విద్యుత్తు మంత్రిత్వ శాఖ

పునరుత్పాదక ఇంధన వ్యాపారం కోసం జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఒ.ఎన్.జి.సి.తో. ఒప్పందం కుదుర్చుకున్న - ఎన్.టి.పి.సి.

ఆర్.ఈ. ప్రాజెక్టులు, నిల్వ, ఇ-మొబిలిటీ & ఈ.ఎస్.జి. (ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) సాధికార ప్రాజెక్టులలో అవకాశాలను అన్వేషిస్తున్న - మహారాత్నాలు.

Posted On: 22 MAY 2020 12:37PM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసి లిమిటెడ్,  పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వశాఖలోని ప్రభుత్వ రంగ సంస్థ చమురు, సహజవాయువు కార్పొరేషన్ (ఓ.ఎన్.జి.సి.) పునరుత్పాదక ఇంధన వ్యాపారం కోసం జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం (ఎంఒయు) పై సంతకం చేశాయి.  ఈ ఒప్పందం ద్వారా రెండు కంపెనీలు పునరుత్పాదక శక్తిలో తమదైన ముద్ర వెయ్యాలని ఎదురుచూస్తున్నాయి. 

ఈ ఒప్పందంపై ఎన్‌టిపిసి డైరెక్టర్ (కమర్షియల్) శ్రీ ఎ కె గుప్తా, ఒఎన్‌జిసి డైరెక్టర్ (ఫైనాన్స్) మరియు ఇన్‌ఛార్జ్ బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ జాయింట్ వెంచర్ శ్రీ సుభాష్ కుమార్ సంతకం చేశారు.  వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరిగిన ఈ ఎంఓయూ పై సంతకం చేసే కార్యక్రమంలో ఎన్‌టిపిసి  సిఎండి   శ్రీ గుర్దీప్ సింగ్,  మరియు ఒఎన్‌జిసి  సిఎండి  శ్రీ శశి శంకర్, ఇతర డైరెక్టర్లు మరియు రెండు సంస్థల అధికారులు పాల్గొన్నారు. 

అవగాహన ఒప్పందం ప్రకారం, ఎన్టిపిసి మరియు ఒఎన్జిసి భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఆఫ్ షోర్ పవన మరియు ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటును అన్వేషిస్తాయి.

వారు సుస్థిరత, నిల్వ, ఇ-మొబిలిటీ మరియు ఈ.ఎస్.జీ. (ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) కంప్లైంట్ ప్రాజెక్టులలోని అవకాశాలను కూడా అన్వేషించాలి.

ఎన్‌టిపిసి ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో 920 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను మరియు నిర్మాణంలో ఉన్న 2300 మెగావాట్ల ఆర్‌ఇ ప్రాజెక్టులను కలిగి ఉంది.  ఈ ఒప్పందంతో, ఎన్‌టిపిసి తన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తుంది మరియు ఆఫ్ షోర్ లో పవన విద్యుత్తు మరియు విదేశాలలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను విస్తరించనుంది.  ఇది 2032 నాటికి భారతదేశపు అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్.టి.పి.సి 32 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది.

ఒఎన్‌జిసిలో 176 మెగావాట్ల పునరుత్పాదక పోర్ట్‌ఫోలియో ఉంది, ఇందులో 153 మెగావాట్ల పవన శక్తి మరియు 23 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉన్నాయి.  ఈ అభివృద్ధి పునరుత్పాదక విద్యుత్ వ్యాపారంలో ఒఎన్‌జిసి యొక్క ఉనికిని పెంచుతుంది మరియు 2040 నాటికి 10 జిగా వాట్ల పునరుత్పాదక శక్తిని తన పోర్ట్‌ఫోలియోకు చేర్చాలనే ఆశయాన్ని కలిగిస్తుంది.

ఎన్‌టిపిసి గ్రూప్ మొత్తం 62110 మెగావాట్ల సామర్థ్యంతో, ఎన్‌టిపిసిలో 70 పవర్ స్టేషన్లు ఉన్నాయి, వీటిలో 24 బొగ్గు, 7 కంబైన్డ్ సైకిల్ గ్యాస్ / లిక్విడ్ ఇంధనం, 1 హైడ్రో, 13 పునరుత్పాదక శక్తితో పాటు 25 జెవి పవర్ స్టేషన్లు ఉన్నాయి.

 

*****



(Release ID: 1626060) Visitor Counter : 245