రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ , ఏప్రిల్ 2020 అమ్మకాలు 71% పెరుగుదల

Posted On: 10 MAY 2020 2:59PM by PIB Hyderabad

రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని పిఎస్‌యు అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 2020 ఏప్రిల్ నెలలో ఎరువుల అమ్మకంలో 71 శాతం వృద్ధిని నమోదు చేసింది. కోవిడ్ -19 లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్‌లో దేశంలో కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ కంపెనీ ఎరువుల అమ్మకాన్ని 3.62 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో 2.12 లక్షల మెట్రిక్ టన్నులఅమ్మకాలు జరిగాయి. 

  

లాక్‌డౌన్ కారణంగా కంపెనీ చాలా లాజిస్టిక్స్ అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చిందిఅయినప్పటికీ ఈ కీలకమైన కాలంలో ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడానికి ఏ అవకాశాన్ని జారవిడుచుకోకుండా  2020 ఏప్రిల్ నెలలో అమ్మకాలలో అత్యధిక వృద్ధిని సాధించినందుకు సిఎండిఎన్‌ఎఫ్‌ఎల్షి మనోజ్ మిశ్రా మార్కెటింగ్ బృందం చేసిన కృషిని ప్రశంసించారు. 

ఎన్ఎఫ్ఎల్ పంజాబ్ లోని నంగల్బతిండాహర్యానాలోని పానిపట్ లో ఉన్న ఐదు ప్లాంట్లలోఎం.పి.లోని విజయపూర్ వద్ద రెండు ప్లాంట్లలో యూరియాను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 35.68 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా. ఈ అన్ని ఉత్పత్తులతోకంపెనీ 2019-20లో అత్యధికంగా 57 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మకాన్ని నమోదు చేసిందిఇది వరుసగా ఐదవసారి. క్లిష్ట సమయాల్లో ఈ ప్లాంటులు గరిష్ఠ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించడం పెద్ద విజయం. ముఖ్యంగా దేశంలోని వ్యవసాయదారులకు దీని ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. 

 

కోవిడ్-19తో పోరాడటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఎన్ఎఫ్ఎల్ ఉద్యోగులు ఒక రోజు జీతం పీఎం కేర్స్ ఫండ్ కి రూ.88 లక్షలు మాత్రమే కాకుండా సిఎస్ఆర్ కింద రూ.63.94 లక్షలు కలిపి మొత్తం రూ.1.52 కోట్లు విరాళాలుగా అందించారు.

***



(Release ID: 1622688) Visitor Counter : 255