విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 రోగుల చికిత్సలో నిమగ్నమైన వైద్యులు మరియు ఇతర వైద్య సిబ్బందికి భోజనం అందిస్తున్న - పి.ఎఫ్.సి.

Posted On: 27 MAY 2020 5:24PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి మరో దశలో, విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న భారతదేశంలోని ప్రముఖ ఎన్.బి.ఎఫ్.సి. ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పిఎఫ్‌సి), ఫ్రంట్ లైన్ కోవిద్ యోధులకు పరిశుభ్రమైన, పౌష్టికాహారాన్ని అందజేయడం కోసం ఆసియాలోని అతిపెద్ద ఆహార సంస్థలలో ఒకటైన తాజ్‌సాట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ ప్రయత్నంలో భాగంగా, న్యూ ఢిల్లీ లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో కోవిడ్-19 రోగుల చికిత్సలో నిమగ్నమైన వైద్యులు మరియు ఇతర ఆరోగ్య, వైద్య సిబ్బందికి పి.ఎఫ్.సి. ప్యాక్ చేసిన లంచ్ బాక్సులను అందిస్తోంది. 

ఈ చొరవతో, డాక్టర్ ఆర్.‌ఎం.ఎల్. హాస్పిటల్ యొక్క వైద్యులు మరియు వైద్య సిబ్బందికి 2020 మే నెల 25వ తేదీ నుండి 60 రోజుల పాటు ప్రతీ రోజూ అధిక-నాణ్యత మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని (ప్యాక్డ్ లంచ్ బాక్స్ ద్వారా) సరఫరా చేయడానికి గాను తాజ్ స్టాట్స్‌కు సుమారుగా 64 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పి.ఎఫ్.సి. సంస్థ అందించింది. 

కోవిడ్-19 చికిత్సకు అంకితమైన ఆసుపత్రులలో ఒకటిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని ఎంపిక చేసింది. ఇక్కడ వైద్యులు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది కోవిడ్-19 రోగులకు 24 గంటలు వైద్యం, ఇతర ఆరోగ్య సేవలను అందిస్తున్నారు.

కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరుకు మద్దతుగా పి.ఎఫ్.‌సి సంస్థ గతంలో ప్రధానమంత్రి కెర్స్ నిధికి  200 కోట్లు విరాళంగా అందజేసింది.  పి.ఎఫ్.సి. ఉద్యోగులు కూడా ముందుకు వచ్చి తమ ఒక రోజు వేతనాన్ని ప్రధానమంత్రి కేర్స్ నిధికి విరాళంగా ఇచ్చారు. వీటితో పాటు, ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ మరియు బులాండ్‌సహార్ జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి, 50,00,000 (యాభై లక్షలు) రూపాయలతో పాటు, రాజస్థాన్ లోని కోట లో వైద్య పరికరాలు ఏర్పాటు చేయడం కోసం భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీకి 50,00,000 (యాభై లక్షలు) విరాళాలుగా పి.ఎఫ్.సి. సంస్థ అందజేసింది. 

***


(Release ID: 1627264) Visitor Counter : 246