ప్రధాన మంత్రి కార్యాలయం

అంతర్జాతీయ నర్సుల దినం నాడు నర్సుల కు కృత‌జ్ఞత‌ ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 12 MAY 2020 5:05PM by PIB Hyderabad

అంతర్జాతీయ నర్సుల దినం సందర్భం లో నర్సుల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కృత‌జ్ఞత‌ ను వ్యక్తం చేశారు.

‘‘మన భూగ్రహాన్ని ఆరోగ్యవంతం గా నిలపడం కోసం రాత్రనక పగలనక శ్రమిస్తున్న అసాధారణ నర్సు ల సేవ ల పట్ల కృత‌జ్ఞత‌ ను వ్యక్తం చేసేటటువంటి ఒక విశిష్టమైనటువంటి రోజు అంతర్జాతీయ నర్సుల దినం.  ప్రస్తుతం వారు కోవిడ్-19 ని ఓడించే దిశ లో గొప్ప పని ని చేస్తున్నారు.  నర్సుల పట్ల మరియు వారి కుటుంబాల పట్ల మనం అమిత కృత‌జ్ఞత తో నడుచుకొందాము.

‘‘ఫ్లోరెంస్ నైటింగేల్ నుండి ప్రేరణ ను అందుకొన్నటువంటి, కష్టించే స్వభావం కలిగినటువంటి మన నర్సింగ్ సిబ్బంది పరిపూర్ణ దయామూర్తులు.  ఈ రోజు న, నర్సుల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉంటామంటూ మన వచనబద్ధత ను పునరుద్ఘాటిద్దాము; మరి అలాగే, ఈ రంగం లో అవకాశాల కల్పన పై ఇతోధిక శ్రద్ధ ను వహిద్దాము.. తద్ద్వారా సంరక్షణ ప్రదాత ల కు కొదువ ఏర్పడబోదు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 


(Release ID: 1623364) Visitor Counter : 349