ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోబాస్ 6800 ప‌రీక్షా యంత్రాన్ని జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

దేశ‌వ్యాప్తంగా 500 ల్యాబ్‌ల‌లో కోవిడ్ -19 నిర్ధార‌ణ కోసం సుమారు 20 ల‌క్ష‌ల న‌మూనాల ప‌రీక్ష‌ల‌నిర్వ‌హ‌ణ‌: డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌
కోవిడ్ కేసుల రెట్టింపు స‌మ‌యం గ‌త మూడు రోజులు త‌గ్గి సుమారు 14 రోజుల‌కు చేరింది.

Posted On: 14 MAY 2020 3:53PM by PIB Hyderabad

 

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఈరోజు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి)ని సంద‌ర్శించి, కొబాస్ 6800 ప‌రీక్షా యంత్రాన్ని జాతికి అంకితం చేశారు. కోవిడ్ -19 కేసుల‌కు భార‌త ప్ర‌భుత్వం ఇలాంటి ప‌రీక్షా యంత్రాన్ని స‌మ‌కూర్చుకోవ‌డం ఇదే మొద‌టిసారి. దీనినియ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ లో ఏర్పాటు చేశారు.

 కంట్రోల్ రూమ్ , టెస్టింగ్ లాబొరేటరీలను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి సందర్శించారు . COVID-19 పరీక్షల‌కు సంబంధించి  ప్రస్తుత స్థితిని డైరెక్టర్ (ఎన్‌సిడిసి) డాక్టర్ ఎస్ కె సింగ్ ,ఇత‌ర ఉన్నతాధికారులతో ఆయ‌న సమీక్షించారు. పరీక్షా సామర్థ్యాన్ని పెంచడంలో సాధించిన విజయాలను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌,, ఇప్పుడు రోజుకు 1,00,000 పరీక్షలను నిర్వహించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశామ‌న్నారు. 359 ప్రభుత్వ ప్రయోగశాలలు , దేశంలోని 145 ప్రైవేట్ ప్రయోగశాలలతో సహా 500 కి పైగా ప్రయోగశాలలలో కోవిడ్ -19 కు సంబంధించి దాదాపు 20 లక్షల పరీక్షలను  నిర్వ‌హించి ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయిని చేరామ‌న్నారు. ఎన్‌సిడిసి ఇప్పుడు కోబాస్ 6800 యంత్రాన్నికలిగి ఉంద‌ని, ఇది దేశ సేవలో రియల్ టైమ్ పిసిఆర్ టెస్టింగ్ కోవిడ్ -19 ను నిర్వహించడానికి పూర్తిగా ఆటోమేటెడ్, హై ఎండ్ మెషీన్ అన్నారు. కోబాస్ 6800, 24 గంటల్లో 1200 నమూనాలను క‌చ్చిత‌త్వంతో పరీక్షిస్తుంది ఇది పెండెన్సీ ని త‌గ్గించి, పరీక్ష సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచుతుంద‌ని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌ చెప్పారు.
దాని ఇతర ముఖ్యాంశాల‌ను తెలియ‌జేస్తూ , డాక్టర్ హర్ష్ వర్ధన్ , కోబాస్ 6800 అనేది రోబోటిక్స్ తో  అనుసంధానించిన‌ ఒక అధునాతన యంత్రం, ఇది కలుషిత మ‌య్యే అవకాశాన్ని తగ్గిస్తుంది , ఆరోగ్య సంరక్షణ కార్మికులకు వైర‌స్ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఎందుకంటే ఇది పరిమితమైన మానవ జోక్యంతో రిమోట్ తో పనిచేయగలదు. పరీక్ష కోసం యంత్రానికి కనీస BSL2 + టెస్టింగ్ కు కంటైన్ మెంట్ స్థాయిఅవసరం కాబట్టి, దానిని ఎక్క‌డంటే అక్క‌డ‌ ఉంచలేము.
కోవిడ్ మహమ్మారి ప్రారంభం నుండి ప్రతిరోజూ వైద్యులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు  ఇత‌ర క్షేత్ర‌స్తాయి సిబ్బంది చేస్తున్న‌ నిస్వార్థ సేవలకు తన ప్ర‌గాఢ‌ కృతజ్ఞతలు తెలుపుతూ, డాక్టర్ హర్ష్ వర్ధన్ , “ 'కరోనా వారియర్స్స‌ విపరీతమైన ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్న పాథాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, శాస్త్రవేత్తలు , ఇతర సిబ్బందికి నేను వందనం చేస్తున్నాను. తోటి దేశస్థులను రక్షించడానికి రాత్రింబ‌గ‌ళ్ళు వారు విధి నిర్వహణలో. ఉన్నారు . అని ఆయ‌న అన్నారు. ఈ ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ల సహకారాన్ని దేశం ప్రశంసించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

కోవిడ్ వ్యాప్తిని ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తించి క‌నిపెట్టే నిఘా సిబ్బంది  అంకితభావం, కృషి , చిత్తశుద్ధిని డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రశంసించారు , నూతన శక్తితో కోవిడ్  పై పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా ఆయ‌న వారిని ప్రోత్సహించారు. కమ్యూనిటీ నిఘా కాంటాక్ట్ ట్రేసింగ్   ప్రాధాన్య‌త  గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి నొక్కిచెప్పారు. ఇంట్లో లేదా క్వారంటైన్ లో ఉన్న ప్రజలందరూ ఎంతో  జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంద‌న్నారు.  సామాజిక దూరం , వ్యక్తిగత పరిశుభ్రత  ప్రోటోకాల్‌లను పాటించాల‌న్నారు. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు  చిన్న పిల్లల ప‌ట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంద‌ని ”అని ఆయన అన్నారు
కోవిడ్ కేసుల రెట్టింపు స‌మ‌యం గ‌త మూడురోజుల‌లో మంద‌గించ‌డం ప‌ట్ల డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ సంతోషం వ్య‌క్తం చేశారు.  గ‌త మూడు రోజుల‌ల కేసుల రెట్టింపు స‌మ‌యం 13.9 రోజుల‌కు చేరింద‌ని , 14 రోజుల క్రితం ఇది 11.1 గా ఉంద‌ని ఆయ‌న అన్నారు. మ‌ర‌ణాల రేటు 3.2 శాతం గా ఉన్న‌ద‌ని, రిక‌వ‌రీ రేటు మరింత మెరుగుప‌డింద‌న్నారు. ఇవాళ ఇది 33.6 శాతంఆ ఉంద‌ని చెప్పారు. (నిన్న ఇది 32.83 శాతం) . నిన్న‌టి వ‌ర‌కు ఐసియులో 3.0 శాతం మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతుండ‌గా 0.39 మంది వెంటిలేట‌ర్‌పైన‌, 2.7 శాతం మంది ఆక్సిజ‌న్ మ‌ద్ద‌తుపైన ఉన్నార‌న్నారు. , 14 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలలో  గ‌త 24 గంట‌ల‌లో ఎలాంటి కేసులు న‌మోదు కాలేదు. అవి, అండ‌మాన్ నికోబార్ దీవులు, అరుణాచ‌ల్  ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, చండీఘ‌డ్‌, దాద్రా న‌గ‌ర్ హ‌వేలి, గోవా, చ‌త్తీస్‌ఘ‌డ్‌, గుజ‌రాత్‌, జార్ఖండ్‌, మ‌ణిపూర్‌, మేఘాల‌య‌, మిజోరం, పుదుచ్చేరి, తెలంగాణ డామ‌న్ డ‌య్యు, సిక్కిం, నాగాలాండ్‌, ల‌క్ష‌ద్వీప్‌, లు. వీటిలో ఈరోజు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి కేసులు న‌మోదుకాలేదని ఆయ‌న చెప్పారు.
2020 మే 14 వ తేదీనాటికి దేశ‌వ్యాప్తంగా  మొత్తం 78,003 కోవిడ్ -19 కేసులు  న‌మోదు కాగా, ఇందులో 26,235 మందికి వ్యాధిన‌య‌మైంది.  2549 మంది మ‌ర‌ణించారు. గ‌త 24 గంట‌ల‌లో దేశ‌వ్యాప్తంగా 3,722 కొత్త కోవిడ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.


(Release ID: 1623949) Visitor Counter : 319