గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తిరాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమ‌ర్‌, “ ది స‌ర‌స్ క‌ల‌క్ష‌న్‌”ను ప్ర‌భ‌త్వ ఈ -మార్కెట్‌ప్లేస్‌(జిఇఎం) పోర్ట‌ల్‌లో ప్రారంభించారు

గ్రామీణ ప్రాంతాల‌లోని స్వ‌యం స‌హాయ‌క బృందాలు త‌యారు చేసే రోజువారీ ఉప‌యోగ ఉత్ప‌త్తుల‌ను ఈ స‌ర‌స్ క‌లక్ష‌న్‌లో ఉంచుతారు. గ్రామీణ ప్రాంతాల‌లోన స్వ‌యం స‌హాయక బృందాల‌వారికి ప్ర‌భుత్వ కొనుగోళ్ల‌ను అందుబాటులోకి తేవ‌డం దీని ఉద్దేశం.
తొలివిడ‌త‌గా 11 రాష్ట్రాల‌కు చెందిన 913 స్వ‌యం స‌హాయక బృందాలు అమ్మ‌కందారులుగా న‌మోదు చేసుకున్నాయి. వీరికి సంబంధించిన 442 ఉత్ప‌త్తులను పోర్ట‌ల్‌లో ఉంచారు.

Posted On: 04 MAY 2020 2:57PM by PIB Hyderabad

 

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తిరాజ్‌, వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌, ప్ర‌భుత్వ ఈ మార్కెట్ ప్లేస్ (జిఇఎం) పోర్ట‌ల్‌పై“ ద స‌ర‌స్ క‌ల‌క్ష‌న్‌“ ను  న్యూఢిల్లీలోని కృషి భ‌వ‌న్‌లో ఈ రోజ ప్రారంభించారు. జి.ఇ.ఎం, దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న‌- జాతీయ గ్రామీణ జీవ‌నోపాధుల మిష‌న్ ( డిఎవై-  ఎన్ ఆర్ ఎల్ ఎం), గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ  ఈ ప్రత్యేక స‌ర‌స్ క‌ల‌క్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. గ్రామీణ ప్రాంతాల‌లోని స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు చెందిన వారు త‌యారుచేసే రోజువారి ఉప‌యోగ ఉత్ప‌త్తుల‌కు దీని ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కొనుగోలుదారుల‌కు మార్కెట్ అనుసంధాన‌త క‌ల్పిస్తారు.

 ఈ కార్య‌క్ర‌మం కింద , స్వ‌యం స‌హాయ‌క బృందాల అమ్మ‌కం దారులు త‌మ ఉత్ప‌త్తుల‌ను ఐదు ఉ త్ప‌త్తుల కేట‌గిరీలుగా అంటే 1)చేతి వృత్తులు2) చేనేత‌, టెక్స్‌టైల్‌, 3)కార్యాల‌య ఉప‌క‌ర‌ణాలు,4) కిరాణాస‌ర‌కులు,వంట‌ల‌కు ఉప‌యోగించేవి, 5)వ్య‌క్తిగ‌త సంర‌క్ష‌ణ‌, ప‌రిశుభ్ర‌త కు సంబంధించిన‌విగా విభ‌జించి వాటిని న‌మోదు చేయించుకోవ‌చ్చు. తొలి ద‌శ‌లో 11 రాష్ట్రాల‌కు చెందిన  913 స్వ‌యం స‌హాయ‌క బృందాలు అమ్మకం దారులుగా తమ పేర్ల‌ను ఇప్ప‌టికే న‌మోదు చేయించుకున్నాయి. 442  ఉత్ప‌త్తుల‌ను ఇప్ప‌టికే పోర్ట‌ల్ లో ఉంచారు. స్వల్ప వ్యవధిలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్వయం సహాయక బృందాల‌ను ఆన్‌బోర్డింగ్ చేయగల స్కేలబుల్ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి,  ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్ డేటాబేస్‌తో ఎపిఐ ఆధారిత ఇంటిగ్రేషన్ మెకానిజమ్‌ను జి.ఇ.ఎం అభివృద్ధి చేసింది.

స్వయం సహాయక సంఘాలు అప్‌లోడ్ చేసిన ఉత్పత్తుల సంఖ్య,  అందుకున్న ,నెరవేర్చిన ఆర్డర్‌ల విలువ , పరిమాణం గురించి  వాస్త‌వ సమాచారాన్ని అందించడానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా  బ్లాక్ స్థాయిలో పనిచేసేవారికి డాష్‌బోర్డులను జిఇఎమ్ అందిస్తుంది. అదనంగా, ప్రభుత్వ కొనుగోలుదారులకు పోర్టల్‌లో స్వయం సహాయక ఉత్పత్తుల లభ్యత ,అందుబాటు గురించి  సిస్ట‌మ్ సందేశాల ద్వారా తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది. అవ‌స‌రం ఉన్న‌ కొనుగోలుదారులు అటువంటి ఉత్పత్తులను నిర్దేశించిన సేకరణ పద్ధతుల ద్వారా ప‌రిశీలించి ,చూసి,కొనుగోలు చేయ‌డానికి వీలుంటుంది.

 స్వ‌యం స‌హాయ‌క బృందాల ఉత్ప‌త్తుల‌ను  ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో ఉంచ‌డం అనేది ప్రాథ‌మికంగా బీహార్, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో చేప‌ట్ట‌బ‌డింది. అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను  ముందుముందు ప్రభుత్వ కొనుగోలుదారులకు విక్రయించడానికి వీలుగా ఈ సేవ‌ల‌ను  వేగంగా విస్తరించడం జ‌ర‌గుతుంది.

స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను అప్‌లోడ్ చేయడం సులభతరం చేయడానికి, జిఎమ్, ఇ ,రాష్ట్ర  జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లతో పాటు, అమ్మకందారులకు ఉత్పత్తి కేటలాగ్ నిర్వహణ, ఆర్డర్ నెర‌వేర్చ‌డం,  బిడ్ భాగస్వామ్యం ద్వారా సహాయం చేస్తోంది. స్వయం సహాయక సంఘాల సామర్థ్యం పెంపు , శిక్షణ అవసరాలను తీర్చడానికి , ఆర్డర్ ప్యాకేజింగ్, కేటలాగ్ నిర్వహణ ,లాజిస్టిక్స్ కోసం అవసరమైన  సామర్థ్యాలను పెంపొందించడానికి జిఇఎమ్ రాష్ట్ర నిర్వాహ‌కుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం జ‌రుగుతుంది.

ఎన్‌.ఆర్‌.ఎల్‌.ఎం, ఎస్‌.ఆర్‌.ఎల్‌.ఎం ల‌ నుండి ఇన్‌పుట్‌ల సహాయంతో, వినియోగదారు నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి స్వయం సహాయక సంఘాలు , ఎస్‌.ఆర్‌.ఎల్‌.ఎం సిబ్బందికి స్థానిక భాషలో ఆన్‌లైన్ అభ్యాస వనరులను జి.ఇ.ఎం అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా, రాష్ట్ర జీవనోపాధి మిషన్లలో స్వయం సహాయక సంఘాలు  కార్యకర్తల కోసం ఆన్‌లైన్ వెబ్‌నార్ల‌ను జిఎమ్ నిర్వహిస్తుంది .వీడియోలు, ఇబుక్స్, మాన్యువల్,  తరచుగా అడిగే ప్రశ్నల రిపోజిటరీని అభివృద్ధి చేస్తుంది.


ప్రభుత్వ కొనుగోలుదారులకు ప్రత్యక్ష సంబంధం ద్వారా స్వయం సహాయక సంఘాలను అందించడం ద్వారా, సరస్ కలెక్షన్ సరఫరా గొలుసులో, మధ్యవర్తులను తొలగిస్తుంది, తద్వారా స్వయం సహాయక సంఘాలకు మెరుగైన ధరలు రావ‌డానిఇక‌, స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుప‌డ‌డానికి వీలు క‌లుగుతుంది కల్. ఇది ప్రారంభం మాత్రమే. స్వ‌యం స‌హాయక బృందాల అభివృద్ధి క‌థ‌నంలో   భాగ‌స్వామ్యం పొందే అవ‌కాశం  క‌ల‌గ‌డం జిఇఎం కు ఎంతో ఆనందంగా ఉంది,

దేశం మొత్తం మాదిరే   కోవిడ్ -19 మ‌హ‌మ్మారిపై ధైర్యంగా పోరాడుతున్న స్వ‌యం స‌హాయ‌క బృందాల తీరుకు వారిని ప్ర‌త్యేకంగా అభినందించాలి.
 డిఎవై- ఎన్ఆర్ ఎల్ ఎం  గురించి: డ‌ఎవై- ఎన్‌.ఆర్‌.ఎల్‌.ఎం నైపుణ్యం కలిగిన వేతన ఉపాధి అవకాశాలను సృష్టించేటప్పుడు వైవిధ్యభరితమైన , లాభదాయకమైన స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ద్వారా పేదరికాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం సోష‌ల్ కేపిట‌ల్ ను నిర్మించడానికి ,పేదరికాన్ని నిర్మూలించడానికి , గ్రామీణ పేద మహిళల జీవ‌న‌ నాణ్యతను పెంచడానికి ఆర్థిక సంబంధాలను నిర్ధారించడానికి మద్దతు ఇస్తుంది. ఇది డిజిటల్ ఫైనాన్స్ వంటి ఆర్థిక స‌మ‌గ్ర‌ ప్రత్యామ్నాయ మార్గాల  ఆవిష్కరణలపై గొప్ప‌ ప్రణాళికలను కలిగి ఉంది, గ్రామీణ ఉత్పత్తుల చుట్టూ విలువను సృష్టించడం, మార్కెట్ అందుబాటును పెంచ‌డం, గ్రామీణ సంస్థల‌ను , కమ్యూనిటీ సంస్థలను బలోపేతం చేయడం దీని ల‌క్ష్యం.
జిఇఎం గురంచి:

గవర్నమెంట్ ఇ మార్కెట్ ప్లేస్ (జిఎమ్) అనేది నూరు  శాతం ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్షన్ 8 కంపెనీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు అవసరమైన వస్తువులు సేవల సేకరణ కోసం నేషనల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌గా ఏర్పాటు దీనిని ఏర్పాటు చేశారు. అన్ని కేంద్ర ప్రభుత్వ  రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్ఇ), స్థానిక సంస్థలు  స్వయంప్రతిపత్తి సంస్థలకు వస్తువులు  సేవల సేకరణకు ఆన్‌లైన్, ఎండ్ టు ఎండ్ పరిష్కారాన్ని జిఇఎమ్ అందిస్తుంది.
ఈ ప్లాట్‌ఫాం వ‌స్తువుల‌ ప్రొక్యూర్‌మెంట్‌లో  మానవ జోక్యాలను తగ్గిస్తుంది.పారదర్శకత, వ్యయ పొదుపులు, సమగ్రత  ముఖప‌రిచ‌యం అవ‌స‌రం లేని ప్రామాణికప‌బ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ సామ‌ర్ధ్యానికి వీలు క‌ల్పిస్తుంది.

 

***


(Release ID: 1620909) Visitor Counter : 468