భారత ఎన్నికల సంఘం

శాసన సభ్యుల ద్వారా ఎన్నికయ్యే మహారాష్ట్ర శాసనమండలి సభ్యుల ద్వైవార్షిక ఎన్నిక 2020 మే 21న నిర్వహించాలని ఈసీ నిర్ణయం

Posted On: 01 MAY 2020 2:16PM by PIB Hyderabad

మహారాష్ట్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే,  ఖాళీగా ఉన్న ఎంఎల్సి స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగే సాధ్యాసాధ్యాలను ఎన్నికల సంఘం ఈ రోజు సమీక్షించింది. ప్రధాన ఎన్నికల కమీషనర్ శ్రీ సునీల్ అరోరా (అమెరికా నుండి)ఎన్నికల కమిషనర్ శ్రీ అశోక్ లావాసాఎన్నికల కమిషనర్ శ్రీ సుశీల్ చంద్రతో వీడియో కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

మహారాష్ట్రలో ఎంఎల్ఏల ద్వారా ఎన్నికయ్యే ఎంఎల్సి సీట్లు 2020 ఏప్రిల్ 24న ఖాళీ అయ్యాయి (అనుబంధం -ఏ). కోవిడ్-19 కారణంగా ఎన్నికలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 324 అధికరణ ప్రకారం వాయిదా వేస్తున్నట్టు ఈసీఐ 2020 ఏప్రిల్ 03వ తేదీన ఆదేశాలు జరీ చేసింది. 

మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 30 వ ఏప్రిల్, 2020 నాటి లేఖను ఎన్నికల కమిషన్ అందుకుంది.  ఇందులో మహమ్మారిని నియంత్రించడానికి తీసుకున్న వివిధ చర్యలను సిఎస్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలోతొమ్మిది ఎంఎల్సి స్థానాలకు ఎన్నికలు సురక్షిత వాతావరణంలో జరపవచ్చు అన్నది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. ఈ ఎన్నికలు సామజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూనేసంబంధిత అధికారులు విధించిన ఇతర షరతులకు లోబడి పూర్తి పరిశుభ్రమైన వాతావరణంలో జరిగేలా చూడడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని  రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కు హామీ ఇచ్చింది.

మహారాష్ట్ర గౌరవ గవర్నర్ 2020 ఏప్రిల్ 30 నాటి డిఓ లేఖను కమిషన్ అందుకుందిరాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను సూచిస్తూ సిఇసిని ఉద్దేశించి పలు అంశాలు పేర్కొన్నారు. దీనికి సంబంధించిగవర్నర్ మహారాష్ట్ర, 2019 నవంబర్ 28 న శ్రీ ఉధవ్ బాలసాహెబ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు కూడా పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల లోఅంటే 2020 మే 27వ తేదీ లోగా మహారాష్ట్ర శాసనసభలో లేదా శాసనమండలిలో శ్రీ థాక్రే సభ్యత్వం పొందాలని లేఖలో సూచించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి నిలువరించేలాగే ఉందనిప్రస్తుతం ప్రభుత్వం అనేక సడలింపులతో స్థితి గతులు మెరుగుపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందువల్లమొత్తం పరిస్థితిని దృష్టిలో ఉంచుకునిఎన్నికలు నిర్వహించడానికి విధివిధానాలు పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. 

వివిధ రాజకీయ పార్టీల విజ్ఞాపనలు కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంది. మహారాష్ట్ర విధానమండల్ కాంగ్రెస్ పక్ష్శివసేన విధి మండల పక్ష్రాష్ట్రవాది కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను నిర్వహించాలని కమిషన్ను అభ్యర్థించాయి.  

పైన పేర్కొన్నవన్నీపరిగణలోకి తీసుకొనికమిషన్ గతంలో అవలంబించిన పద్ధతులనుపూర్వాపరాలను సమీక్షించింది. మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు 1991 లో, 1996 లో శ్రీ హెచ్‌డి దేవేగౌడ కేసులలోమరియు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు (1991 లో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహెలోట్; 1997లో బీహార్ ముఖ్యమంత్రి శ్రీమతి రబ్రీ దేవి;  1993 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  విజయ్ భాస్కర్ రెడ్డి: 2017లో ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రి, 4 మంత్రులు; 2017లో నాగాలాండ్ ముఖ్యమంత్రి)ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగ పరమైన అంశాలు నెరవేర్చడానికి  కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహించింది. గతంలో ఇది స్థిరమైన పద్ధతి అని కమిషన్ గుర్తించింది. కమిషన్ ఇలా పలు అంశాలను పరిశీలించి  మహారాష్ట్ర ద్వైవార్షిక ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది.

ఎన్నికలకు సంబంధించిన వివరాలను జత చేయడమైనది (అనుబంధం-బి)

విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం ఏర్పాటైన జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్ గా ఉన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆ చట్టం ప్రకారం ముందు జాగ్రత్త చర్యలు సక్రమంగా తీసుకుంటున్నారా లేదా పర్యవేక్షించడానికి ఒక సీనియర్ అధికారిని ప్రత్యేకంగా నియమించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఎన్నికల ఏర్పాట్లు కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. 

మొత్తం ఎన్నికల పరిశీలకుడిగా మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కమిషన్ నియమించింది. 

ఇంకా వాయిదా పడ్డ మిగిలిన ఎన్నికల విషయంపై వచ్చే వారం సమీక్షించాలని కమిషన్ నిర్ణయించింది. 

 

అనుబంధం-ఏ (ఖాళీల జాబితా)

వరుస సంఖ్య

సభ్యుని పేరు 

పదవీ విరమణ తేదీ 

1.

గోరే, నీలం దివాకర్ 

 

 

 

 

24.04.2020

2.

టాక్లే, హేమంత్ ప్రభాకర్ 

3.

ఠాకూర్, ఆనంద్ రాజేంద్ర 

4.

వాఘ్, స్మిత ఉదయ్ 

5.

దేశముఖ్, పృథ్విరాజ్ సయాజీరావ్ 

6.

పవాస్కర్, కిరణ్ జగన్నాథ్ 

7.

అదసద్, అరుణ్ భావ్ జనార్దన్ 

8.

రఘువంశీ, చంద్రకాంత్ బాటేసింగ్ 

9.

రాథోడ్, హరిసింగ్ నస్రు        

 అనుబంధం-బి (షెడ్యూల్)

వరుస సంఖ్య

అంశం 

తేదీ 

  1.  

నోటిఫికేషన్ జారీ 

04 మే 2020 (సోమవారం)

  1.  

నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 

11 మే 2020 (సోమవారం)

  1.  

నామినేషన్ల పరిశీలన 

12 మే 2020 (మంగళవారం)

  1.  

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 

14మే  2020 (గురువారం)

  1.  

పోలింగ్ తేదీ 

21మే 2020 (గురువారం)

  1.  

పోలింగ్ జరిగే సమయం 

ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు.

  1.  

ఓట్ల లెక్కింపు 

21మే 2020 (గురువారం) సాయంత్రం 05.00 గంటలకు 

  1.  

ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన తేదీ 

26మే 2020 (మంగళవారం)

******



(Release ID: 1620052) Visitor Counter : 257