ప్రధాన మంత్రి కార్యాలయం

విద్యుత్తు మంత్రిత్వ శాఖ, ఇంకా నూతన మరియు నవీకరణయోగ్య శక్తి మంత్రిత్వ శాఖ ల కార్యకలాపాల ను సమీక్షించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 28 MAY 2020 7:35AM by PIB Hyderabad

విద్యుత్తు మంత్రిత్వ శాఖ, ఇంకా నూతన మరియు నవీకరణయోగ్య శక్తి శాఖ ల పని తీరు ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నిన్నటి రోజు న సాయంత్రం పూట  సమీక్షించారు.  విద్యుత్తు రంగాన్ని బాధిస్తున్న సమస్యల ను పరిష్కరించడం కోసం ఉద్దేశించినటువంటి ద ఇలెక్ట్రిసిటి (అమెన్డ్ మెంట్) బిల్, 2020 తో పాటు రివైజ్ డ్ టారిఫ్ పాలిసి పైన కూడా ఈ సమావేశం లో చర్చించడమైంది.

విద్యుత్తు రంగం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచుకొంటూ, దాని నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకొంటూ వినియోగదారుల లో సంతృప్తి ని వృద్ధిచేయవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి వక్కాణించారు.  విద్యుత్తు రంగం లో సమస్యలు- ప్రత్యేకించి విద్యుత్తు పంపిణీ విభాగం లో- సమస్యలు ఒక ప్రాంతాని కి మరొక ప్రాంతాని కి, ఒక రాష్ట్రాని కి మరొక రాష్ట్రాని కి వేరు వేరు గా ఉన్నాయన్న సంగతి ని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు.  అన్ని సమస్యల కు ఒకే పరిష్కార మార్గం కోసం అన్వేషించే కంటే, మంత్రిత్వ శాఖ ప్రతి ఒక్క రాష్ట్రం తన ప్రదర్శన ను మెరుగు పరచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను రాష్ట్రం వారీ నిర్దిష్ట పరిష్కార చర్యల ను ఆచరణ లోకి తీసుకు రావాలి అని ఆయన అన్నారు.

డిస్కమ్ లు వాటి పనితీరు యొక్క పరామితుల ను ఎప్పటికప్పుడు ప్రచురించేటట్టు చూడవలసిందని, అదే జరిగితే సమకాలీన కంపెనీల తో పోల్చి చూసినప్పుడు తమ డిస్కమ్ లు ఏ విధం గా పనిచేస్తోందీ ప్రజలు తెలుసుకోగలుగుతారని విద్యుత్తు మంత్రిత్వ శాఖ కు ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు.  విద్యుత్తు మంత్రిత్వ శాఖ లో ఉపయోగించే సామగ్రి మేక్ ఇన్ ఇండియా ను అనుసరించి ఉండాలి అని కూడా ఆయన నొక్కి పలికారు.

నూతన మరియు నవీకరణయోగ్య శక్తి మంత్రిత్వ శాఖ విషయం లో, సోలర్ వాటర్ పంప్స్ మొదలుకొని వికేంద్రీకరించిన సౌర శక్తి ఆధారిత చలవ గిడ్డంగి ల వరకు చూసుకొంటే వ్యవసాయ రంగం లోని యావత్తు సరఫరా శృంఖల కై సమగ్ర దృష్టికోణాన్ని అనుసరించవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.  పైకప్పు మీద అమర్చే సోలర్ కోసం ఒక వినూత్నమైనటువంటి నమూనా ను ఆవిష్కరించవలసిన ఆవశ్యకత ఉందని, దీనితో పాటు ప్రతి రాష్ట్రం కనీసం ఒక నగరం (అది రాజధాని నగరం కావచ్చు లేదా ఏదైనా ప్రసిద్ధి గాంచిన యాత్రా స్థలం కావచ్చు) లో- రూఫ్ టాప్ సోలర్ పవర్ జనరేశన్ పద్ధతి ని అనుసరించే పూర్తి స్థాయి సోలర్ సిటీ- ని కలిగివుండాలి అని  కూడా ఆయన స్పష్టం గా చెప్పారు.  సమావేశం సాగిన క్రమం లో, భారతదేశం లో ఇంగట్ స్, వేఫర్ స్, సెల్స్ ఎండ్ మాడ్యూల్ స్ ను తయారు చేసేందుకు తగినటువంటి ఇకోసిస్టమ్ ను అభివృద్ధిపరచడంపైన సైతం శ్రద్ధ వహించాలని, తత్సంబంధిత సామర్థ్యం సమకూరిందా అంటే గనక ఉపాధి కల్పన కు, మరి అలాగే వివిధ ఇతర ప్రయోజనాల ను పొందడం లో కూడా సహాయకారి కాగలదన్న అంశాలు ప్రస్తావన కు వచ్చాయి.

‘కర్బనానికి తావు ఉండనటువంటి లద్దాఖ్’ ను ఆవిష్కరించడం కోసం ఒక ప్రణాళిక ను సత్వరం రూపొందించాలన్న అభిలాష ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.  అలాగే, సౌర శక్తి ని మరియు పవన శక్తి ని వినియోగించుకోవడం ద్వారా కోస్తా తీర ప్రాంతాల లో త్రాగునీటి సరఫరా కు పూచీపడాలని ఆయన నొక్కి వక్కాణించారు.


***


(Release ID: 1627450) Visitor Counter : 218