రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు ఫేజ్‌-2ః భార‌తీయుల‌ను ఓడ‌లోకి ఎక్కించుకొని మాలే నుంచి భార‌త్‌కు బయ‌లుదేరిన‌ ఐఎన్ఎస్ జ‌లాశ్వ నౌక‌

Posted On: 16 MAY 2020 11:25AM by PIB Hyderabad

కోవిడ్ -19 నేప‌థ్యంలో తీర దేశాల‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చే జాతీయ ప్ర‌య‌త్నానికి భార‌త నావికాదళం త‌న‌వంతు తోడ్పాటును అందిస్తోంది. ఆపరేషన్ సముద్ర‌ సేతులో భాగంగా మాల్దీవులోని మాలే ఓడరేవు వద్ద ఈ నెల 15న భారత నావికాదళ నౌక జలాశ్వ‌ 588 మంది భారత‌ పౌరులను ఎక్కించుకొంది. మాలే నుంచి భార‌త్‌కు రానున్న‌
మొత్తం 588 మంది ప్ర‌యాణికుల‌లో ఆరుగురు గ‌ర్భిణిలు మరియు 21 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మాలే వ‌ద్ద 30 -40 నాట్ల ఈదురు గాలులు, భారీవ‌ర్షం నేప‌థ్యంలో కూడా ఓడలోని సిబ్బంది తిరుగు ప్రయాణానికి కావాల్సిన అన్ని చ‌ర్య‌లనూ పూర్తి చేశారు. ప్రయాణీకుల భద్రత మరియు వైద్య ప్రోటోకాల్‌లను అవ‌లంభిస్తూ అన్ని ర‌కాల ఫార్మాలిటీలను పూర్తి చేశారు. ఓడలోనే ప‌లు ర‌కాల‌ పూర్వ-ఎంబార్కేషన్ కార్యకలాపాలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. మాలేలో ప్రతికూల వాతావర‌ణ ప‌రిస్థితులు ప్రణాళికాబద్ధమైన ఎంబార్కేషన్ ప్రక్రియల‌కు ఆటంకంగా నిలుస్తున్నాయి. అన్ని చ‌ర్య‌లు పూర్తి చేసుకొని భార‌త నౌక ఈ రోజు ఉదయం మాలే నుండి కొచ్చికి బయలుదేరింది. 

 



(Release ID: 1624489) Visitor Counter : 168