సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        దేశవ్యాప్తంగా అన్ని కమ్యూనిటీ రేడియోల ద్వారా మాట్లాడనున్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్   శుక్రవారం రాత్రి 7 గంటలకు మంత్రి ప్రసంగం శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న మంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                21 MAY 2020 4:17PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ రేపు (శుక్రవారం) దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ రేడియోల ద్వారా మాట్లాడనున్నారు. రేపు (శుక్రవారం), 22 మే 2020న రాత్రి 7 గంటలకు మంత్రి ప్రసంగం ఉంటుంది. ఆయన మాట్లాడే సమయంలోనే దేశవ్యాప్తంగా అన్ని కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ద్వారా కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు.
    హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ ప్రసారం ఉంటుంది. ఎఫ్‌ఎం గోల్డ్ (100.1 MHz)లో రాత్రి 7.30 గం.లకు హిందీలో, రాత్రి 9.10 గం.కు ఆంగ్లంలో జావడేకర్ ప్రసంగాన్ని వినవచ్చు.
    కొవిడ్ సంబంధిత సమాచారం దేశంలోని అన్ని విభాగాలకు చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మంత్రి జావడేకర్ రేడియోల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 290 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఉన్నాయి. క్షేత్ర స్థాయి ప్రజలకు మంత్రి జావడేకర్ ప్రసంగం చేరుకోవడానికి ఈ రేడియో స్టేషన్లన్నీ కలిసి వేదికను సమకూరుస్తున్నాయి. 
    దేశంలోని అన్ని కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ద్వారా మంత్రి ఒకేసారి ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ద్వారా వచ్చే ప్రశ్నలకు మంత్రి జావడేకర్ సమాధానమిస్తారు.
 

 
                
                
                
                
                
                (Release ID: 1625793)
                Visitor Counter : 250
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam