సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్రీయ భండార్ తయారు చేసిన 4900 ప్రొటెక్టివ్ కిట్లను వైద్య మరియు పోలీసు సిబ్బంది ఉపయోగం కోసం అందజేసిన మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
01 MAY 2020 5:32PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను వైద్య మరియు పోలీసు సిబ్బంది వారు చేస్తున్న నిస్వార్థ సేవలను ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంఓ, సిబ్బంది, ప్రజా పిర్యాధులు, పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. కేంద్రీయ బండార్ వారు శానిటైజర్, హ్యాండ్ వాష్ మొదలైన వాటితో రూపొందించిన మొత్తం 4900 కోవిడ్-19 వైరస్ నుంచి రక్షణనిచ్చే కిట్లను వైద్య మరియు పోలీసు సిబ్బంది నిమిత్తం అందజేశారు. వైద్య మరియు పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవల ప్రశంసతకు చిహ్నంగా వారి ఉపయోగార్థం వీటిని అందజేశారు. మంత్రి నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ కిట్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, ఢిల్లీ పోలీసు ప్రతినిధులకు అప్పగించారు. సామాజిక దూరానికి సంబంధించి నిబంధనలను పూర్తిస్థాయిలో అమలుపరుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ప్రధాన మంత్రి పిలుపు మేరకు పలు చర్యలు..
ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా దేశం కరోనా మహమ్మారికి వ్యతిరేక యుద్ధంలో పాల్గొంటోందని అన్నారు. దేశంలో లాక్‌డౌన్ కారణంగా విధించిన నిబంధనలను అనుసరించి చాలా మంది పౌరులు తమ ఇండ్లకే పరిమితం ఉండగా.. కొంత మంది వ్యక్తులు, వైద్య మరియు పోలీసు సిబ్బంది ఈ క్లిష్ట సమయాల్లో వారి సాధారణ విధిని మించి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి పిలుపుకు స్పందిస్తూ లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖలు వరుస వివిధ చర్యలు తీసుకుంటు వస్తున్నాయని అన్నారు. పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యపు కేంద్రీయ భండార్ సంక్షేమ ప్రాజెక్టు వినియోగదారులకు నిత్యావసర వస్తువులు, అత్యవసర వస్తువులను నిరంతరాయంగా సరఫరా చేస్తోంది. ఇటీవలే తినదగిన మరియు ఇంట్లోకి కావాల్సిన నిత్యవసర వస్తువులతో కేంద్రీయ భండార్ తయారు చేసిన దాదాపు 2200 ఎసెన్షియల్ కిట్లను అవసరమైన కుటుంబాలకు పంపిణీ చేసేందుకు గాను ఈ నెల మొదటి వారంలో డాక్టర్ జితేంద్ర సింగ్ సెంట్రల్ ఢిల్లీకి చెందిన సివిల్ లైన్స్‌కు చెందిన డీఎం (సెంట్రల్) మరియు ఎస్‌డీఎంలకు అందజేశారు.
(Release ID: 1620162)
Visitor Counter : 148