గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వల్ల సంభవించిన పరిస్థితుల నేపథ్యంలో గిరిజనులకు మద్దతుగా చిన్న అటవీ ఉత్పత్తుల సేకరణను వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరిన కేంద్ర ప్రభుత్వం.
రాష్ట్రాలు చేపట్టిన సేకరణ కార్యకలాపాలపై నివేదికల కోసం ఆన్ లైన్ పర్యవేక్షణ కోసం డాష్ బోర్డు ను ఏర్పాటు చేసిన - ట్రీఫెడ్ (టి.ఆర్.ఐ.ఎఫ్.ఈ.డి.)
Posted On:
03 MAY 2020 4:23PM by PIB Hyderabad
కోవిడ్-19 వల్ల సంభవించిన పరిస్థితుల నేపథ్యంలో గిరిజనులకు మద్దతుగా, అదేవిధంగా, చిన్న అటవీ ఉత్పత్తుల సేకరణకు ఇది అనువైన కాలం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న అటవీ ఉత్పత్తుల సేకరణను వేగవంతం చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది.
చాలా రాష్ట్రాలు చిన్న అటవీ ఉత్పత్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభించగా, 10 రాష్ట్రాలు 2020-21 ఆర్థికసంవత్సరంలో ఇప్పటి వరకు 20.30 కోట్ల రూపాయల మేర చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించాయి. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఉత్పన్నమైన క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ 49 అటవీ ఉత్పత్తుల గరిష్ట అమ్మకపు ధరలను (ఎమ్.ఎస్.పి.) సవరిస్తూ 2020 మే నెల 1వ తేదీన ప్రకటన చేసిన అనంతరం చిన్న అటవీ ఉత్పత్తుల మొత్తం సేకరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
రాష్ట్ర స్థాయిలో చేపట్టిన సేకరణ కార్యకలాపాలను నివేదించడం కోసం ఆన్ లైన్ పర్యవేక్షణ డాష్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వన్ ధన్ మోనిత్ డాష్ బోర్డు అని పిలుస్తారు. మెయిల్ లేదా మొబైల్ ద్వారా ప్రతి పంచాయత్ మరియు వన్ ధన్ కేంద్రాల మధ్య ఒకరికొకరు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కోసం, "రీఫెడ్ ఈ - సంపర్క్ సేతు" లో భాగంగా ఈ డాష్ బోర్డును రూపొందించారు. పది వేల గ్రామాలు, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి భాగస్వాములు. ఏజెన్సీలు, స్వయం సహాయ బృందాలతో అనుసంధానం కావాలని ట్రీఫెడ్ ప్రతిపాదిస్తోంది. తమ రాష్ట్రాలలోని పని పురోగతిని ఆయా రాష్ట్రాల అమలు ఏజెన్సీలు ఎప్పటికప్పుడు డాష్ బోర్డులో పొందుపరచడం ప్రారంభించాయి.
హాట్ బజార్ల నుండి ఎమ్.ఎఫ్.పి. సేకరణల కోసం రాష్ట్రాలు వన్ ధన్ కేంద్రాలను తమ ప్రాధమిక సేకరణ ఏజెంట్లుగా నియమించాయి. ఈ వన్ ధన్ కేంద్రాలు 1.11 కోట్ల రూపాయల విలువైన సుమారు 31.35 మెట్రిక్ టన్నుల ఎమ్.ఎఫ్.పి. లను సేకరించాయి. ప్రధానమంత్రి వన్ ధన్ కార్యక్రమం కింద 21 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలితప్రాంతంలోని 3.6 లక్షల మంది గిరిజన లబ్ధిదారులను సంస్థాగత మార్గంలో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తూ, 1126 వి.డి.వి.కే. లను మంజూరుచేయడం జరిగింది.
దేశంలో గణనీయమైన గిరిజన జనాభా కలిగిన 22 రాష్ట్రాలలో వన్ ధన్ కేంద్రాల పధకం అమలులో ఉంది. ఈ పధకానికి దేశంలోని సుమారు 1.1 కోట్ల గిరిజన కుటుంబాలు ప్రయోజనం పొందే సామర్ధ్యం ఉంది.
"గిరిజన ఉత్పత్తుల అభివృద్ధి, మార్కెటింగ్ కోసం సంస్థాగత మద్దతు" అనే పధకంలో కనీస మద్దతు ధర అనే అంశం, విలువను పెంచడం అనే అంశం ఉన్నాయి. తద్వారా గిరిజన ఉత్పత్తుల సేకరణదారుల ఆదాయాన్ని పెంచి, వారిలో వ్యాపార ధోరణి పెంచాలన్నది లక్ష్యం. గిరిజన ఉత్పత్తుల సేకరణ దారులకు అధిక ఆదాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో 2020 మే నెల 1వ తేదీన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సవరించిన ధరల జాబితాను విడుదల చేసింది. కోవిడ్-19 కష్ట కాలంలో జీవనోపాధి దెబ్బతిన్న గిరిజన ఉత్పత్తుల సేకరణదారుల ప్రయోజనం కోసం, ఎమ్.ఎఫ్.పి. ధరల కమిటీ మరియు ఎమ్.ఎఫ్.పి. ఎక్కువగా ఉండే రాష్ట్రాలతో సంప్రదించి, ఈ జాబితాను రూపొందించడం జరిగింది. గిరిజన ఉత్పత్తుల సేకరణదారులకు అవసరమైన సహాయాన్ని అందించడానికీ, రాష్ట్రాలలో ఎమ్.ఎఫ్.పి. సేకరణను ప్రోత్సహించడానికీ సవరించిన ధరలు దోహదపడతాయి.
ఎమ్.ఎఫ్.పి. ఉత్పత్తుల సవరించిన ధరలు -
(కిలోగ్రాము ధర రూపాయలలో)
(ఎమ్.ఎస్.పి. = గరిష్ట అమ్మకపు ధర)
క్రమ సంఖ్య
|
చిన్న అటవీ ఉత్పత్తులు (ఎమ్.ఎఫ్.పి.)
|
ప్రస్తుతం ఎమ్.ఎస్.పి.
|
సవరించిన
ఎమ్.ఎస్.పి.
|
1
|
చింతపండు (గింజలతో)
(టమరిండ్స్ ఇండికా)
|
31
|
36
|
2
|
అడవి తేనే |
195
|
225
|
3
|
గమ్ కరాయ (స్టెర్ క్యూలియా యురేనస్)
|
98
|
114
|
4
|
కరంజ్ (Pongamia pinnata)
|
19
|
22
|
5
|
Sat seed (Shorea robusta)
|
20
|
20
|
6
|
Mahua seed (Madhuca longifolia)
|
25
|
29
|
7
|
Sal leaves (Shorea robusta)
|
30
|
35
|
8
|
సార పప్పు గింజలతో (Buchanania
lanzan)
|
109
|
126
|
9
|
Myrobalan (Terminalia chebula)
|
15
|
15
|
10. ఏ
|
రంగీని లక్క
|
130
|
200
|
10. బి
|
కుసుమి లక్క
|
203
|
275
|
11
|
కుసుమ గింజలు (Schleichera oleosa)
|
20
|
23
|
12
|
వేప గింజలు (Azadirachta indica)
|
23
|
27
|
13
|
పువాడ్ విత్తనాలు (Cassia tora)
|
14
|
16
|
14
|
Baheda (Terminalia bellirica)
|
17
|
17
|
15
|
హిల్ బ్రూమ్ గ్రాస్
(Thysanolaena maxima)
|
30
|
35
|
16
|
షీకాకాయ్ పొడి పలుకులు
(Acacia concinna)
|
43
|
50
|
17
|
Bael pulp (Dried) (Aegle marmelos)
|
27
|
30
|
18
|
Nagarmotha (Cyperus rotundas)
|
27
|
30
|
19
|
Shatavari Roots (ఎండినవి)
(Asparagus racemosus)
|
92
|
107
|
20
|
గుడ్మార్ / మధునాశిని
(Gymnema sylvestre)
|
35
|
41
|
21
|
Kalmegh (Andrographis paniculata)
|
33
|
35
|
22
|
చింతపండు (గింజలు లేకుండా)
(Tamarindus indica)
|
54
|
63
|
23
|
గుగ్గుళ్ళు (exudates)
|
700
|
812
|
24
|
Mahua Flowers (ఎండినవి)
(Madhuca longifolia)
|
17
|
30
|
25
|
Tejpatta (dried) (Cinnamomum tamala and Cinnamomum sp.)
|
33
|
40
|
26
|
ఎండిన నేరేడు గింజలు
(Syzygium cumini)
|
36
|
42
|
27
|
ఉసిరి పిప్పి (గింజలు లేకుండ) (Phvllanthus emblica)
|
45
|
52
|
28
|
మార్కింగ్ నట్స్
(Semecarpus anacardium)
|
8
|
9
|
29
|
కుంకుడు కాయ (ఎండినవి)
(Sapindus emarginatus)
|
12
|
14
|
30
|
Bhava seed/ (Amaltas (Cassia fistula)
|
11
|
13
|
31
|
Arjuna Bark (Terminalia arjuna)
|
18
|
21
|
32
|
కొకుమ్ (Dry) (Garcinia indica)
|
25
|
29
|
33
|
Giloe (Tinospora cordifolia)
|
21
|
40
|
34
|
దూలగొండి గింజలు (Mucuna pruriens)
|
18
|
21
|
35
|
Chirata (Swertia chirayita)
|
29
|
34
|
36
|
Vaybidding / Vavding (Embelia ribes )
|
81
|
94
|
37
|
Dhavaiphool dried flowers (Woodfordia floribunda)
|
32
|
37
|
38
|
Nux Vomica (Strrchnos nux vomica)
|
36
|
42
|
39
|
Ban Tulsi Leaves (dried) (Ocimum tenuiflorum)
|
19
|
22
|
40
|
Kshirni (Hemidesmus indicus)
|
30
|
35
|
41
|
Bakul (dried bark) (Mimusops elengii)
|
40
|
46
|
42
|
కుతజ్ (dried bark) (Holarrhena aubescens/
H.antidysenterica)
|
27
|
31
|
43
|
నోనీ (ఎండిన పళ్ళు)
(Morinda citrifolia )
|
15
|
17
|
44
|
Sonapatha/ Syõnak pods (Oroxylum
indicum )
|
18
|
21
|
45
|
చనోతి గింజలు (Abrus precatorius)
|
39
|
45
|
46
|
Kalihari (dried tubers) (Gloriosa superba)
|
27
|
31
|
47
|
Makoi (dried fruits) (Solarium nigrum)
|
21
|
24
|
48
|
Apang plant (Achyranthes aspera)
|
24
|
28
|
49
|
Sugandhmantri roots/ tubers
(Homaloinena aromatica)
|
33
|
38
|
సవరించిన ధరలు క్రింది బ్రాకెట్లలో ఉన్నాయి - –
ధరలలో
పెరుగుదల
శాతం |
వస్తువుల సంఖ్య
|
పెరుగుదల లేదు
|
3
|
0% - 5%
|
0
|
5% - 10%
|
1
|
10% - 15%
|
10
|
15% - 20%
|
30
|
>20%
|
6
|
మొత్తం వస్తువుల
సంఖ్య
|
50 (రెండు రకాల లక్క తో సహా)
|
గిలో, మహువా పుష్పాలు, కొండ గడ్డి, లక్క (రంగీని & కుసుమి) ల ధరలు ఎక్కువగా సవరించబడ్డాయి. కాగా, సాల్ విత్తనాలు, బహేదా మరియు మైరోబాలన్ ధరలలో మార్పు లేదు.
*****
(Release ID: 1620771)
Visitor Counter : 276
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam