ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

73వ ప్రపంచ ఆరోగ్య సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న - డాక్టర్ హర్ష వర్ధన్.

కోవిడ్-19 నిర్వహణలో భారతదేశం సకాలంలో తీసుకున్న ఉత్తమ శ్రేణి, అనుకూల-క్రియాశీల చర్యలను వివరించిన - డాక్టర్ హర్ష వర్ధన్.

Posted On: 18 MAY 2020 8:27PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 73వ ప్రపంచ ఆరోగ్య సదస్సులో (డబ్ల్యూ.హెచ్.ఏ.) లో పాల్గొన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.) డైరెక్టర్ జనరల్ చేసిన ప్రసంగంపై డాక్టర్ హర్ష వర్ధన్ వ్యక్తపరిచిన భారతదేశ ప్రతిస్పందన ఈ విధంగా ఉంది : 

" గౌరవనీయురాలైన ప్రపంచ ఆరోగ్య సదస్సు అధ్యక్షురాలు కుమారి కేవా బైన్

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్, 

మరియు ఇతర గౌరవనీయులైన ప్రతినిధులారా, 

కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ముందుగా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.  ఈ పోరాటంలో ముందువరుసలో ఉండి అసమానమైన సేవలందిస్తున్న వారందిరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుకుంటున్నాను. 

మేము, భారతదేశంలో కోవిడ్-19 సవాలును ఒక అత్యున్నత స్థాయి రాజకీయ నిబద్ధతతో చేపట్టాము.  గౌరవనీయులైన మా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పరిస్థితిని ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ, ఉత్తమ శ్రేణి, అనుకూల-క్రియాశీల చర్యలు అమలు అయ్యేటట్లు చూస్తున్నారు.   ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు ఏ అవకాశాన్ని వదలకుండా కృషి చేస్తున్నారు.

ప్రవేశ ప్రదేశాల వద్ద నిఘా, విదేశాలలో చిక్కుకున్న పౌరులను తరలించడం, పటిష్టమైన వ్యాధుల పర్యవేక్షణ నెట్‌వర్క్ ద్వారా భారీగా సమాజ నిఘా, ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం, రెండు మిలియన్లకు పైగా ఫ్రంట్‌లైన్ మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడం, రిస్క్ కమ్యూనికేషన్ మరియు కమ్యూనిటీ ప్రమేయం వంటి అవసరమైన అన్ని చర్యలను భారతదేశం సకాలంలో తీసుకుంది.  మా వంతు కృషిని మేము బాగా చేశామని నేను భావిస్తున్నాను.  మేము నేర్చుకుంటున్నాము, వచ్చే నెలల్లో మేము ఇంకా బాగా చేయగలమనే  నమ్మకం మాకుంది

గౌరవనీయులారా,  

కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఈ రోజు ఇక్కడ బలవంతంగా కలవవలసి వచ్చింది.  ఈ 73వ డబ్ల్యూ.హెచ్.ఏ. మొట్ట  మొదటిసారి ఊహించని రీతిలో  ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతోంది.  అయితే, ఇది చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే, మనం ఇక్కడ కూర్చుని చర్చిస్తూ ఉంటే, ఆ మహమ్మారి వేలాది మందిని చంపుతూ ఉంటుంది. అప్పుడు అది ఒక తీవ్రమైన మాంద్యానికి కూడా కారణమౌతుంది. 

ఇది మానవజాతి  అంతా తప్పకుండా కలిసి రావలసిన సమయం. అన్ని ప్రభుత్వాలు, పరిశ్రమలు, దాతృత్వ సంస్థలు, వ్యక్తులు కలిసి, ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలను నిర్ధారించి, దీర్ఘకాలిక ప్రాధాన్యత నివ్వడానికి మరియు వారి వనరులను ఒక చోట సమీకరించడానికి  ముందుకు రావలసినదిగా ఈ రోజు నేను కోరుతున్నాను. 

మా వంతుగా, ద్వైపాక్షిక, ప్రాంతీయ భాగస్వామ్యాలను పెంపొందించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది.  మా ప్రధానమంత్రి సమర్ధవంతమైన నాయకత్వంలో, 123 దేశాలకు సంఘీభావ వ్యక్తీకరణలో భాగంగా భారతదేశం అత్యవసర ఔషధాలను సరఫరా చేసింది.

చికిత్సా, డయాగ్నస్టిక్స్ మరియు టీకాలు మాత్రమే ప్రపంచం మొత్తానికి ఈ మహమ్మారి నుండి బయటపడటానికి ఏకైక మార్గం.  ప్రపంచ సహకారం చాలా ముఖ్యమైనది. ప్రమాదం, పరిశోధన, తయారీ మరియు పంపిణీ కోసం చెల్లించడానికి,  ప్రభుత్వం, పరిశ్రమ మరియు దాతృత్వం కలిసి వనరులను సమీకరించాలి.  అయితే, ఒక షరతు -  ఎవరు, ఎక్కడ పనిచేసినా రివార్డులు అందరికీ  అందుబాటులో ఉండాలి. 

రెండు రోజుల సదస్సులో భాగంగా, జనవరి నుండి మనలో ప్రతి ఒక్కరూ ఈ విపత్తును ఎలా ఎదుర్కొన్నారో  మన, అనుభవాలను ఈ రోజు మనం పంచుకోవాలి.  మన సభ్య దేశాలు ఏవైనా ఆర్ధిక, సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారికి మనం సహాయం చెయ్యాలి.  ఉద్యమ స్పూర్తితో, సహకార మార్గంలో పరిశోధన, అభివృద్ధి ని కొనసాగించాలని అంగీకరించాలి.  

మానవత్వాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్న వారందరినీ అభినందించడంలో, అన్ని అంతర్జాతీయ సంస్థలను 21 వ శతాబ్దపు వాస్తవికతలను మరింత ప్రతిబింబించేలా చేసే ప్రయత్నాలను మనం స్వాగతిద్దాము.  అర్ధవంతమైన మరియు విస్తృత-ఆధారిత మార్పును ప్రోత్సహించడానికి ఇటువంటి ప్రయత్నాలతో భారతదేశం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. 

 

ప్రాణాంతకమైన వైరస్‌కు వ్యతిరేకంగా ఈ యుద్ధంలో ముందంజలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ రోజు నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.  

వైద్యులు, నర్సులుపారామెడికల్ సిబ్బంది, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు, డెలివరీ బాయ్స్, రక్షణ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇంకా అజ్ఞాతంగా సేవలందించిన మహా పురుషులందరినీ గౌరవించడం కోసం నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. వారే నిజమైన హీరోలు

ఇటువంటి మహనీయమైన సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు అనేక ధన్యవాదములు. ”

****


(Release ID: 1625025) Visitor Counter : 280