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. పరిశ్రమలపై కొవిడ్-19 ప్రభావం అతి తక్కువగా ఉండేలా  ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంది.

****



(Release ID: 1627925) Visitor Counter : 279