రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రాధాన్యతపై వైద్య పరికరాల సేకరణ

మేక్ ఇన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం

దేశీయ తయారీదారులను గుర్తించడం మరియు సహాయం చేయడం

ప్రత్యామ్నాయ పరికరాల దిగుమతి మరియు వైద్య పరికరాల ఎగుమతి దిశగా దృష్టి

పి.పి.ఈ.ల దేశీయ ఉత్పత్తి రోజుకు దాదాపు సున్న స్థాయి నుంచి 1.87 లక్షలకు పెరిగింది

ఎన్-95 మాస్క్ ల దేశీయ ఉత్పత్తి రోజుకు దాదాపు సున్న స్థాయి 2.30 లక్షలకు పెరిగింది

హెచ్.సి.క్యూ. దేశీయ ఉత్పాదక సామర్ధ్యం సుమారు 150 శాతం పెరిగింది.

2.5 కోట్ల అవసరాలకు అనుగుణంగా సుమారు 16 కోట్ల హెచ్.సి.క్యూ టాబ్లెట్లను కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మరియు ఫార్మసీలకు విడుదల

Posted On: 01 MAY 2020 5:19PM by PIB Hyderabad

1.   2020 మార్చి 29న కేంద్ర హోం శాఖ అన్ని అధికారాలతో గ్రూప్ -3ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫార్మాస్యూటికల్స్ కార్యదర్శి డాక్టర్ పి.డి.వాఘేలాతో పాటు డి.పి.ఐ.ఐ.టి. కార్యదర్శి, టెక్స్ టైల్స్ కార్యదర్శి, సి.బి.ఐ.సి. ఛైర్మన్, డి.ఆర్.డి.ఓ. కార్యదర్శి, పి.ఎం.ఓ, కేబినెట్ సెక్రటేరియట్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాక, ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ, హెల్త్ రీసెర్చ్ డిపార్ట్ మెంట్ లోని సీనియర్ అధికారులు మొదలైన వారు ఇందులో భాగంగా ఉంటారు. ఈ బృందం పి.పి.ఈ.లు, మాస్క్ లు, చేతి తొడుగులు మరియు వెంటిలేటర్ల వంటి అవసరమైన వైద్య పరికరాల లభ్యతను నిర్థారించడంతో పాటు వాటి  ఉత్పత్తి, సేకరణ, దిగుమతి, పంపిణీ విషయంలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.

2.   ఈ గ్రూప్ క్రమం తప్పకుండా సమావేశం అవుతుంది. ఈ రోజు వరకూ మొత్తం 24 సమావేశాలు జరిగాయి. వివిధ పరికరాల తయారీ ప్రతిపాదనలను పరిశీలించడానికి ఈ.జి. సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య పరిశోధన విభాగం జూన్ 2020 వరకూ తెలియజేసిన వివిధ వైద్య పరికరాల అవసరాల ఆధారంగా, ప్రస్తుత తయారీ దారుల సామర్థ్యాలను విస్తరించడం మరియు వివిధ వైద్య పరికరాల అవసరాల ఆధారంగా, ప్రస్తుత తయారీ దారుల సామర్థ్యాలను విస్తరించడం మరియి వివిధ వైద్య పరికరాల నూతన తయారీ దారులను గుర్తించడం మీద కమిటీ నిరంతం పరిశీలిస్తోంది. ముడి పదార్థాలు, విడి భాగాలు, ప్రయాణ మరియు లాజిస్టిక్స్ పరంగా దేశీయ తయారీ దారులు ఎదుర్కొంటున్న వివిధ అడ్డంకులను పరిష్కరించడంలో చేయూతనందించడం మరియు సులభతరం చేయడం జరుగుతోంది. ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో వైద్యసామగ్రికి ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్ పెరిగింది. అంతే గాక తగినంత దేశీయ సామర్థ్యాలు లేకపోవడం మరియు అవసరమైన వైద్య సామగ్రి అధికంగా దిగుమతి చేసుకోవడం సవాళ్ళతో కూడుకున్న అంశం. ప్రభుత్వ ప్రధానంగా దేశీయ తయారీని ప్రోత్సహిస్తోంది. అత్యవసరం అయినప్పుడు మాత్రమే దిగుమతుల మీద ఆధారపడుతోంది.

కొన్ని క్లిష్టమైన వస్తువుల సేకరణ కోసం జాతీయ అత్యవసర సమయాల్లో అధికారులు, శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల బృందాలు అహరహం ఒకే తాటి మీద పనిచేస్తున్నాయి.

1.  వెంటిలేటర్లు

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2020 జూన్ వరకూ 75,000 వెంటిలేటర్ల డిమాండ్ ను సూచించింది. ప్రస్తుతం దీని లభ్యం 19,398గా ఉంది. 60,884 వెంటిలేటర్లకు హెచ్.ఎల్.ఎల్. లైప్ కేర్ లిమిటెడ్ కు అందించింది. ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పి.ఎస్.యు.గా, కేంద్ర సేకరణ సంస్థగా పని చేస్తోంది. మొత్తం ఆర్డర్ లలో 59,884 వెంటిలేటర్లను దేశీయ తయారీదారులకు అదేశించారు. 1000 వెంటిలేటర్లు దిగుమతి చేసుకుంటున్నారు. అంచనా వేసిన డిమాండ్ మరియు ఉత్తర్వులలో రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపులు కూడా ఉన్నాయి.

మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా, వెంటిలేటర్ల స్థానిక తయారీదారులను గుర్తించి, ప్రత్యేకతలు, శిక్షణ మరియు ఇతర ప్రోటో కాల్ ఖరారు చేయడం, కొత్త సరఫరా గొలుసులను సృష్టించడం, సరఫరాదారులు మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో లాజిస్టిక్స్ సమస్యల్లో వారికి సహాయపడడం మరియు ఏర్పాట్ల గురించి నిర్ణయించడంలో మార్గనిర్దేశం చేశారు. వినియోగ వస్తువులు మొదలైనవి ప్రధాన దేశీయ సంస్థల్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (స్కన్లే సహకారంతో) ఉన్నాయి. వీరికి 30,000 వెంటిలేటర్లకు ఆర్డర్లు అందించారు. 10,000 వెంటిలేటర్లకు ఆర్డర్లు ఇవ్వబడిన ఏ.జి.వి.ఏ ( మారుతి సుజికి లిమిటెడ్ సహకారంతో) మరియు 13,500 వెంటిలేటర్లకు ఆర్డర్లు ఇచ్చిన ఎ.ఎం.టి.జెడ్ (ఎ.పి.మెడ్ టెక్ జోన్) అంగీకరించిన సమయ షెడ్యూల్ ప్రకారం దేశీయ తయారీదారుల డెలివరీలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం అవి ప్రీ డిస్పాచ్ తనిఖీదశలో ఉన్నాయి.

2.  ఆక్సిజన్ మరియు ఆక్సిజన్ సిలిండర్లు

భారతదేశంలో ఆక్సిజన్ మరియు ఆక్సిజన్ సిలిండర్లు సంవృద్ధిగా ఉన్నాయి. ఆక్సిజన్ మొత్తం ఉత్పాదక సామర్థ్యం 6,400 మెట్రిక్ టన్నులు. వీటిలో 1000 మెట్రిక్ టన్నులు వైద్య ఆక్సిజన్ కోసం వినియోగిస్తారు. 5 పెద్ద మరియు 600 చిన్న ఆక్సిజన్ తయారీ దారులు ఉన్నారు. సుమారు 409 ఆస్పత్రులు తమ సొంత ఆక్సిజన్ ఉత్పత్తిని కలిగి ఉన్నాయి. మరియు దేశంలో సుమారు 1050 క్రయోజెనిక్ ట్యాంకర్లు ఉన్నాయి.

సుమారు 4.38 లక్షల మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా కోసం అందుబాటులో ఉన్నాయి. ఇంకా, 1.03 లక్షల కొత్త మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. అవసరమైతే, మార్పిడి కోసం ఐదు లక్షల పారిశ్రామిక ఆక్సిజన్ సిలిండర్లు కూడా గుర్తించబడ్డాయి. ఇంకా, 60,000 సిలిండర్లను మార్చడానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

3.  వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ.లు)

జూన్, 2020 వరకు మొత్తం డిమాండ్ ఉన్న పిపిఇ కిట్ల అంచనా రూ. 2.01 కోట్లు. దీని కోసం ఇప్పటికే 2.22 కోట్ల రూపాయలకు ఆర్డర్లు ఇవ్వబడ్డాయి, వీటిలో 1.42 కోట్ల ఆర్డర్‌లను దేశీయ తయారీదారులకు ఇచ్చారు. 80 లక్షల పి.పి.ఈ.లను దిగుమతి చేసుకుంటున్నారు. ఇంతకుముందు, దేశంలో పి.పి.ఈ.ల దేశీయ తయారీ లేదు. దాదాపు అన్నీ దిగుమతి చేసుకున్నవే. తక్కువ వ్యవధిలో, 107 మంది తయారీదారులను గుర్తించి, వారి రోజువారీ ఉత్పత్తిని (30.04.2020 నాటికి) సుమారు 1.87 లక్షలకు పెంచారు. ప్రస్తుతానికి, సుమారు 17.37 లక్షల పి.పి.ఈ.లు అందుబాటులో ఉన్నాయి. రానున్న రెండు నెలల్లో అదనపు దేశీయ సరఫరా 1.15 కోట్లకు పైగా  ఉండే అవకాశం ఉంది.

కొత్త సాంకేతిక పరిజ్ఞానం, సామగ్రి మరియు పరీక్షా సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ సంస్థలు ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరీక్షా ప్రయోగశాలతో పాటు, సౌత్ ఇండియా టెక్స్‌టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (సిట్రా), కోయంబత్తూర్, డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్‌.డి.ఓ) మరియు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశంలోని వివిధ ప్రదేశాలలో 9 కొత్త ప్రయోగశాలలను సిద్ధం చేశాయి. దేశీయ తయారీదారులకు సరఫరా కోసం డి.ఆర్.డి.ఓ. నూతన పి.యూ. కోటెడ్ నైలాన్ / పాలిస్టర్‌ను అభివృద్ధి చేసింది.

4.   ఎన్-95 మాస్క్ లు

జూన్, 2020 వరకు మొత్తం ఎన్ -95 మాస్క్ ల అంచనా  రూ. 2.72 కోట్లు. దీని కోసం ఇప్పటికే 2.49 కోట్ల రూపాయలకు ఆర్డర్లు ఇవ్వబడ్డాయి, వీటిలో 1.49 కోట్ల రూపాయలకు దేశీయ తయారీదారులకు ఆర్డర్లు ఇచ్చారు. సుమారు 1 కోటి ఎన్ - 95 మాస్క్ లు దిగుమతి కానున్నాయి. దేశంలో మొత్తం నలుగురు ప్రధాన దేశీయ తయారీదారులు ఉన్నారు. ఇంకొన్నింటిని గుర్తించి, సౌకర్యాలు కల్పించారు.  రోజువారీ దేశీయ ఉత్పత్తి (30.04.2020 నాటికి) సుమారు 2.30 లక్షలు. ప్రస్తుతానికి, సుమారు 49.12 లక్షల ఎన్- 95 మాస్క్ లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రెండు నెలల్లో అదనపు దేశీయ సరఫరా 1.40 కోట్లకు పైగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న విజ్, సిట్రాతో పాటు మరిన్ని ల్యాబ్‌లు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూ.సి.ఐ) ద్వారా జోడించబడుతున్నాయి.

5.  డయాగ్నొస్టిక్ కిట్లు

ఐ.సి.ఎం.ఆర్. రోజుకు 70,000 పరీక్షా సామర్థ్యాన్ని అందుకుంది. ఇప్పటికి 9 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించింది. అవసరం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే వ్యూహంతో పరీక్షలను ముందుకు తీసుకెళుతున్నారు. పరీక్షను నిర్ధారించడానికి, కిట్లు, ఉపకరణాలు, కారకాలు మొదలైన వాటి యొక్క లభ్యత చాలా అవసరం. పరీక్షా వస్తు సామగ్రి మొదలైన వాటితో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, అవి కూడా ఉచితం, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు తమ సామాగ్రిని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు.

మాన్యువల్ ఆర్‌.టి-పి.సి.ఆర్. కిట్‌ల అవసరాన్ని 35 లక్షలుగా డి.హెచ్‌.ఆర్. అంచనా వేసింది, దీని కోసం ప్రోబ్, ప్రైమర్ మరియు మాస్టర్‌మిక్స్ కు ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. నేటికి సుమారు 16.4 లక్షల పరీక్షలకు సంబంధించిన పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. 35 లక్షల కంబైన్డ్ ఆర్‌.టి-పి.సి.ఆర్. కిట్‌ల డిమాండ్‌కు గాను, 19 లక్షల కిట్‌ల కోసం ఆర్డర్ చేశారు. వీటిలో 2 లక్షల కిట్‌లకు ఆర్డర్లు దేశీయ తయారీదారులకు ఇవ్వబడతాయి. ఇవాళ్టికి మొత్తం 13.75 లక్షల కంబైన్డ్ ఆర్‌.టి-పి.సి.ఆర్. కిట్‌లు వచ్చాయి. ఇంకా  2 లక్షల పరీక్షలను రోచె యొక్క కోబాస్ (సి.ఓ.బి.ఏ.ఎస్) పరీక్షా వస్తు సామగ్రికి డి.హెచ్.ఆర్. ఆదేశాలు జారీ చేసింది. వీటిలో 60,000 కిట్లు  ఇప్పటికే వచ్చాయి.

6.  ఔషధాలు మరియు ఇతర వైద్య పరికరాలు

ఔషధాలు మరియు వైద్య పరికరాల ఉత్పత్తి మరియు సరఫరాపై నిరంతర ప్రాతిపదికన ఒక టాబ్ ఉంచడానికి, రెండు కంట్రోల్ రూములు – డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (డి.ఓ.పి) మరియు నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్.పి.పి.ఏ) ఏర్పాటు చేయబడ్డాయి. తయారీదారులు, పంపిణీదారులు మరియు ఔషధ విక్రేతలతో ప్రభుత్వం నిరంతర పరస్పర పర్యవేక్షణలో ఉంది. పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తూ సులభతరం చేస్తున్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్.సి.క్యూ) ఉత్పత్తి నెలకు 12.23 కోట్ల నుంచి 30 కోట్లకు పెరిగింది. సుమారు 2.5 కోట్ల అవసరాలకు గాను దేశం 16 కోట్ల టాబ్లెట్లను హెచ్‌.సి.క్యూ. సెంటర్ / స్టేట్ ఇనిస్టిట్యూషన్ తో పాటు ఫార్మసీలకు విడుదల చేసింది.

7.  ఇతర మంత్రిత్వ శాఖలు / విభాగాల పాత్ర

టెక్స్ టైల్స్, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, డి.పి.ఐ.ఐ.టి. విదేశాంగ వ్యవహారాలు, డి.ఆర్.డి.ఓ మరియు ఐ.సి.ఎం.ఆర్. మంత్రిత్వ శాఖలు ఈజి-3 లో భాగంగా ఉండడమే కాకుండా పని తీరులో సహకారం అందిస్తున్నారు. భారతీయ తయారీదారులకు అవసరమైన వైద్య సామాగ్రి మరియు విడిభాగాల దిగుమతుల అంశాన్ని గుర్తించడంలో మరియు సేకరించడంలో  విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయపడింది. కార్గో-ఎయిర్ బ్రిడ్జ్ మరియు లైఫ్లైన్ ఉడాన్ ప్రాజెక్టుల ద్వారా అంతర్జాతీయ మరియు స్థానిక ఔషధాలు,  వైద్య పరికరాల మరియు వాటి విడి భాగాలు మొదలైన వాటి రవాణాలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ  సహకారం అందించింది. ఓడరేవులు, కస్టమ్స్, రైల్వే మరియు పోస్టుల  విభాగాల అధికారులు వేగంగా అనుమతులు అందించడమే గాక, వైద్య పరికరాల పంపిణీని నిర్ధారించడంలో ఎంతో సహాయపడ్డారు. ఈ ప్రయత్నాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చురుగ్గా సహకారం అందిస్తున్నాయి.

 

--



(Release ID: 1620165) Visitor Counter : 297