పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన పైప్‌లైన్‌ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమీక్ష

పైప్‌లైన్‌ ప్రాజెక్టుల్లో 'ఆత్మనిర్భర్ భారత్'ను మూలస్తంభంగా మారుద్దామని పిలుపు
దేశీయంగా ఉక్కు పైపుల ఉత్పత్తిలో వృద్ధి తెచ్చేలా ప్రాజెక్టులను వేగవంతం చేసిన గ్యాస్‌ సంస్థలు

Posted On: 22 MAY 2020 1:46PM by PIB Hyderabad

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు&ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన పైప్‌లైన్‌ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. చమురు, గ్యాస్‌ సంస్థల ఆధ్వర్యంలో వివిధ దశల్లో ఈ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టుల్లో సంపూర్ణ స్వదేశీకరణకు మంత్రి పిలుపునిచ్చారు.

    రూ.వెయ్యి కోట్లకు పైగా విలువైన లైన్ పైప్ టెండర్లను గెయిల్‌ పరిశీలిస్తోంది. సెప్టెంబర్ 2020 నాటికి సుమారు ఒక లక్ష మెట్రిక్‌ టన్నుల ఉక్కు దీనికి అవసరం. దేశీయ బిడ్డర్ల ద్వారా 800 కిలోమీటర్ల లైన్‌ పైపుల సరఫరా ప్రస్తుత లక్ష్యం. 'భారత్‌లో తయారీ'కి ఊతమిచ్చి దేశ స్వావలంబన లక్ష్యాన్ని సాధించేలా ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఈ పరిమాణాన్ని రెట్టింపు చేయాలని గెయిల్‌ భావిస్తోంది.

    లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తర్వాత, ప్రధాన్‌ మంత్రి ఉర్జ గంగ, జేహెచ్‌బీడీపీఎల్‌ పైప్‌లైన్‌తో పాటు ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి.దేశం మొత్తం గ్యాస్‌ పైప్‌లైన్‌ కారిడార్‌ను విస్తరించేలా, తూర్పు ప్రాంతాన్ని పశ్చిమ ప్రాంతంతో అనుసంధానించడానికి సన్నద్ధమవుతోంది. దేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడం దీని ఉద్దేశం.

I    దక్షిణ భారతదేశంలో 1450 కిలోమీటర్ల పొడవైన సహజవాయువు పైప్‌లైన్‌ను ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.6025 కోట్లు. ఆత్మనిర్భర్‌ భారత్‌ చర్యల్లో భాగంగా, రూ.2060 కోట్ల విలువైన సుమారు 1.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉక్కు పైపుల తయారీ సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు కల్పిస్తుంది.

    మొత్తం 8 ఈశాన్య రాష్ట్రాలకు నిరంతరాయంగా గ్యాస్‌ సరఫరా చేసేలా, ఇంద్రధనుష్‌ గ్యాస్‌ గ్రిడ్‌ లిమిటెడ్‌ ఈశాన్య ప్రాంతంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ గ్రిడ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంతోపాటు, భారతదేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు తోడ్పడుతుంది. దేశీయ బిడ్డర్ల నుంచి 550 కిలోమీటర్ల లైన్ పైప్‌ సరఫరా కోసం రూ.950 కోట్లకు పైగా విలువైన టెండర్లను ఐజీజీఎల్‌ పరిశీలిస్తోంది. జులై 2020 నాటికి 73 వేల మెట్రిక్‌ టన్నుల ఉక్కు పైపుల సేకరణ ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నారు.



(Release ID: 1626073) Visitor Counter : 233