హోం మంత్రిత్వ శాఖ

భారీ పెను తుఫాను 'అంఫన్' కోసం సంసిద్ధతను పర్యవేక్షించడానికి తిరిగి సమావేశం కానున్న - ఎన్.సి.ఎం.సి.

Posted On: 19 MAY 2020 1:55PM by PIB Hyderabad

పెను తుఫాను ‘అంఫన్’ ను ఎదుర్కోవటానికి రాష్ట్రాలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు / ఏజెన్సీల సంసిద్ధతను సమీక్షించడానికి జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్.సి.ఎం.సి.) మూడవ సమావేశానికి కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షత వహించారు.

సూపర్ సైక్లోన్ మే 20వ తేదీ మధ్యాహ్నం / సాయంత్రం నాటికి పశ్చిమ బెంగాల్ తీరాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐ.ఎం.డి.) పేర్కొంది.  దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాజిల్లాల్లో గంటకు 155 నుండి 165  కిలోమీటర్ల వేగంగా భారీ గాలులు వేచే అవకాశం ఉంది., భారీ వర్షపాతంతో పాటు సముద్రంలో అలలు 4-5 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందితూర్పు మిడ్నాపూర్, దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, హౌరాహూగ్లీకోల్కతా జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశముంది.  పశ్చిమ బెంగాల్ తీరంలో 2019 నవంబర్ 9వ తేదీన వచ్చిన 'బుల్బుల్' తుఫాను సమయంలో సంభవించిన నష్టం కంటే ఇప్పుడు ఎక్కువ నష్టం జరగవచ్చునని భావిస్తున్నారు

ఈ తుఫాను కారణంగా, ఒడిశా లోని జగత్ సింగ్ పూర్, కేంద్రపాదభద్రక్, జైపూర్, బాలాసోర్ తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతంతో పాటు పెను గాలులు వీస్తాయి. తుఫాను పెరిగే అవకాశం ఉంది. 

ఈ సందర్భంగా తాము చేపట్టిన సన్నాహక చర్యల గురించి ఒడిశా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్.సి.ఎం.సి. కి తెలియజేశారు.  లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను తరలిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఆహార ధాన్యాలు, తాగునీరు, ఇతర అవసరమైన సామాగ్రిని నిల్వ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు, టెలికాం సేవల నిర్వహణ మరియు పునరుద్ధరణ కోసం బృందాలు కూడా ఆయా ప్రాంతాల్లో సిద్ధం చేశారు. 

రాష్ట్రాలు మరియు కేంద్ర సంస్థల సంసిద్ధతను సమీక్షిస్తున్న సందర్భంగా క్యాబినెట్ కార్యదర్శి మాట్లాడుతూ,  తుఫాను మార్గంలోని  లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను సకాలంలో, పూర్తిగా తరలించేలా చూడాలనీ అలాగే, వారికి ఆహారం, తాగునీరు, మందులు వంటి అవసరమైన సామాగ్రిని తగినంతగా అందజేయడానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రహదారి పై అవరోధాలను ఎప్పటికప్పుడు తొలగించడం కోసం, ఇతర పునరుద్ధరణ పనుల కోసం సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని కూడా ఆయన సూచించారు.

ఎన్.డి.ఆర్.ఎఫ్. కు చెందిన 36 బృందాలను ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో నియమించారు.   సైన్యం, నావికా దళాలకు చెందిన రక్షణ, సహాయ బృందాలుతీర రక్షక దళాలను  అవసరమైన విమానాలుఓడలతో సహా అదనపు సహాయం కోసం సిద్ధంగా ఉంచారు.  టెలీకమ్యూనికేషన్స్, విద్యుత్ మంత్రిత్వశాఖలు చెందిన వివిధ సంస్థల అధికారులను కూడా రాష్ట్రంలో నిర్వహణ, ఇతర అత్యవసర సేవలకోసం నియోగించారు. 

ఒడిశా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారుదేశీయ వ్యవహారాలూ, రక్షణ, షిప్పింగ్, విద్యుత్తు, టెలీకమ్యూనికేషన్స్, ఆరోగ్యం, ఐ.ఎమ్.డి., ఎన్.డి.ఎం.ఏ., ఎన్.డి.ఆర్.ఎఫ్. మంత్రిత్వశాఖలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు 

తాజా పరిస్థితిని తెలుసుకోడానికి ఎన్.సి.ఎం.సి. మళ్ళీ సమావేశమవుతుంది.  

******



(Release ID: 1625173) Visitor Counter : 218