పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

పి.ఎమ్.యు.వై. లబ్ధిదారులకు ఇంతవరకు 6.8 కోట్ల ఉచిత ఎల్.పి.జి. సీలిండర్ల పంపిణీ జరిగింది.

Posted On: 21 MAY 2020 2:52PM by PIB Hyderabad

కోవిడ్-19 కు ఆర్థిక ప్రతిస్పందనలో భాగంగా, భారత ప్రభుత్వం పేదలకు అనుకూలమైన “ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ” (పి.ఎమ్.జి.కె.వై.) ని ప్రారంభించింది. ఈ పథకం కింద, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ 8 కోట్లకు పైగా పి.ఎమ్.‌యు.వై. లబ్ధిదారులకు 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి 3 నెలల పాటు ఉచితంగా ఎల్.పి.జి. సిలిండర్లను అందిస్తోంది.  2020 ఏప్రిల్ నెలలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓ.ఎం.సి.లు) పి.ఎమ్.జి.కె.వై. కింద 453.02 లక్షల సిలిండర్లను పి.ఎమ్.‌యు.వై లబ్ధిదారులకు పంపిణీ చేశాయి. 2020 మే నెల 20వ తేదీ నాటికి ఓ.ఎం.సి.లు ఈ ప్యాకేజీ కింద  679.92 లక్షల సీలిండర్లను పి.ఎమ్.‌యు.వై లబ్ధిదారులకు పంపిణీ చేశాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి.) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేయడం జరిగింది. తద్వారా ఈ సదుపాయాన్ని పొందడంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలుగ లేదు. ఎల్.పి.జి.  సిలిండర్ల ను సరఫరా చేసే సిబ్బంది - కరోనా యోధులు, సిలిండర్లను సకాలంలో సరఫరా చేయడంతో పాటు, పరిశుభ్రత మరియు వివిధ ఆరోగ్య మార్గదర్శకాల గురించి లబ్ధిదారులలో అవగాహన కల్పిస్తున్నారు.

 

****



(Release ID: 1625763) Visitor Counter : 200