కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వీడియో కాన్ఫరెన్స్(విసి) లేదా ఇతర ఆడియో విజువల్ పద్ధతులలో (ఒఎవిఎం) వార్షిక సాధారణ సమావేశం నిర్వహించు కోవచ్చని అనుమతిచ్చిన కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ
Posted On:
05 MAY 2020 7:26PM by PIB Hyderabad
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంసిఎ) జనరల్ సర్కులర్ నెం 18\2020 తేదీ 21.0402020 ప్రకారం 2019 డిసెంబర్ 31 తో అంతమయ్యే ఆర్థిక సంవత్సరంగల కంపెనీలు తమ ఎజిఎం ను 30 సెప్టెంబర్ 2020లోగా నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది.
అయితే , సామాజిక దూరం నిబంధనలను పాటించాల్సి ఉన్నందున, వ్యక్తుల రాకపోకలపై నిషేధాలు ఉన్నందున కంపెనీలు తమ వార్షిక సాధారణ సమావేశాలను (ఎజిఎం)లను వీడియో కాన్ఫరెన్స్ లేదా ఇతర ఆడియో,విజువల్ పద్ధతులలో (ఒఎవిఎం) 2020 సంవత్సరంలో నిర్వహిచుకునేందుకు అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి జనరల్ సర్కులర్ నెం 20\2020 ఈరోజు జారీ అయింది.
ఇంతకు ముందు జారీ చేసిన సర్కులర్లలో అసాధారణ సర్వసభ్య సమావేశం(ఇజిఎం) నిర్వహించడానికి
రూపొందించిన ఫ్రేమ్ వర్క్ తగిన మార్పు చేర్పులతో 2020 లో ఎజిఎం నిర్వహించడానికి ఆయా కేటగిరీల వారీగా వీలు కల్పించింది. ఈ కేటగిరీల ప్రకారం 1)ఈ ఓటింగ్ సదుపాయం కల్పించాలి లేదా దానిని ఎంచుకోవాలి. 2) ఇలాంటిసదుపాయం కల్పించాల్సిన అవసరం లేని కంపెనీలు
ఫైనాన్షియల్ స్టేట్ మెంట్‌లకు సంబంధించిన ఫిజికల్ కాపీలను పంపడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బోర్డు రిపోర్టులతోపాటు వాటిని పంపేందుకు ఈ సర్క్కులర్ వీలు కల్పిస్తోంది. ఆడిటర్ల రిపోర్టులు, దానితో జతచేయాల్సిన ఇతర పత్రాలను ఈ మెయిల్ ద్వారా పంపవచ్చు. షేర్ హోల్డర్లకు డివిడెండ్‌లను ఎలక్ట్రానిక్ విధానంలో, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఇసిఎస్) లేదా ఏ ఇతర పద్ధతిలో అయినా బదిలీ చేయడానికి రిజిస్టర్ చేసుకునేందుకు ఒక ప్రత్యేక విండోను కంపెనీలు ఏర్పాటు చేయాలి.
డిజిటల్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుంటూ కంపెనీలు తమ ప్రత్యేక కార్యకలాపాలు. ఎజిఎంలను నిర్వహించడానికి వీలుగా ఈ చర్య తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన సర్కులర్
http://www.mca.gov.in/Ministry/pdf/Circular20_05052020.pdf లింక్ లో అందుబాటులో ఉంది.
****
(Release ID: 1621349)
Visitor Counter : 229