రక్షణ మంత్రిత్వ శాఖ
అతినీలలోహిత కిరణాలతో కూడిన క్రిమిసంహారక టవర్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ
Posted On:
04 MAY 2020 5:13PM by PIB Hyderabad
ఇన్‌ఫెక్షన్ సంక్రమించేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో వేగంగా మరియు రసాయన రహిత క్రిమిసంహారణ చేపట్టేందుకు వీలుగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) సంస్థ క్రిమిసంహారణ కోసం అతినీలలోహిత కిరణాలతో (యూవీ) కూడిన క్రిమిసంహారక టవర్‌ను ఒకదానిని అభివృద్ధి చేసింది. దయూవీ ఆధారిత శానిటైజర్‌కు యూవీ బ్లాస్టర్ అనే పేరుపెట్టారు. డీఆర్‌డీవోకు చెందిన ఢిల్లీలోని లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (లాస్‌టెక్) అనే ప్రధాన ప్రయోగశాల దీనిని రూపొందించి అభివృద్ధి చేసింది. గురుగ్రామ్‌కు చెందిన మెస్సర్స్ న్యూ ఏజ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. రసాయన పద్ధతులతో క్రిమి సంహారణ చేయలేని ప్రయోగశాలలు మరియు కార్యాలయాలతో పాటుగా హైటెక్ ఉపరితలం ఉండే వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లు మరియు ఇతర గాడ్జెట్లపై క్రిమిసంహరణకు ఈ యూవీ బ్లాస్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, మెట్రోలు, హోటళ్ళు, కర్మాగారాలు, కార్యాలయాలు మొదలైన పెద్ద సంఖ్యలో ప్రజల రాకపోకలు ఉండే ప్రాంతాలకు ఈ ఉత్పత్తి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ల్యాప్‌టాప్ / మొబైల్ ఫోన్, వైఫై లింక్‌ను ఉపయోగించి రిమోట్ ఆపరేషన్ ద్వారా యూవీ ఆధారిత ఏరియా శానిటైజర్‌ను వాడుకోవచ్చు.
10 నుంచి 30 నిమిషాల్లో డిజిన్ఫెక్షన్..
360 డిగ్రీల యూవీ కాంతి ప్రకాశం కోసం 254 ఎన్ఎమ్ తరంగదైర్ఘ్యం వద్ద 43 వాట్ల యూవీ-సీ శక్తితో కూడిన ఆరు దీపాలను ఈ టవర్లో వినియోగించారు. గదిలో వివిధ ప్రదేశాలలో పరికరాలను ఉంచడం ద్వారా సుమారు 12 x 12 అడుగుల పరిమాణం గల గదిని డిజిన్ఫెక్షన్ చేసేందుకు గాను 10 నిమిషాలు, అదే దాదాపుగా 400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్రాంతాన్ని డిజిన్ఫెక్ట్ చేసేందుకు గాను కనీసం 30 నిమిషాల సమయం ఇది తీసుకుంటుంది. ఈ పరికరం ఆన్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా ఎవరైనా గది తెరవడం లేదా మానవ జోక్యంతో ఈ పరికరం స్విచ్ ఆఫ్ అవుతంది. ఆర్మ్ ఆపరేషన్లు ఈ ఉత్పత్తి యొక్క మరో ముఖ్యమైన భద్రతా లక్షణం.
(Release ID: 1621018)
Visitor Counter : 336
Read this release in:
English
,
Marathi
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam