సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఖాదీ” బ్రాండ్ పేరు ఉపయోగించి నకిలీ పీపీఈ కిట్లను విక్ర‌యిస్తున్న సంస్థ‌లు; న‌్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు దిగే యోచ‌న‌లో కేవీఐసీ

Posted On: 04 MAY 2020 5:24PM by PIB Hyderabad

 

కోవిడ్ -19 ప‌రిస్థితులు ఆస‌రాగా చేసుకొని కొన్ని క‌పట వ్యాపార సంస్థల వారు వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్‌లను ‘ఖాదీ ఇండియా’ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ లోగోను మోస‌పూరితంగా  ఉప‌యోగించి పీపీఈ తయారు చేసి విక్రయిస్తున్న‌ట్టు ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) దృష్టికి వచ్చింది. ఇప్పటి వరకు తాము మార్కెట్లో ఎలాంటి పీపీఈ కిట్‌ల‌ను విడుదల చేయలేదని కేవీఐసీ స్పష్టం చేసింది. ఖాదీ ఉత్పత్తి ముద్రతో నకిలీ పీపీఈ కిట్ల‌ అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని ఇది పూర్తిగా తప్పుడు చ‌ర్య అని పేర్కొంది. ఇది వినియోగ‌దారుల‌ను తప్పు దోవ పట్టించ‌డం వంటిదేనని తెలిపింది. కేవీఐసీ తన ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా డబుల్-ట్విస్టెడ్ హ్యాండ్-స్పిన్, చేతితో నేసిన ఖాదీ ఫాబ్రిక్ను ఉపయోగిస్తుందని స్పష్ట‌త‌ను ఇచ్చింది. పాలిస్టర్ మరియు పాలీప్రొఫైలిన్ వంటి వాటితో నేసిన పదార్థాలతో తయారు చేసిన కిట్లు ఖాదీ ఉత్పత్తులు కావ‌ని లేదా కేవీఐసీ ఆమోదించిన ఉత్పత్తులు కావ‌ని స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది.
పీపీఈలు ప‌రీక్ష‌ల ద‌శ‌లో ఉన్నాయి..
ఈ విష‌య‌మై కేవీఐసీ ఛైర్మన్ శ్రీ విన‌య్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ, ఖాదీ ఫాబ్రిక్‌తో తయారు చేసిన పీపీఈ కిట్‌ను కేవీఐసీ అభివృద్ధి చేసిందని తెలిపారు. ఇది వివిధ స్థాయిల వ‌ద్ద పరీక్షలో ఉంద‌ని వివ‌రించారు. “ఇప్పటి వరకు మేము ఎలాంటి ఖాదీ పీపీఈ కిట్లను మార్కెట్లో విడుదల చేయలేదు అని పేర్కొన్నారు. ‘ఖాదీ ఇండియా’ పేరిట పిపిఇ కిట్‌లను మోసపూరితంగా అమ్మడం చట్టవిరుద్ధం. అదే సమయంలో రోజువారీ క‌రోనా వైర‌స్‌ క‌ట్ట‌డికి ముందుండి కృషి చేస్తున్న‌ వైద్యులు, రోగనిర్ధారణ మరియు పారామెడిక్ సిబ్బంది యొక్క భద్రతకు తీవ్ర ప్రమాదక‌రం” అని ఆయన అన్నారు. ఇలాంటి మోసగాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవీఐసీ ఆలోచిస్తోందని శ్రీ సక్సేనా తెలిపారు.
మాస్క్‌ల‌ను మాత్ర‌మే మార్కెట్లోకి తెచ్చాం..
ఢిల్లీ కేంద్రంగా ప‌ని చేస్తున్న ‘నిచియా కార్పొరేషన్’ తయారు చేసిన నకిలీ పీపీఈ కిట్లను కేవీఐసీ డిప్యూటీ సీఈఓ శ్రీ సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ కేవీఐసీ ఎలాంటి పీపీఈ కిట్ల‌‌ను ఆవిష్క‌రించ‌డం గానీ.. లేదా ఏదైనా ప్ర‌యివేటు ఏజెన్సీకి అవుట్ సోర్స్ చేయలేదని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతానికి కేవీఐసీ ప్రత్యేకంగా రూపొందించిన ఖాదీ ఫేస్ మాస్క్‌లను మాత్ర‌మే తయారు చేసి పంపిణీ చేస్తోంది. అత్యధిక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వీటిని త‌యారు చేశారు. ఈ మాస్క్‌ల తయారీకి కేవీఐసీ డబుల్ - ట్విస్టెడ్ ఖాదీ వ‌స్ర్తాన్ని ఉపయోగిస్తోంది, ఎందుకంటే ఇది లోపల 70 శాతం తేమను నిలుపుకోని నిలిచి ఉండ‌డంలో సహాయపడుతుంది. ఇంకా, ఈ మాస్క్‌లు చేతితో చేసిన హ్యాండ్ స్ప‌న్, హ్యాండ్ ఓవెన్ ఖాదీ బట్టతో తయారు చేయబడతాయి, ఇవి స్వేచ్ఛ‌గా శ్వాస క్రియ‌కు ఉప‌యోగ‌ప‌డ‌డంతో పాటు ఉతికి లేక కడిగి శుభ్రం చేయదగినవి మరియు జీవఅధోకరణం (బ‌యోడీగ్రేడ‌బుల్‌) చెందుతాయి.


(Release ID: 1621044) Visitor Counter : 236