రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఎన్‌పీపీఏ జారీ చేసిన అడ్వైజ‌రీతో ఎన్‌-95 మాస్క్‌ల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తున్న త‌యారీదారులు, దిగుమ‌తిదారులు

Posted On: 25 MAY 2020 5:28PM by PIB Hyderabad

మార్చి 13వ తేదీ 2020 నాడు విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో ఎన్-95 మాస్క్‌లను ప్ర‌భుత్వం నిత్యా‌వసరమైన వస్తువుల జాబితాలో చేర్చింది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఈ త‌ర‌హా మాస్క్‌ల వాడ‌కం పెరిగిన నేప‌థ్యంలో స‌ర్కారు వీటిని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ - 1955 ప్రకారం నిత్యా‌వ‌స‌ర వ‌స్తువుల జాబితాలో చేర్చింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం నిత్యావ‌స‌వ‌ర వ‌స్తువుల‌ను అక్ర‌మంగా అధిక మొత్తంలో క‌లిగి ఉండ‌డంతో పాటుగా వాటి బ్లాక్ మార్కెటింగ్ చేయ‌డం శిక్షార్హ‌మైన నేరంగా ప‌రిగ‌ణిస్తారు. 13వ తేదీ మార్చి 2020న వెలువ‌రించిన ఉత్తర్వులో స‌ర్కారు రాష్ర్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిత్యావ‌స‌ర‌‌ వ‌స్తువులను భారీ మొత్తంలో నిల్వ చేసి ఉంచుకోవ‌డంతో పాటు బ్లాక్-మార్కెటింగ్ జ‌ర‌గ‌కుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది.

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) జాతీయ విపత్తు నిర్వహణ చట్టం- 2005లో ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకోని దేశంలో శస్త్రచికిత్సల నిమిత్తం వాడే మాస్క్‌లు మరియు రక్షిత మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు మరియు చేతుల‌కు వాడే తొడుగులు తగిన మొత్తంలో లభించేలా జాగ్ర‌త్త‌ప‌డాల‌ని కేంద్రం అన్ని రాష్ట్రాలు / ‌కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలను కోరింది. వీటి ధ‌ర‌లు కూడా నిర్ధారించిన మేర‌కు ప్యాక్ సైజును బ‌ట్టి వాటిపై ముద్రించిన గరిష్ట రిటైల్ ధరను మించి ఉండ‌కుండా జా‌గ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది.

అక్ర‌మార్కుల‌పై రాష్ర్టాలు యూటీల‌లో దాడులు..
దేశంలో ఎన్-95 మాస్క్‌ల  బ్లాక్ మార్కెటింగ్ మరియు అక్ర‌మంగా అధిక మొత్తంలో నిల్వ ఉంచ‌డంతో పాటు అధిక ధరలకు విక్ర‌యించ‌డానికి సంబంధించి ఫిర్యాదులు అందాయి. ఈ నేప‌థ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌పీపీఏ అన్ని రాష్ట్రాలు / ‌కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల స్టేట్ డ్రగ్ కంట్రోలర్స్ / ఫుడ్ అండ్‌ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లను కూడా ఆదేశించింది. ఈ మేర‌కు దేశ వ్యాప్తంగా కొద్దిమంది ఎస్‌డీసీలు/ ఎఫ్‌డీఏలపై దాడులు జరిపారు. అత్య‌సరమైన వస్తువులను అక్ర‌మంగా నిల్వ చేసిన మరియు బ్లాక్-మార్కెటర్లపై తగు చర్యలు తీసుకుంటున్నారు.

భారీ మొత్తంలో స‌ర్కారు కోనుగోళ్లు..
ఇదే స‌మ‌యంలో ప్రభుత్వం ఎన్‌-95 మాస్క్‌లపై ధరల పరిమితిని తీసుకురావాలన్న విజ్ఞప్తితో  గౌరవ బొంబాయి హైకోర్టులో ఒక పిల్ కూడా దాఖలైంది. దేశ వ్యాప్తంగా తగినంత పరిమాణంలో ఎన్‌-95 మాస్క్‌ల సరఫరా నిరంతరాయంగా జ‌రిగేలా ప్రభుత్వం స‌ర్వాదా కృషిచేస్తోంది. ఇందులో భాగంగా తయారీదారులు / దిగుమతిదారులు / సరఫరాదారుల నుండి నేరుగా ప్రభుత్వం భారీ మొత్తంలో ఎన్‌-95 మాస్క్‌ల‌ను కొనుగోలు చేస్తోంది. ఎన్-95 మాస్క్‌ల అధిక ధరల సమస్యను పరిష్కరించడానికి ఎన్‌పీపీఏ జోక్యం చేసుకుని ధరలను తగ్గించింది. ఈ విషయంలో, దేశంలో సరసమైన ధరలకు ఎన్ -95 మాస్క్‌ల లభ్యతను నిర్ధారించడానికి గాను ఎన్‌పీపీఏ 21 మే 2020 న ఎన్-95 మాస్క్‌ల తయారీదారులు / దిగుమతిదారులు / సరఫరాదారులందరికీ ఒక అడ్వైజ‌రీని జారీ చేసింది. ప్ర‌భుత్వేతర సంస్థ‌లు మాస్క్‌ల‌ను కొనుగోలు చేసినా వాటిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాల‌ని వాటికి హెచ్చుత‌గ్గులు లేకుండా ‌త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. దీనికి తోడు దేశంలో ఎన్ -95 మాస్క్‌లపై ధరల పరిమితిని తీసుకురావాలన్న విజ్ఞప్తిపై ఎన్‌పీపీఏ గౌరవనీయ హైకోర్టు ముందు వివ‌ర‌ణ‌ను స‌మ‌ర్పించింది. దేశంలో ఎన్ -95 మాస్క్‌ల డిమాండ్-సరఫరాలో అసమతుల్యతపై తాము దృష్టి సారిస్తున్నామ‌ని వెల్ల‌డించింది. దీనికి తోడుగా దేశంలోని ఎన్‌-95 మాస్క్‌ల‌ తయారీదారులు / దిగుమతిదారులు / సరఫరాదారులు స్వచ్ఛందంగా ధరలను తగ్గించాల‌ని కూడా సూచించిన‌ట్టు తెలిపింది.

ఆ వార్త‌లు పూర్తిగా త‌ప్పుదోవ ప‌ట్టించేవే..
ఇదే స‌మ‌యంలో ప్రభుత్వ సేకరణ రేటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరను ఎన్‌పీపీఏ ఆమోదించిందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్ర‌చురిత‌మైన‌ వార్తలను ఎన్‌పీపీఏ ‌ఖండించింది. ఈ వార్తా క‌థ‌నంలో ప్రభుత్వ సేకరణ రేటును తప్పుగా చూపార‌ని ఇది పూర్తిగా  మోసపూరితమైనది మరియు తప్పుదోవ పట్టించేదని వెల్ల‌డించింది. తాము త‌గిన అడ్వైజ‌రీని జారీ చేసిన తరువాత ఎన్‌-95 మాస్క్‌ల యొక్క ప్రధాన తయారీదారులు / దిగుమతిదారులు వాటి ధరలను గణనీయంగా 47% వరకు తగ్గించార‌ని తెలిపింది. దీంతో ఎన్ -95 మాస్క్‌లు దేశ వ్యాప్తంగా సరసమైన ధరలకు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపింది. ఎన్ -95 మాస్క్‌ల యొక్క కొంద‌రు తయారీదారులు / దిగుమతిదారులు నివేదించినట్లుగా, ఇతర తయారీదారులు / దిగుమతిదారులు ప్రభుత్వ సలహాలను అనుసరిస్తారని, భారీ ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ధరలను తగ్గించ‌గ‌ల‌ర‌ని ఎన్‌పీపీఏ భావిస్తోంది.

*********

భార‌త ప్ర‌భుత్వ ఔష‌ధ‌, ర‌సాయ‌నాలు మరియు ఎరువులు శాఖ‌లో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఒక విభాగం. 

 



(Release ID: 1626785) Visitor Counter : 236