హోం మంత్రిత్వ శాఖ

దేశ వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ఉల్లంఘనలు నివేదించబడుతున్నాయి

కోవిడ్ -19 కలిగి ఉన్న రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని చర్యలను కచ్చితంగా అమలు చేయాలి. మార్గదర్శకాలను అమలు చేయడానికి స్థానిక అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోం శాఖ సూచన

Posted On: 21 MAY 2020 7:44PM by PIB Hyderabad

కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల్లో అన్ని చర్యలను కఠినంగా అమలు చేయడం అత్యంత ఆవశ్యకం. అయితే, దేశ వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో హోం మంత్రిత్వ శాక మార్గదర్శకాల అమలులో ఉల్లంఘనలు జరుగుతున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకుని, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఇందులో మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని నొక్కి చెప్పింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని అధికారులు అన్ని రకాల అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా, వివిధ మండలాల్లో పరిస్థితిని గమనించి, నిషేధించ బడిన లేదా పరిమితులతో అనుమతించబడే కార్యకలాపాలను నిర్ణయించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు అధికారం కలిగి ఉన్నాయి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా కంటైన్ మెంట్ జోన్ లను సరైన రీతిలో నిర్వహించడం, అదే విధంగా ఈ జోన్లలో నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఈ లేఖ నొక్కిచెబుతోంది. ఇది కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడంలో కీలకమైనది. ఇందులో ఏదైనా ధిక్కరణలు గమనించినట్లైతే చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

రాత్రి కర్ఫ్యూను కచ్చితంగా పాటించడం యొక్క ప్రాముఖ్యతను కమ్యూనికేషన్ పేర్కొంది. ఎందుకంటే ఇది సామాజిక దూరాన్ని నిర్ధారించడంతో పాటు సంక్రమ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నివారించవచ్చు. దీని ప్రకారం, ఈ ఆదేశాలను కఠినంగా పాటించడాన్ని స్థానిక అధికారులు నిర్ధారించాలి. కోవిడ్ -19 నిర్వహణ కోసం జాతీయ ఆదేశాలను అమలు చేయడం మరియు ప్రజలు ముఖానికి మాస్కులు, పూర్తిగా కప్పి ఉంచే తొడుగులు ధరించడం, పని, రవాణా మరియు బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరాన్ని పాటించడం, పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యాన్ని నిర్వహించడం వంటివి అన్ని జిల్లా మరియు స్థానిక అధికారుల కర్తవ్యం అని ఇది పునరుద్ఘాటించింది. 

అధికారిక కమ్యూనికేషన్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 



(Release ID: 1625917) Visitor Counter : 244