పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులు, వైద్య అవసరాల నిరంతర సరఫరాకు ఇప్పటివరకు 490 లైఫ్ లైన్ ఉడాన్ విమానాల సేవలు
Posted On:
09 MAY 2020 3:06PM by PIB Hyderabad
ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఎఎఫ్ మరియు ప్రైవేట్ క్యారియర్లు లైఫ్లైన్ ఉడాన్ కింద 490 విమానాలను నడుపుతున్నాయి. వీటిలో 289 విమానాలను ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ నడుపుతున్నాయి. 8 మే 2020 న రవాణా అయిన సరుకు 6.32 టన్నులు కలుపుకుని మొత్తం 848.42 టన్నుల సరుకు రవాణా జరిగింది.
అలయన్స్ ఎయిర్ 8 మే 2020 న 2 విమానాలను నడపగా, 8 విమానాలు ఐఏఎఫ్ ఆపరేట్ చేసింది. ఇప్పటి వరకు లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు 4,73,609 కిలోమీటర్లు ప్రయాణం చేశాయి. 'లైఫ్లైన్ ఉడాన్' విమానాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆపరేట్ చేస్తోంది. ఇవి కోవిడ్-19పై భారత్ చేస్తున్న యుద్ధానికి మద్దతు నిస్తూ దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యసర వైద్య సరకులను రవాణా చేస్తున్నాయి.
పవన్ హన్స్ లిమిటెడ్‌తో సహా హెలికాప్టర్ సేవలు జమ్మూ, కశ్మీర్, లడఖ్, ఈశాన్య ప్రాంతాల్లో కీలకమైన వైద్య సరుకులను, రోగులను గమ్యాలకు చేరవేశాయి. 8 మే 2020 వరకు పవన్ హన్స్ మొత్తం 8,001 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి 2.32 టన్నుల సరుకును చేరవేసింది. దేశీయ కార్గో ఆపరేటర్లు స్పైస్ జెట్, బ్లూ డార్ట్, ఇండిగో, విస్టారా వాణిజ్య ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నారు. స్పైస్జెట్ మార్చి 24 నుండి 8 మే 2020 వరకు 916 కార్గో విమానాలు 6,587 టన్నుల సరుకును చేరవేశాయి. వీటిలో 16 అంతర్జాతీయ సరకు రవాణా విమానాలు.
ఇండిగో ఏప్రిల్ 3 నుండి మే 8 వరకు 1,96,263 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి 585 టన్నుల సరుకును రవాణా చేసింది. 46 అంతర్జాతీయ విమానాలతో సహా 121 కార్గో విమానాలను నడిపింది. ప్రభుత్వానికి ఉచితంగా తీసుకునే వైద్య సామాగ్రి కూడా ఇందులో ఉంది. విస్టారా ఏప్రిల్ 19 నుండి 20 మే 2020 వరకు 32 కార్గో విమానాలను 32,321 కిలోమీటర్ల దూరాన్ని నడిపి 150 టన్నుల సరుకును రవాణా చేసింది.
ఫార్మస్యూటికల్స్, వైద్య పరికరాలు, కోవిడ్ -19 కి అవసరమైన సహాయ వస్తువుల రవాణా కోసం తూర్పు ఆసియాకు వస్తు రవాణా గగన తల మార్గం ఏర్పాటయింది. ఎయిర్ ఇండియా తీసుకువచ్చిన మొత్తం వైద్య సరుకు పరిమాణం 1075 టన్నులు. బ్లూ డార్ట్ గ్వాంగ్జౌ, షాంఘై నుండి సుమారు 131 టన్నులు, హాంకాంగ్ నుండి 24 టన్నుల వైద్య వస్తువులను తీసుకొచ్చాయి.
****
(Release ID: 1622508)
Visitor Counter : 268
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Kannada