పర్యటక మంత్రిత్వ శాఖ
జూన్ 30 వరకు హోటళ్లు మరియు ఇతర వసతి యూనిట్ల ఆమోదం / వర్గీకరణల చెల్లుబాటు వ్యవధిని పొడిగించిన కేంద్ర పర్యాటక శాఖ
- టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు మరియు టూరిస్ట్ టూర్ ఆపరేటర్లలోని అన్ని వర్గాల వారికి ఆరు నెలల సడలింపు లేదా పొడిగింపు వెసులుబాటు
Posted On:
26 MAY 2020 12:57PM by PIB Hyderabad
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వివిధ తరగతుల పర్యాటకులకు ఆశించిన ప్రమాణాలకు తగ్గట్టుగా
హోటళ్లను స్టార్ రేటింగ్ విధానంలో వర్గీకరిస్తుంది. ఈ విధానంలో హోటళ్లకు వాటిలో అందుబాటులో ఉన్న ప్రమాణాల మేరకు రేటింగ్ ఇవ్వబడుతుంది. వన్ స్టార్ నుండి త్రీ స్టార్, ఆల్కహాల్ తో లేదా లేకుండా ఫోర్ మరియు ఫైవ్ స్టార్, ఫైవ్ స్టార్ డీలక్స్, హెరిటేజ్ (బేసిక్), హెరిటేజ్ (క్లాసిక్), హెరిటేజ్ (గ్రాండ్), లెగసీ వింటేజ్ (బేసిక్), లెగసీ వింటేజ్ (క్లాసిక్), లెగసీ వింటేజ్ (గ్రాండ్) మరియు అపార్ట్మెంట్ హోటళ్లు, హోమ్ స్టేలు, అతిథి గృహాలు మొదలైనవి.
ప్రభుత్వం జారీ చేసే ఈ తరహా వర్గీకరణ / ధ‌్రువీకరణలు దాదాపు ఐందేడ్ల కాలానికి చెల్లుబాటు అవుతాయి. కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి ఆ తరువాత విధించిన లాక్‌డౌన్ నేపథ్యం వసతి రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యాన దేశంలో ఆతిథ్య పరిశ్రమ చాలా కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల కారణంగా దేశంలో హోటళ్లు మరియు ఇతర వసతి యూనిట్ల ప్రాజెక్ట్ ఆమోదాలు / పునర్ఆమోదాలు మరియు వర్గీకరణ / పునర్ వర్గీకరణ గడువు పెంచాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుంచి 29వ తేదీ జూన్ మధ్య కాలంలో గడువు ముగిసినా.. లేదా ముగిసేందుకు అవకాశం ఉన్న ఆయా ఆమోదాలు / పునర్ఆమోదాలు మరియు వర్గీకరణ / పునర్ వర్గీకరణల గడువును సర్కారు జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. అదేవిధంగా దేశంలో ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్లు, డొమెస్టిక్ టూర్ ఆపరేటర్లు మరియు టూరిస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ల కార్యకలాపాల అనుమతి గడువులను కూడా పెంచే పథకాన్ని మంత్రిత్వ శాఖ కలిగి ఉంది. భారతదేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ వర్గాలలో నాణ్యత, ప్రమాణం మరియు సేవలను ప్రోత్సహించాలనే ఆలోచనలో భాగంగా సర్కారు ఈ దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుండి లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో తనిఖీ పనులను వాయిదా వేయడం మరియు దరఖాస్తు పరిశీలన జరగని కారణంగా అన్ని వర్గాల టూర్ ఆపరేటర్లకు (ఇన్‌బౌండ్, డొమెస్టిక్, అడ్వెంచర్) ఆరు నెలల సడలింపు లేదా పొడిగింపును అనుమతించాలని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ట్రావెల్ ఏజెంట్లు మరియు పర్యాటక రవాణా ఆపరేటర్లకు ఈ క్రింది షరతులకు లోబడి ఆరు నెలల సడలింపులు ఇవ్వాలని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది:
(i) మునుపటి ఆమోదం గడువు ముగియడం లేదా ప్రస్తుత ఆమోదం మార్చి 20, 2020 (అనగా.. భారత పర్యాటక కార్యాలయాలు తనిఖీ పనులను నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ) లాక్‌డౌన్ వరకు మధ్యకాలంలో ముగుస్తున్న నేపథ్యంలో
వారికి ఆరు నెలల సడలింపు ఇవ్వనున్నారు. మరియు..
(ii) ప్రస్తుత / మునుపటి ఆమోదం ముగిసేలోపు పునరుద్ధరణ కోసం వారు దరఖాస్తు చేసుకొని ఉండాలి.
(Release ID: 1626957)
Visitor Counter : 277
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam