మంత్రిమండలి
జమ్ము కాశ్మీర్ సివిల్ సర్వీసెస్ (వికేంద్రీకరణ, నియామకాల) చట్టానికి సంబంధించి
జమ్ము కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ (రాష్ట్ర చట్టాల వర్తింపు) రెండో ఉత్తర్వు, 2020 జారీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
Posted On:
20 MAY 2020 2:12PM by PIB Hyderabad
జమ్ము కాశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ,2019 లోని సెక్షన్ 96 కింద జారీ చేసిన, జమ్ము కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ (రాష్ట్ర చట్టాల వర్తింపు) రెండో ఉత్తర్వు, 2020 వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా, ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వు, జమ్ము కాశ్మీర్ సివిల్ సర్వీసెస్ (పునర్‌వ్యవస్థీకరణ, నియామకాల) చట్టం (యాక్ట్‌నెం XVI ఆఫ్ 2010) కింద జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని రకాల ఉద్యోగాలకు స్థిర నివాస షరతు వర్తింపునకు సంబంధించిన నిబంధనను ఈ ఆర్డర్ సవరిస్తోంది.
జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉద్యోగాలకు సంబంధించి అన్ని పోస్టులకు ఈ ఆర్డర్ కింద నిర్దేసిత స్థిరనివాస ప్రమాణాలు వర్తిస్తాయి.
(Release ID: 1625328)
Visitor Counter : 261
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam