మంత్రిమండలి
వేరే స్థలాల కు వలస పోయి పని చేసే వారి కి / వివిధ ప్రదేశాల లో చిక్కుకొన్న వలస శ్రామికుల కు ఆహార ధాన్యాల కేటాయింపు కోసం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
20 MAY 2020 2:23PM by PIB Hyderabad
వేరే స్థలాల కు వలస పోయి పని చేసే వారు / వివిధ ప్రదేశాల లో చిక్కుకొన్న వలస శ్రామికులు మొత్తం దాదాపు 8 కోట్ల మంది కి ఒక్కొక్క వ్యక్తి కి నెల కు 5 కిలో ల ఆహార ధాన్యాల చొప్పున అలాగ రెండు నెలల కాలాని కి (2020వ సంవత్సరం లో మే మరియు జూన్ నెలల కు) గాను సెంట్రల్ పూల్ నుండి ఉచితంగా కేటాయించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
దీని వల్ల సుమారు 2,982.27 కోట్ల రూపాయల మేరకు ఆహార పరమైన ఆర్థిక సహాయాన్ని అందజేయవలసి వస్తుందని అంచనా వేయడం జరిగింది. దీనికి తోడు, అంతర్ రాష్ట్ర రవాణా కు, హ్యాండ్ లింగ్ చార్జీల కు మరియు డీలర్ యొక్క మార్జిన్ / అదనపు డీలర్ మార్జిన్ కలుపుకొంటే అయ్యే రమారమి 127.25 కోట్ల రూపాయల ఖర్చుల ను పూర్తి గా కేంద్ర ప్రభుత్వం భరించనుంది. ఈ ప్రకారం గా, భారత ప్రభుత్వం నుండి మొత్తం ఆర్థిక సహాయం ఇంచుమించు 3,109.52 కోట్ల రూపాయలు గా లెక్క తేలుతుందని అంచనా వేయడమైంది.
వేరే స్థలాల కు వలస పోయి పని చేసే వారి కి / విభిన్న ప్రాంతాల లో చిక్కుకొన్న ప్రవాసిత శ్రామికుల కు కోవిడ్-19 కారణం గా వాటిల్లిన ఆర్థిక భంగపాటు తో ఎదురైన కష్టాల ను ఈ కేటాయింపు కొంతవరకయినా తగ్గించగలుగుతుంది.
******
(Release ID: 1625369)
Visitor Counter : 311
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam