రైల్వే మంత్రిత్వ శాఖ

15 జతల రైళ్ల కోసం టికెట్ల బుకింగ్ నియమ నిబంధనలు సవరించిన భారత రైల్వే శాఖ


ఈ రైళ్ల అడ్వాన్స్ రిజర్వేషన్ కాలం (ఎఆర్ పి) 7 నుంచి 30 రోజులు


2020 మే 24 తేదీ నుంచి బుకింగ్ లకు, మే 31 నుంచి ప్రయాణాలకు ఈ మార్పు అమలు

Posted On: 22 MAY 2020 8:04PM by PIB Hyderabad

భారతీయ రైల్వే మే 12వ తేదీ నుంచి 15 జతల స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ 15 జతల రైళ్లకు సంబంధించిన నియమనిబంధనలు మార్చాలని నిర్ణయించింది. అవి ఇలా ఉన్నాయి...

- ఈ రైళ్ల అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి  (ఎఆర్ పి) 7 రోజుల నుంచి 30 రోజులకు పెంచారు. వీటిలో తత్కాల్ బుకింగ్ కు అనుమతించరు. 
- నిబంధనలు అనుమతించిన మేరకు వాటిలో ఆర్ఏసి/  వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేస్తారు. కాని నిబంధనలకు అనుగుణంగా రైలు బయలుదేరే సమయానికి కూడా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్న ప్రయాణికులను మాత్రం రైలు ఎక్కేందుకు అనుమతించరు.
- రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు తొలి చార్టును, 2 గంటల ముందు రెండో చార్టు (రెగ్యులర్ రైళ్లలో సాధారణంగా 30 నిముషాల బదులు)  తయారుచేస్తారు. రెండు చార్టుల మధ్య సమయంలో కరెంట్ బుకింగ్ అనుమతిస్తారు. 
- కంప్యూటరైజ్డ్ పిఆర్ఎస్ కౌంటర్లు, పోస్టాఫీసులు, లైసెన్సు గల యాత్రి టికెట్ సువిధ కేంద్రాలు (వైటిఎస్ కె), ఆన్ లైన్ బుకింగ్, ఐఆర్ సిటిసి అధీకృత ఏజెంట్లు, కామన్ సర్వీస్ సెంటర్ల నుంచి మాత్రమే బుకింగ్ అనుమతిస్తారు.
- 24వ తేదీ నుంచి బుకింగ్ లకు, 31 నుంచి ప్రయాణం చేసే రైళ్లకు దీన్ని అనుమతిస్తారు.

 



(Release ID: 1626343) Visitor Counter : 141