ఆర్థిక మంత్రిత్వ శాఖ

కొన్ని సంస్థల నమోదు, ఆమోదం మొదలైన వాటికి సంబంధించిన కొత్త విధానం 2020 అక్టోబర్ 1 వరకు వాయిదా

Posted On: 09 MAY 2020 10:41AM by PIB Hyderabad

మున్నెన్న‌డూ లేని రీతిలో మాన‌వ‌త, ఆర్థిక  సంక్షోభం ఎదుర్కొంటున్న స‌మ‌యంలో సిబిడిటి,  కొన్ని ర‌కాల సంస్థ‌ల అనుమ‌తి, రిజిస్ట్రేష‌న్‌, నోటిఫికేష‌న్ వంటివాంటికి సంబంధించిన నూత‌న విధానాల అమ‌లును అక్టోబ‌ర్ 1,2020 వ‌ర‌కు వాయిదా వేసింది.
దీనిప్ర‌కారం,ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం1961లోని  సెక్ష‌న్ 10(23సి),12ఎఎ,35, 80 జి కింద అనుమ‌తి పొందిన‌, రిజిస్ట‌ర్ అయిన‌, నోటిఫై అయిన సంస్థ‌లు  త‌మ ఇంటిమేష‌న్‌ను అక్టోబ‌ర్ 1 నుంచి మూడునెల‌ల‌లోపు దాఖ‌లు  చేయాలి. అంటే 2020 డిసెంబ‌ర్ 31 లోగా దాఖ‌లు చేయాలి. అలాగే అనుమ‌తి పొంద‌డానికి ,రిజిస్ట్రేష‌న్‌కు, కొత్త‌సంస్థ‌ల నోటిఫికేష‌న్‌కు సంబంధించి స‌వ‌రించిన ప్ర‌క్రియ 1అక్టోబ‌ర్‌, 2020 నుంచి అమ‌లులోకి వ‌స్తుంది.
ఇందుకు సంబందించిన చ‌ట్ట‌ప‌రమైన స‌వ‌ర‌ణ‌ల‌ను త‌గిన స‌మ‌యంలో ప్ర‌తిపాదిస్తారు.
నోవెల్‌ కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి చెందడం , దాని ఫ‌లితంగా విధించిన లాక్‌డౌన్   కారణంగా 2020 జూన్ 1 నుండి కొత్త విధానాన్ని అమలు చేయనుండ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ  ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప‌లు అభ్య‌ర్థ‌న‌లు వచ్చాయి. కొత్త విధానం అమ‌లును ప్ర‌స్తుతానికి వాయిదా వేయాల‌ని సూచిస్తూ ప‌లు అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయి..
ఫైనాన్స్ యాక్ట్ 2020, సెక్షన్లు 10 (23 సి), 12 ఎఎ, 35 , 80 జిలలో సూచించిన‌ కొన్ని సంస్థల ఆమోదం , నమోదు , నోటిఫికేషన్‌కు సంబంధించిన విధానాన్ని2020 జూన్ 1 నుంచి హేతుబద్ధం చేసిందని గమనించవచ్చు.
క్రొత్త విధానం ప్రకారం, ఈ విభాగాల క్రింద ఇప్పటికే ఆమోదం పొందిన‌ ,నమోదైన‌, తెలియజేసిన‌ ఎంటిటీలు మూడు నెలల్లో, అంటే 2020 ఆగస్టు 31 లోగా సమాచారం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే, కొత్త సంస్థల ఆమోదం , నమోదు , నోటిఫికేషన్ కోసం విధానాన్ని జూన్ 1, 2020 నుండి హేతుబ‌ద్ధం చేశారు.

 



(Release ID: 1622427) Visitor Counter : 354