పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యా ఇంధన శాఖ మంత్రి శ్రీ అలెగ్జాండర్ నోవాక్ తో చర్చలు జరిపిన కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు, స్టీల్ శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 07 MAY 2020 10:12AM by PIB Hyderabad

పెట్రోలియం, సహజవాయువు మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ 2020 మే 6న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రష్యా ఇంధన శాఖ మంత్రి అలెగ్జాండర్ నోవాక్ తో చర్చలు జరిపారు. ఈ చర్చలు ప్రపంచ చమురు మరియు వాయువు సంబంధించి సాగింది. చమురు, గ్యాస్ మరియు కోకింగ్ బొగ్గు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం గురించి సమీక్షించారు.

ఇటీవల సంతకాలు చేసిన ఒపెక్ ప్లస్ ఒప్పందం గురించి శ్రీ నోవాక్, శ్రీ ప్రధాన్ కు వివరించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లకు స్థిరత్వం మరియు సహాజనితత్వాన్ని అందించడంలో ఈ ఒప్పందాన్ని ఓ ముఖ్యమైన దశగా ఆయన స్వాగతించారు. ఇది వినియోగించే దేశంగా భారతదేశానికి మరింత ముఖ్యమైనదని, భారతదేశం ఒక ప్రధాన ద్వైపాక్షిక భాగస్వామిగా, హైడ్రో కార్బన్ వినియోగానికి ప్రధాన డిమాండ్ డ్రైవర్ గా కూడా పోషిస్తున్న పాత్రను రష్యా గుర్తిస్తోందని, మంత్రి ఫ్రశంసలు కురిపించారు. హైడ్రో కార్బన్ ల డిమాండ్ కేంద్రంగా భారత ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి ప్రధాన్ ఉద్ఘాటించారు.

వోస్టోక్ ప్రాజెక్టు లో రోస్ నెఫ్ట్ తో పాల్గొనడం, ఎల్.ఎన్.జి. యొక్క నోవాటెక్ సరఫరా, గెయిల్ మరియు గాజ్ ప్రోమ్ ల మధ్య సహకారం, గాజ్ ప్రోమ్ నెఫ్ట్ తో ఉమ్మడి ప్రాజెక్టులు, భారతీయ చమురుకు రోస్ నెఫ్ఠ్ ముడి చమురు సరఫరా వంటి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి ఇరువురు మంత్రులు సమీక్షించారు. కోవిడ్ -19 కారణంగా అనూహ్య పరిస్థితులు తలెత్తినప్పటికీ భారతదేశం యొక్క నిరంతర సహకారాన్ని ప్రశంసించారు. భారత ఇంధన అవసరాలకు మద్ధతునివ్వాలన్న రష్యా ఆసక్తిని మంత్రి నోవాక్ పునరుద్ఘాటించారు.

కోకింగ్ బొగ్గు రంగంలో సహకారం మీద ఈ సమావేశం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. భారత ప్రధానమంత్రి 2019 సెప్టెంబర్ లో రష్యా పర్యటన చేసిన నాటి నుంచి గణనీయమైన పురోగతి సాధించడం జరిగింది. ఈ సందర్భంలో రష్యా మంత్రి,  సమావేశం ప్రారంభంలో శ్రీ ప్రధాన్ చేసిన సూచనను స్వాగతించారు. బొగ్గు కోకింగ్ లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఈ డబ్ల్యూ.జి. ఉన్నతస్థాయి సమావేశం ఒక  అవగాహన ఒప్పంద లక్ష్యంగా ముగిసింది.

రష్యా పక్షంతో దీర్ఘకాలిక సహకరాన్ని భారత పక్షం స్వాగతించింది. పరిస్థితి స్థిరీకరించినప్పుడు అనుకూలమైన సమయంలో భారతదేశాన్ని సందర్శించాలన్న తమ అభ్యర్థనను శ్రీ ప్రధాన్,  మంత్రి నోవాక్ కు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇద్దరు మంత్రులు తమ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరపాలని ఆదేశించారు.

గ్లోబల్ ఎనర్జీ నేపథ్యంతో ప్రస్తుత సవాళ్ళను అంచనా వేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనంలో కీలకమైన డిమాండ్ లో పునరుత్థానాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా భారత్ పోషించే పాత్ర మరింత కీలకమైనది. 

 

***


(Release ID: 1621764) Visitor Counter : 229