ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై తాజా స‌మాచారం

40.98 శాతానికి పెరిగిన కోవిడ్‌-19 రిక‌వ‌రీ రేటు

Posted On: 22 MAY 2020 6:45PM by PIB Hyderabad

కోవిడ్‌- 19 మ‌హ‌మ్మారి నివార‌ణ, నియంత్ర‌ణ మ‌రియు నిర్వ‌హ‌ణ‌కు గాను భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రాలు / కేంద్ర ‌పాలిత ప్రాంతాల‌తో క‌లిసి మేటి ప‌ద్ధ‌తుల్లో ముంద‌స్తు, చురుకైన విధానాల‌ను చేప‌డుతూ వ‌స్తోంది. వీటిని అత్యున్న‌త స్థాయిలోని వారు క్రమం తప్పకుండా నిత్యం సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. నిన్నటి నుండి దేశంలో ధ్రువీకరించబడిన కోవిడ్ -19 కేసుల సంఖ్యలో 6,088 పెరుగుదల గుర్తించబడింది. దీంతో ధ్రువీకరించబడిన మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1,18,447ల‌కు చేరింది. ఇందులో క్రియాశీల వైద్య పర్యవేక్షణలో ఉన్న కేసుల సంఖ్య తాజాగా 66,330ల‌కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 48,533 మంది కోవిడ్ -19 చికిత్స అనంత‌రం కోలుకున్నారు. గత 24 గంటల్లో 3,234 మంది రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు 40.98 శాతానికి చేరింది. లాక్‌డౌన్ 4.0 గుండా పరివర్తన చెందుతున్నప్పుడు, కోవిడ్‌కు
తగిన ప్రవర్తనను మన జీవనశైలిలో అంతర్భాగంగా మార్చుకోవ‌డం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా తప్పని సరిగా చేతులు కడుక్కోవడం మరియు చేతి పరిశుభ్రత, మాస్క్‌లు / ముఖ కవర్ల వాడడం, రెండు గ‌జాల భౌతిక దూరాన్ని పాటించ‌డం, ఇత‌ర వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారిని మరియు వ్యాధికి గురయ్యేందుకు ఎక్కువ అవ‌కాశం ఉన్న వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం, ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన మార్గదర్శకాలను ‌అనుసరించి స్వీయ రక్షణకు గాను రోగనిరోధక శక్తిని పెంచుకోవ‌డం, ఆరోగ్యా సేతు యాప్‌ యొక్క సంస్థాపన, వ్యాధి
లక్షణాలను సకాలంలో నివేదించడం,కోవిడ్‌-19 కోసం వైద్య సంరక్షణ కోరడంతో పాటుగా ఈ మ‌హ‌మ్మారి చికిత్స కోసం ఎటువంటి కళంకం లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌డం త‌ప్ప‌నిస‌రిగా చేయాలి.

కోవిడ్‌- 19కు సంబంధించి ప్రామాణికమైన మరియు నవీకరించబడిన సమాచారంతో పాటుగా సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు  మ‌రియు సలహాల త‌దిత‌రాల కోసం దయచేసి క్రమం తప్పకుండా ఈ కింది వెబ్‌సైట్‌ను సందర్శించండి:
https://www.mohfw.gov.in/ మరియు oMoHFW_INDIA

కోవిడ్‌-19కు సంబంధించిన సాంకేతిక సందేహాల్ని స‌మాధానం కోసం ఈ కింది మెయిల్ ఐడీల‌కు పంపవ‌చ్చుః
technicalquery.covid19[at]gov[dot]in

ఇత‌ర సందేహాలను ncov2019[at]gov[dot]in మ‌రియు @CovidIndiaSeva కు పంపించి వాటిని నివృత్తి చేసుకోవ‌చ్చు.

కోవిడ్‌-19 కు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ నెంబ‌రు)కు ఫోన్ చేసి వాటిని నివృత్తి చేసుకోవ‌చ్చు.

కోవిడ్‌- 19కు సంబంధించి  ఆయా రాష్ట్రాలు / ‌కేంద్రపాలిత‌ ప్రాంతాల‌కు సంబంధించిన  హెల్ప్‌లైన్ నంబ‌ర్ల‌ జాబితా ఈ కింది వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉందిః
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf


(Release ID: 1626300) Visitor Counter : 247