కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఐ.సి.ఎం.ఆర్. ప్రాంతీయ డిపోల నుంచి కోవిడ్ -19 టెస్టింగ్ కిట్ లను మారుమూల ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా టెస్టింగ్ ల్యాబ్ లకు అందజేస్తున్న ఇండియా పోస్ట్

Posted On: 08 MAY 2020 4:57PM by PIB Hyderabad

ఐ.సి.ఎం.ఆర్. కు గల 16 ప్రాంతీయ డిపోల నుంచి కోవిడ్ -19 టెస్టింగ్ కిట్ లను దేశ వ్యాప్తంగా 200 అదనపు ల్యాబ్ లకు పంపిణీ చేయడానికి ఇండియన్ పోస్ట్ ఐ.సి.ఎం.ఆర్.తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్) దేశ వ్యాప్తంగా రోజుకు లక్ష పరీక్షలు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన క్రమంలో 1,56,000 పోస్టాఫీసులు కలిగిన ఇండియా పోస్ట్ మరో సారి బలమైన కోవిడ్ యోధునిగా పని చేసేందుకు సిద్ధమైంది. దుంగార్ పూర్, చురు, ఝలాల్ వార్, కోల్ కతా, భువనేశ్వర్, రాంచి, జోధ్ పూర్, ఉదయ్ పూర్, కోటా లాంటి ప్రదేశాలే గాకుండా ఇంఫాల్, ఐజ్వాల్ వంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఇండియా పోస్ట్ వీటిని తీసుకువెళుతోంది.

కేంద్ర కమ్యూనికేషన్స్, ఈ అండ్ ఐటీ, లా అండ్ జస్టిస్ శాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ఐ.సి.ఎం.ఆర్ మరియు పోస్టల్ శాఖల భాగస్వామ్యాన్ని వారి నిబద్ధతను ప్రశంసించారు. ఇండియా పోస్ట్ ఉత్తరాలు, మందులు, ఆర్థిక సహాయాలను ఇంటి వద్దకే పంపిణీ చేస్తోందని, అంతే గాకుండా లాక్ డౌన్ సమయంలో అవసరమైన వారికి ఆహారం మరియు రేషన్ కూడా పంపిణీ చేస్తోందని, ఈ కీలకమైన సమయంలో భారతదేశ పోస్టల్ విభాగం, అందులో భాగమైన పోస్ట్ మేన్ లు దేశంతో భుజం కలిపి నిలబడ్డారని ఆయన ప్రశంసించారు.

కిట్లు సకాలంలో అందే ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. 16 డిపోల నుంచి (14 పోస్టల్ సర్కిల్స్ / రాష్ట్రాల్లో  ఉన్న) దేశ వ్యాప్తంగా ఉన్న 200 ల్యాబ్ లకు అంటే శివమొగ్గ, తిరునల్వేలి, ధర్మపురి, తిరుపతి, డార్జిలింగ్, గ్యాంగ్ టక్, లే, జమ్మూ, ఉధంపూర్, ఝలాల్ వార్, భావ్ నగర్, షోలాపూర్, దర్భాంగా, రిషికేశ్, ఫరీద్ కోట్ లాంటి వాటికి తీసుకు వెళుతోంది. ఈ కిట్లు పొడి మంచుతో నిండి ఉంటాయి.

వీటిని సకాలంలో అందించేందుకు పోస్టర్ సిబ్బంది రాత్రింబవళ్ళు పని చేస్తున్నారు. రాత్రి 11.30కు కూడా డెలివరీలు జరుగుతున్నాయి. మిజోరాంలోని జోరం మెడికల్ కాలేజ్ వంటి దూర ప్రాంతాల్లో కూడా అవసరాలకు అనుగుణంగా కిట్ల పంపిణీ జరిగేలా ఇండియన్ పోస్ట్ చిత్త శుద్ధితో పని చేస్తోంది.

ఉత్తమమైన కార్యకలాపాల కోసం ప్రతి ప్రాంతీయ డిపో కోసం నోడల్ అధికారులను రెండు ఏజెన్సీల (డి.ఓ.పి మరియు ఐ.సి.ఎం.ఆర్) నుంచి ఎంపిక చేశారు. ఇప్పుడు ఉన్న వ్యవస్థ ప్రకారం లేదా కొత్తగా ఏర్పాటు చేసే ల్యాబ్ లకు ఆలస్యం లేకుండా సరఫరా చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరిగాయి. అవసరాన్ని బట్టి ఐ.సి.ఎం.ఆర్. నోడల్ ఆఫీసర్లు ఇతర విషయాలను తెలియజేస్తారు.

ప్రతి బుకింగ్ సర్కిల్ ఏజెన్సీకి ఇబ్బందులు లేకుండా చేయడానికి సంబంధిత డిపోలతో స్పీడ్ పోస్ట్ బి.ఎన్.పి.ఎల్(బుక్ నౌ పే లేటర్ ) ఖాతాను తెరచింది. డెలివరీ సమాచారం వాట్సాప్ ద్వారా రోజూ ల్యాబ్ లతో పంచుకుంటుంది. ఇతర అవాంతరాలు ఏవీ లేకుండా చూసేందుకు నోడల్ అధికారులు అందరించే గూగుల్ స్ప్రెడ్ షీట్స్ పంచుకోవడం జరుగుతుంది.

ఈ శాఖ తమ ఉన్నతమైన కార్యక్రమాలు కొనసాగించాలని శ్రీ రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. సకాలంలో పంపిణీ చేయడంలో ఏ అవకాశాన్ని జారవిడవొద్దని, కీలకమైన ఈ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని ఆయన సూచించారు.

 

                          

                           మిజోరంలోని జోరం మెడికల్ కాలేజీలో టెస్ట్ కిట్ల పంపిణీ

   

 

మణిపూర్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు కోవిడ్ -19 టెస్ట్ కిట్లను పంపిణీ చేస్తోన్న ఇండియన్ పోస్ట్

ఎన్.ఐ.ఎం.ఆర్, న్యూఢిల్లీ, పి.జి.ఐ. ఛండీఘర్, కె.జి.ఎం.యు, లక్నో, పి.ఎం.ఆర్,ఐ. పాట్నా, ఎన్.ఐ.ఆర్.ఎన్.సి.డి. జోథ్ పూర్, ఎన్.ఐ.ఓ.హెచ్. అహ్మదాబాద్, ఎన్.ఐ.ఆర్.ఈ.హెచ్. భోపాల్, ఎన్.ఐ.సి.ఈ.డి కోల్ కతా, ఎన్.ఐ.వి పూణె, ఎన్.ఐ.వి. ఫీల్డ్ యూనిట్ బెంగళూరు, ఎన్.ఐ.ఎన్. హైదరాబాద్, ఎన్.ఐ.ఈ. చెన్నై, ఆర్.ఎం.ఆర్.సి. డిబ్రూఘర్, ఆర్.ఎం.ఆర్. భువనేశ్వర్, ఎన్.ఐ.ఆర్.ఆర్.హెచ్. ముంబై, జి.ఎం.సి. గౌహతిలు ఐ.సి.ఎం.ఆర్. యొక్క 16 డిపోలు.

***


(Release ID: 1622264) Visitor Counter : 296