ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

క్లిష్ట స‌మ‌యాల‌లో ఇండియ‌న్ రెడ్ క్రాస్ సేవ‌ల‌ను కేంద్ర మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ , సంస్థ శ‌తాబ్ది ఉత్స‌వాల సంద‌ర్బంగా కోనియాడారు.

హ‌ర్యానాలో కోవిడ్ -19 బాధితుల‌కు స‌హాయ‌ సామ‌గ్రితీసుకువెళ్లే వాహ‌నాల‌ను జెండా ఊపి ప్రారంభం
స్వ‌చ్ఛంద ర‌క్త‌దానాన్ని ఒక ఉద్య‌మ‌స్థాయికి తీసుకువెళ్లినందుకు ఇండియ‌న్ రెడ్ క్రాస్ సొసైటీలు ఎన్న‌టికీ గుర్తింపుపొందుతాయి : డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

Posted On: 08 MAY 2020 5:44PM by PIB Hyderabad

‘ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం’ సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సిఎస్) శతాబ్ది ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ వ్యవస్థాపకుడు హెన్రీ డురాంట్ విగ్ర‌హానికి పూల‌మాల‌వేశారు . ఈ సంద‌ర్భంగా హ‌ర్యానాలోని కోవిడ్ స‌హాయ సామ‌గ్రి తీసుకువెళుతున్న వాహ‌నాల‌ను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో పిపిఇలు, మాస్క్‌లు, వైట్‌వైప్‌లు ,, బాడీ బ్యాగులు మొదలైన వి ఉన్నాయి..
వీడియో కాన్ఫరెన్స్  ద్వారా దేశంలోని వివిధ రాష్ట్ర శాఖలలో ఐఆర్‌సిఎస్ నాయకత్వం , సిబ్బందితో పరిమిత సమావేశంలో ప్రసంగించిన ఆయన, “ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి ఇది ఒక ముఖ్యమైన రోజు అని అన్నారు. ఎందుకంటే ఇది 100 సంవత్సరాల‌ను పూర్తి చేయడమే కాకుండా దాని ప్రతిష్ఠ‌, నిబద్ధతను కొనసాగిస్తూ వైద్య ,మానవతా సహాయం అందించాలనే సంస్థ నినాదాన్ని అద్భుత‌రీతిలో కొన‌సాగిస్తూ వ‌చ్చింది” అని అన్నారు.
 భారతదేశంలో స‌హాయ‌కార్య‌క్ర‌మాలు, మంచి పనులు చేప‌డుతున్నందుకు ఆయన ఐఆర్‌సిఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. "ఐఆర్సిఎస్ ఎవరి ఆదేశాల కోసం వేచి ఉండ‌కుండా, త‌న‌కుతానుగా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు దిగ‌డం , ఏదైనా విపత్తు లేదా మానవతా సంక్షోభంలో సహాయక చర్యలను అందించడం ప్రశంసనీయం”అని ఆయ‌న కొనియాడారు.

ప్ర‌స్తుత క్లిష్ట సమయంలో రక్తదానం కోసం ముందుకు రావడానికి వీలుగా సాధారణ రక్తదాతల వ‌ద్ద‌కే మొబైల్ రక్త సేకరణ వ్యాన్లను పంపిస్తున్నందుకు డాక్టర్ హర్ష్ వర్ధన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని ప్రశంసించారు. మొబైల్ వ్యాన్ల ద్వారా రక్తం సేకరించడం, మొబైల్ వాన్ ద్వారా పిక్ , డ్రాప్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఐఆర్‌సిఎస్ మానవాళికి గొప్ప సేవ చేస్తోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు, తలాసేమియాతో పాటు ఇతర రక్త రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు ఇది ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతున్న‌ద‌న్నారు.ఇతర స్వచ్ఛంద సంస్థలకు ఇది ఆద‌ర్శంగా నిలుస్తున్న‌ద‌ని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు.
దేశంలో ఏదైనా క్లిష్ట‌ప‌రిస్థితిని ఎదుర్కోవటానికి తగినంత రక్త నిల్వలను నిర్వహించడంలో, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడానికి ముందుకు రావాలని స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు  సామాన్య ప్రజలకు ఆయ‌న  విజ్ఞప్తి చేశారు. తమ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం సందర్భంగా సంవత్సరానికి ఒక్కసారైనా రక్తదానం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భం తమకు మాత్రమే కాకుండా రక్తం అవసరమయ్యే వారికి కూడా ప్రత్యేకమైనది అవుతుంద‌న్నారు.
క‌రొనా బాధిత రోగులు , కరోనా వారియర్స్, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు మొదలైనవారి ప‌ట్ల వివ‌క్ష‌ కూడదని , గొప్ప ఉత్సాహంతో పనిచేయడానికి సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహించాల‌ని, ఇందుకు ప్రజలలో అవగాహన కల్పించడానికి ఐఆర్‌సిఎస్ ముందుకు రావాలని ఆయన కోరారు.
ఐఆర్‌సిఎస్ 1920 లో స్వచ్ఛంద మానవతా సంస్థగా స్థాపించబడింది. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా 1,100 కి పైగా శాఖల నెట్‌వర్క్‌తో, ఇది విపత్తులు , అత్యవసర సమయాల్లో స‌హాయం అందిస్తోంది, అలాగే పేద‌లు, బ‌ల‌హీనుల‌ సంరక్షణను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద స్వతంత్ర మానవతా సంస్థ, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ , రెడ్ క్రెసెంట్ ఉద్యమంలో ప్రముఖ స‌భ్య‌సంస్థ‌. భారత రెడ్‌క్రాస్  మిషన్ అన్ని రకాల మానవతా కార్యకలాపాలను చేప‌ట్ట‌డం, ప్రోత్సహించడం చేస్తోంది.. మానవాళి బాధలను తగ్గించవచ్చు , నివారించవచ్చు తద్వారా శాంతికి మరింత సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి దోహదం చేస్తుంది.
డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, "రెడ్ క్రాస్ మాదిరిగానే, అన్ని రకాల మానవతా కార్యకలాపాలను ప్రేరేపించడం, ప్రోత్సహించడం  ప్రారంభించడం మ‌న ధ్యేయంగా ఉండాలి, తద్వారా రాబోయే అన్ని సమయాల్లో మాన‌వాళి బాధలను తగ్గించవచ్చు.అని ఆయ‌న అన్నారు.
కోవిడ్ -19 సంక్షోభంవల్ల వ‌చ్చిన‌ కొన్ని సానుకూల మార్పుల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌,, “ఈ పరిస్థితి మ‌న‌కు  కొన్నిమంచి విషయాలను కూడా నేర్పింది. ఇది కొత్త  ప్రపంచ శ‌కానికి నాంది.  మ‌నం మునుపెన్నడూ లేని విధంగా వ్యక్తిగత పరిశుభ్రతను ప్రోత్సహిస్తున్నాము, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశాలకు హాజరుకావడం, అలాగే మ‌న  కుటుంబాల సంర‌క్ష‌ణ ప‌ట్ల పూర్తి శ్ర‌ద్ధ తీసుకుంటున్నాం.  ఖర్చులను ఆదా చేయడానికి  డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చేస్తున్నాం. శుభ్రమైన   వాతావరణం, భూమి, నీరు  గాలి విలువ తెలిసివ‌చ్చింది; మునుపెన్నడూ లేని విధంగా ప్రకృతి,  మొత్తం భూగోళాన్ని స్వాధీనం చేసుకుంది. ” అని ఆయ‌న అన్నారు.
 ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ (ఐఎఫ్‌ఆర్‌సి)  కంట్రీ క్లస్టర్ ఆఫీస్ యాక్టింగ్ హెడ్ శ్రీ ఉదయ రెగ్మి, ఐసిఆర్‌సి ప్రాంతీయ ప్రతినిధి విభాగాధిపతి శ్రీ యాహియా అలీబి, సెక్రటరీ జనరల్ ఆర్.కె.జైన్ , ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా. దేశవ్యాప్తంగా వివిధ ఐఆర్‌సిఎస్ రాష్ట్ర శాఖల ఛైర్మన్లు , కార్యదర్శులు, ఐఆర్‌సిఎస్ సిబ్బంది, దేశవ్యాప్తంగా వాలంటీర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కనెక్ట్ అయ్యారు.


(Release ID: 1622262) Visitor Counter : 285