ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 కు ప్రతిస్పందనగా నామ్ దేశాల సంప్రదింపుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధానమంత్రి.
Posted On:
04 MAY 2020 10:00PM by PIB Hyderabad
మిష్టర్ చైర్మన్,
గౌరవనీయులారా!
ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినందుకు అధ్యక్షులు గౌరవనీయులు ఇల్హమ్ అలియెవ్ గారికి నా కృతజ్ఞతలు.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బారినపడి తమ ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన వారందరికీ ముందుగా నా సంతాపం తెలియజేస్తున్నాను.
అనేక దశాబ్దాల్లోనే అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఈ రోజు మానవజాతి ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో, ప్రపంచ సంఘీభావాన్ని ప్రోత్సహించడంలో అలీన ఉద్యమం సహాయ పడుతుంది. అలీన దేశాలు తరచుగా ప్రపంచంలోని నైతిక విలువలకు మద్దతుగా నిలుస్తున్నాయి. తన పాత్రను నిలబెట్టుకోడానికి అలీన దేశాలు అందరితో కలుపుకుని ఉండాలి.
గౌరవనీయులారా!
మానవజాతిలో భారతదేశం ఆరవ వంతుగా ఉంది. మాది అభివృద్ధిచెందుతున్న దేశం మరియు స్వేచ్చా సమాజాన్ని కలిగి ఉంది. సంక్షోభ సమయంలో, ఏవిధంగా ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ, నిర్ణయాత్మకత కలిసి సంయు క్తంగా ఒక నిజమైన ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తాయో మేము చూపించాము.
భారతదేశ నాగరికత మొత్తం ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావిస్తుంది. మా స్వంత పౌరులకు రక్షణ కల్పిస్తూనే, ఇతర దేశాలకు కూడా మేము సహాయం చేస్తున్నాము. కోవిడ్-19 ను ఎదుర్కునేందుకు, మేము మా సమీప పొరుగు దేశాలతో సమన్వయాన్ని పెంపొందించుకున్నాము. వైద్య సేవల రంగంలో భారదేశ నైపుణ్యాన్ని ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చాలా మంది ఇతరులతో పంచుకున్నాము. భారతదేశం ప్రపంచానికే ఒక ఫార్మసీగా (ముఖ్యంగా తక్కువధరల్లో మందుల కోసం) పరిగణించబడింది.
మా స్వంత అవసరాలు తీర్చుకుంటూనే, 59 అలీన సభ్య దేశాలతో సహా, 123 కు పైగా భాగస్వామ్య దేశాలకు వైద్య సామగ్రి సరఫరా చేశాము.
నివారణ మందులు, వాక్సిన్ లు అభివృద్ధి చేయడానికి మేము ప్రపంచ స్థాయి కృషి జరుపుతున్నాము.ప్రపంచంలోనే అతి పురాతనమైన మొక్కల ఆధారంగా పనిచేసే సాంప్రదాయ వైద్య విధానం భారతదేశంలో ఉంది. ప్రజలు వారి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు, మేము ఉచితంగా లభించే సరళమైన ఆయుర్వేద గృహ చిట్కాలను ఉపయోగించాము.
గౌరవనీయులారా!
ఒక పక్కన ప్రపంచ దేశాలన్నీ కోవిడ్-19 తో పోరాటంలో ఉండగా, కొంతమంది ప్రాణాంతకమైన వైరస్ లతో పాటు ఉగ్రవాదం వంటి వాటిని వ్యాప్తి చేయడంలో తలమునకలై ఉన్నారు.
సమాజాలను, దేశాలను విడగొట్టాలనే ఉద్దేశ్యంతో కొన్ని నకిలీ వార్తలు, నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ రోజు నేను, కేవలం సానుకూల విషయాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నాను.
ప్రస్తుత ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచానికి మేము కలిసికట్టుగా ఒక ఉద్యమంగా సహాయపడతాము.
గౌరవనీయులారా!
ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ విధానంలో ఉన్న పరిమితులను కోవిడ్-19 మాకు తెలియజేసింది. కోవిడ్-19 పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం, న్యాయం, నాణ్యత, మానవత్వం ఆధారంగా మాకు ఒక కొత్త ప్రపంచీకరణ విధానం అవసరం ఉంది. ఈనాటి ప్రపంచానికి ప్రతినిధిగా వ్యవరించగలిగే అంతర్జాతీయ సంస్థల అవసరం మాకు ఉంది. కేవలం ఆర్థికాభివృద్ధి పైన మాత్రమే దృష్టి పెట్టకుండా మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉంది. భారతదేశం చాలా కాలంగా ఇటువంటి చర్యలు నిర్వహించడంలో అగ్ర స్థానంలో ఉంది.
వాటిలో, సమస్త మానవాళి శారీరిక, మానసిక శ్రేయస్సును పెంపొందించేందుకు అంతర్జాతీయ యోగ దినోత్సవం వంటిది, వాతావరణ మార్పు వంటి వ్యాధి నుండి మన భూగోళాన్ని రక్షించడానికి అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటు వంటిది, వాతావరణ మరియు విపత్తు రిస్క్ నుండి మనలను కాపాడు కోవడం కోసం, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి ఏర్పాటు వంటిది, ఉన్నాయి.
చాలా దేశాలు సైనిక విన్యాసాలు చేస్తాయి. అయితే, భారతదేశం, మాప్రాంతంలోను, సరిహద్దు అవతల ప్రాంతాల్లోనూ, విపత్తు నిర్వహణ విన్యాసాలు చేస్తాయి.
గౌరవనీయులారా!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య సామర్ధ్యాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ సమాజం మరియు డబ్ల్యూ.హెచ్.ఓ. దృష్టి కేంద్రీకరించే విధంగా అలీన దేశాలు పిలుపునివ్వాలి. ప్రజలందరికీ అవసరమైన ఆరోగ్య పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, సరసమైన, అందుబాటు ధరల్లో, సకాలంలో లభించే విధంగా మనం చూడాలి.
అలీన దేశాల కోసం మన అనుభవం, ఉత్తమ పద్ధతులు,సంక్షోభ నిర్వహణ ప్రోటో కాల్స్, పరిశోధన, వనరులను పొందుపరిచే విధంగా అన్ని అలీన దేశాలు ఒక వేదికను అభివృద్ధి చేయాలి.
గౌరవనీయులారా!
మన ఉద్యమం యొక్క వ్యవస్థాపక స్పూర్తితో, మనం అందరం కలిసి ముందుకు సాగాలనీ, విడిపోవద్దనీ ఈ రోజు లక్ష్యంగా నిర్ణయించుకుందాం. మనమంతా కలిసి ఉంటేనే ఈ మహమ్మారి నుండి ప్రతి ఒక్కరం క్షేమంగా ఉండవచ్చు. సమ్మిళిత, సహకార అంతర్జాతీయ ప్రతిస్పందన కోసం మనం భాగస్వాములుగా పనిచేద్దాం.
ధన్యవాదములు.
గౌరవనీయులందరికీ కృతజ్ఞతలు.
*****
(Release ID: 1621145)
Visitor Counter : 349
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam