ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ, డెన్మార్క్ ప్ర‌ధాని హ‌ర్ ఎక్సెల‌న్సీ మెట్టె ఫ్రెడ‌రిక్స‌న్ మ‌ధ్య‌న చ‌ర్చ‌లు

Posted On: 14 MAY 2020 8:03PM by PIB Hyderabad

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ, డెన్మార్క్ ప్ర‌ధాని హ‌ర్ ఎక్సెల‌న్సీ మెట్టె ఫ్రెడ‌రిక్స‌న్ మ‌ధ్య‌న ఫోన్ ద్వారా చ‌ర్చ‌లు జ‌రిగాయి. కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని నిరోధించ‌డానికిగాను ఇరుదేశాల్లో తీసుకుంటున్న‌చ‌ర్య‌ల‌ గురించి ఇరువురు నేత‌లు మాట్లాడారు. లాక్ డౌన్ నిబంధ‌న‌ల్ని ఎత్తేసిన త‌ర్వాత వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌కుండా డెన్మార్క్ దేశం తీసుకున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు. భార‌తీయ‌, డెన్మార్క్ నిపుణులు ఒక‌రితో మ‌రొక‌రు సంప్ర‌దింపులు చేసుకుంటూ ఒక‌రి అనుభ‌వాల‌నుంచి మ‌రొక‌రు నేర్చుకుంటున్నార‌ని ఇది ఇలాగే కొన‌సాగాల‌ని ఇరువురు నేత‌లు అంగీక‌రించారు.  
ఇండియా, డెన్మార్క్ దేశాల మ‌ధ్య‌న సంబంధాల‌ను బ‌లోపేతం చేసుకోవాల‌నే ఆకాంక్ష‌ను ఇరువురు నేత‌లు వ్య‌క్తం చేశారు. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి స‌మ‌స్య తొల‌గిపోయిన త‌ర్వాత ఇరు దేశాలు క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల్సిన అంశాల గురించి ఇరువురు నేత‌లు మాట్లాడుకున్నారు. 
ఈ ఏడాది మే 12న ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మ‌ధ్య‌న ఏర్పాటైన జాయింట్ క‌మిష‌న్ స‌మావేశాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డాన్ని ఇరు దేశాల నేత‌లు ఆహ్వానించారు. 
ఆరోగ్య రంగ ప‌రిశోధ‌న‌లు, ప‌ర్యావ‌ర‌ణ‌హిత ఇంధ‌నం, వాతావ‌రణ‌మార్పుల‌కు త‌ట్టుకొని నిల‌బ‌డ‌గ‌ల‌గ‌డం మొద‌లైన అంశాల్లో ప‌ర‌స్ప‌రం మేలు జ‌రిగేలా భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పుకోవ‌చ్చ‌ని ఇరువురు నేత‌లు నిర్ణ‌యించారు. ఇరు దేశాల మ‌ధ్య‌న బ‌ల‌మైన‌ హ‌రిత వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పే దిశ‌గా ప‌ని చేయాల‌ని ఇరు దేశాల నేత‌ల నిర్ణ‌యించారు. 

***



(Release ID: 1623981) Visitor Counter : 253