రక్షణ మంత్రిత్వ శాఖ
మిషన్ సాగర్- మారిషస్‌లోని పోర్ట్ లూయిస్‌కు చేరుకున్న ఐఎన్ఎస్ నౌక కేసరి
- కోవిడ్-19 కు సంబంధించిన అత్యవసరమైన మందులు, ఆయుర్వేద ఔషధాలు మారిషస్‌కు అందజేత
Posted On:
23 MAY 2020 8:31PM by PIB Hyderabad
మిషన్ సాగర్‌లో భాగంగా భారత నావిక దళ నౌక కేసరి శనివారం (మే 23న) మారిషస్‌లోని పోర్ట్ లూయిస్‌కు చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా స్నేహపూర్వక విదేశాలకు భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. ఇందులో భాగంగానే భారతీయ నావికాదళం నౌక కేసరి, కోవిడ్-19కు సంబంధించిన అత్యవసరమైన మందులు మరియు మారిషస్ ప్రజల నిమిత్తం ఆయుర్వేద ఔషధాల ప్రత్యేక సరుకును తీసుకువెళ్లింది. దీనికి తోడు భారత నావికాదళ వైద్యులు మరియు పారామెడిక్స్‌తో కూడిన 14 మంది సభ్యుల స్పెషలిస్ట్‌లతో కూడిన వైద్య బృందం కూడా ఈ నౌకలో బయలుదేరింది. ఈ బృందం మారిషస్‌లోని వైద్య సహచరులతో కలిసి పని చేయనుంది. కోవిడ్-19 కు సంబంధిత అత్యవసర పరిస్థితులకు కూడా ఈ బృందం సహాయం చేయనుంది. మెడికల్ అసిస్టెన్స్ టీమ్‌లో కమ్యూనిటీ మెడిసిన్ స్పెషలిస్ట్, ఉపిరితిత్తుల వైద్య స్పెషలిస్ట్ మరియు అనస్థీషియాలజిస్ట్ ఉన్నారు. భారతదేశం నుంచి తీసుకువెళ్లిన ఔషధాలను మారిషస్ ప్రభుత్వానికి అందజేసే అధికారిక కార్యక్రమం శనివారం (మే 23వ తేదీన) జరిగింది. మారిషస్ ప్రభుత్వం తరపున ఆరోగ్య మంత్రి డాక్టర్ కైలేష్ జగుత్పాల్ భారత్ నుంచి వచ్చిన సరుకును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత బృందానికి మారిషస్‌లోని భారత హైకమిషనర్ హెచ్ఈ శ్రీ తన్మయ లాల్ ప్రాతినిధ్యం వహించారు. ఈ కార్యక్రమంలో భారత నావికాదళ షిప్ కేసరి కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ ముఖేష్ తయాల్‌తో మారిషస్ మంత్రి సంభాషించారు. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి విజృంభన నేపథ్యంలో స్నేహపూర్వక దేశాలకూ సాయమందించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు మారిషస్‌కు ఈ సాయం అందిస్తున్నారు. ‘సాగర్’ ప్రాంతంలో అందరికీ భద్రత మరియు వృద్ధికి ఊతమందించాలన్న ప్రధానమంత్రి దృష్టి కోణానికి తగ్గట్టుగా ‘మిషన్ సాగర్’ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ మిషన్ ఐఓఆర్ దేశాలతో సంబంధాలకు భారతదేశం ఇచ్చిన ప్రాముఖ్యతను ఎత్తిచూపుతోంది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవటానికి ఇరు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాలను ఇది పెంపొందిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వ ఇతర ఏజెన్సీల సన్నిహిత సమన్వయంతో ఈ మొత్తం ఆపరేషన్ ముందుకు సాగుతోంది.
(Release ID: 1626499)
Visitor Counter : 320