ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 అప్‌డేట్స్
Posted On:
02 MAY 2020 4:36PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, కోవిడ్ -19 సంక్షోభ తీవ్రతకు అనుగుణంగా , ముందస్తు చర్యలు, సానుకూల వైఖరి ద్వారా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి సమిష్టి కృషితో వైరస్ నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు
వ్యక్తిగత రక్షణ పరికరాలను హేతుబద్ధంగా వాడకంపై అదనపు మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిన్న విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు , వ్యక్తగత రక్షణ పరికరాల హేతుబద్ధ వినియోగానికి సంబంధించి ఇంతకుముందు జారీచేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా జారీచేశారు. సవివరమైన మార్గదర్శకాలను కింది లింక్ లో చూడవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/AdditionalguidelinesonrationaluseofPersonalProtectiveEquipmentsettingapproachforHealthfunctionariesworkinginnonCOVIDareas.pdf
ఇప్పటివరకూ దేశంలో కోవిడ్ -19 వైరస్ నుంచి 9950 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో , 1061 మంది పేషెంట్లు వ్యాధినుంచి కోలుకున్నారు. దీనితో మన దేశంలో ఈ వ్యాధినుంచి కోలుకున్న వారి శాతం 26.65 కు చేరుకుంది. మొత్తం కోవిడ్ -19 నిర్ధారణ కేసులు ఇప్పుడు 37,336 కు చేరుకున్నాయి. నిన్న టి నుంచి దేశంలో కోవిడ్ -19 నిర్థారితకేసులు 2293.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
(Release ID: 1620436)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam