ప్రధాన మంత్రి కార్యాలయం

రక్షణ, అంతరిక్ష రంగాలను పెంపొందించే మార్గాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సమావేశం నిర్వహించారు.

Posted On: 30 APR 2020 10:26PM by PIB Hyderabad

కోవిడ్-19 నేపథ్యంలో ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేవిధంగా, సాయుధ దళాలకు అవసరమైన స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక అవసరాలను తీర్చే విధంగా, భారతదేశంలో పటిష్టమైన స్వావలంబన రక్షణ పరిశ్రమ కోసం అవసరమైన సంస్కరణలు చేపట్టడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సవివరమైన సమావేశం నిర్వహించారు.  ఆర్డినెన్సు ఫ్యాక్టరీల పనితీరు, కొనుగోలు విధానాలను క్రమబద్దీకరించడం, కేంద్రీకృత వనరుల కేటాయింపు, పరిశోధన మరియు అభివృద్ధికి ప్రోత్సాహం / ఆవిష్కరణలు, క్లిష్టమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులకు ప్రోత్సాహం వంటి విషయాలలో సంస్కరణలపై చర్చలు జరిగాయి

రక్షణ మరియు అంతరిక్ష రంగాలు స్వావలంబన, ఎగుమతులు అనే రెండు లక్ష్యాలను సాధించడం కోసం ప్రభుత్వ, ప్రయివేటు రంగాల చురుకైన భాగస్వామ్యంతో రూపకల్పన నుండి ఉత్పత్తి వరకు భారత దేశాన్ని ప్రపంచంలోని అగ్ర దేశాలలో ఒకటిగా నిలబెట్టాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  రక్షణ రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ప్రతిపాదించిన సంస్కరణలను ఆయన సమీక్షించారు

రక్షణ రంగం వ్యయం మితంగా ఉండాలి, వ్యూహాత్మక రక్షణ మూలధన సముపార్జన కోసం పొదుపుచేసిన మొత్తాలను ఛానెలైజ్ చెయ్యాలి,  అనే అంశాలపై చర్చించారు.  రక్షణ కొనుగోలు ప్రక్రియలు,  ఆఫ్ సెట్ విధానాలువిడిభాగాల స్వదేశీకరణ, సాంకేతికత బదిలీ, భారతదేశంలో తయారీ సదుపాయాలను నెలకొల్పడానికి విదేశీ ఓ.ఎం.ఈ. లను ఆకర్షించడం, అంతర్జాతీయ సరఫరా చైన్స్ లో మన ఉనికిని విస్తరించడం వంటి అంశాలకు సంబంధించి కూడా చర్చలు జరిపారు. రక్షణ తయారీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో నిలబడేందుకు నాణ్యమైన, అత్యాధునిక పరికరాలు / విధానాలు / వేదికలను ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టాలని కూడా ఈ సమావేశంలో నొక్కి వక్కాణించారు.   

దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, అత్యాధునిక రక్షణ పరికరాల రూపకల్పన, అభివృద్ధి, తయారీ కోసం స్వదేశీ సామర్ధ్యాలను వినియోగించి, "భారతదేశంలో తయారీ" (మేక్-ఇన్-ఇండియా) మంత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రధానమంత్రి ఆదేశించారు.  పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించి, ఆవిష్కరణలను సత్కరించి, భారతీయ ఐ.పి. యాజమాన్యాన్ని సృష్టించే వాతావరణాన్ని రూపొందించడానికి  ప్రపంచ రక్షణ ఉత్పత్తి  వేల్యూ చైన్ లో పరిశ్రమ భాగస్వామ్యంతో సహా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.  

 

ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ఆర్ధికశాఖ మంత్రి, ఆర్థికశాఖ సహాయ మంత్రి తో పాటు భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు 

***



(Release ID: 1619869) Visitor Counter : 188