ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ మధ్య ఫోన్ సంభాషణ
Posted On:
07 MAY 2020 7:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు హిజ్ ఎక్సలెన్సీ మైఖేల్ చార్లెస్ పోన్ అందుకున్నారు.
ఇరువురు నాయకులు ఇండియా, యూరోపియన్ యూనియన్‌లో కోవిడ్-19 పరిస్థితి, స్పందనలను గురించి చర్చించారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అత్యావశ్యక ఫార్మాసూటికల్ ఉత్పత్తుల సరఫరా తోసహా పరస్పర సహకారం అందించుకోవడం పట్ల వారు అభినందనలు తెలిపారు.
ఆరోగ్యం ఆర్థిక రంగంపై కోవిడ్ -19 ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానిఇక ప్రాంతీయ , ప్రపంచ స్థాయి సమన్వయం ప్రాముఖ్యతను వారు గుర్తించారు.
భారత్-ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తమ నిబద్ధతనుఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. తదుపరి భారత-ఇయు శి్‌ఖరాగ్ర సమావేశానికి తమ ఎజెండాను సిద్ధం చేయడానికి తమ అధికారులు కలిసి పనిచేస్తారని వారు అంగీకరించారు.
కోవిడ్ సంక్షోభం సమయంలోనూ, అలాగే కోవిడ్ అనంతర సమయంలోనూ ఇందుకు సంబంధించిన విషయాలపై సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.
****
(Release ID: 1621950)
Visitor Counter : 364
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam