హోం మంత్రిత్వ శాఖ

వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వ‌ల‌స‌కార్మికులను రైలులో త‌ర‌లింపున‌కు సంబంధించిన స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొటోకాల్ (ఎస్ఒపి)

Posted On: 19 MAY 2020 1:14PM by PIB Hyderabad

 

లాక్‌డౌన్‌ చర్యలపై సవరించిన ఏకీకృత మార్గదర్శకాల కొనసాగింపులో భాగంగా 17-04-2020న , వివిధ ప్రాంతాల‌లో  చిక్కుకుపోయిన కార్మికులను రైళ్ళ‌ద్వారా త‌ర‌లింపుపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్‌ఓపి) ను విడుదల చేసింది.
 వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన కార్మికుల‌ను  రైళ్ళ‌లో త‌ర‌లించేందుకు స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొటోకాల్ ఈవిధంగా అనుమ‌తిస్తుంది:
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌తో సంప్రదించి శ్రామిక్‌ స్పెషల్ రైళ్లను న‌డ‌ప‌డానిఇక‌ రైల్వే మంత్రిత్వ శాఖ (MoR) అనుమతి ఇస్తుంది.
    అన్ని రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలు, ఇందుకు నోడల్ అధికారులను నియమించాలి.  అలా వివిధ ప్రాంతాల‌లో  చిక్కుకున్న వ్యక్తులను ఆయా ప్రాంతాల‌నుంచి వ‌చ్చే వారిని స్వీక‌రించడానికి లేదా అలాంటి వారిని స్వ‌స్థ‌లాల‌కు పంపించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
రాష్ట్రాలు ,కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ అవసరాల ఆధారంగా, స్టాప్‌లు ,గమ్యస్థానాలతో సహా రైలు షెడ్యూల్‌ను  రైల్వే మంత్రిత్వ‌శాఖ‌ ఖరారు చేస్తుంది. వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన  కార్మికులను పంపించడానికి , స్వీకరించడానికి తగిన ఏర్పాట్లు చేయ‌డానికి రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు రైల్వే మంత్రిత్వ‌శాఖ‌ ద్వారా తెల‌ప‌డం జ‌రుగుతుంది.
 రైలు షెడ్యూల్ , ప్రచారం, ప్రయాణీకుల ప్రవేశం  , ప్ర‌యాణికుల త‌ర‌లింపున‌కు సంబంధించిన ప్రోటోకాల్స్, కోచ్‌ల‌లో అందించాల్సిన సేవలు , టిక్కెట్ల బుకింగ్ కోసం రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌తో క‌లిసి రైల్వే మంత్రిత్వ‌శా్ఖ ఏర్పాట్లు చేస్తుంది..
    వ‌ల‌స కూలీలను పంపుతున్న రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, ప్ర‌యాణికులంద‌ర‌నీ త‌ప్ప‌నిస‌రిగా ప‌రీక్షించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి. ఎలాంటి కోవిడ్ ల‌క్ష‌ణాలు లేని వారిని మాత్ర‌మే రైలు ఎక్క‌డానికి అనుమ‌తిస్తారు.
రైలు ఎక్కే స‌మయంలో, ప్ర‌యాణ స‌మ‌యంలో ప్ర‌యాణికులంద‌రూ సామాజిక దూరం పాటించాలి.
వ‌ల‌స కార్మికులు త‌మ త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకున్న అనంత‌రం, ప్ర‌యాణికులు ఆయా రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో అమ‌లులో ఉన్న హెల్త్ ప్రొటోకాల్స్ ప్ర‌కారం ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకుని అందుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.
 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సంబంధించి అధికారిక క‌మ్యూనికేష‌న్ కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి:


(Release ID: 1625160) Visitor Counter : 275