ఆయుష్
'ఆయురక్ష- కరోనా సే జంగ్ - ఢిల్లీ పోలీస్ కే సంగ్ 'ను ఆవిష్కరించిన అఖిల భారత ఆయుర్వేద సంస్థ
Posted On:
30 APR 2020 7:32PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద ఉన్న అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ), ఢిల్లీ పోలీసులతో కలిసి ఆయురక్ష అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ సంయుక్త కార్యక్రమంలో కరోనా సే జంగ్ - ఢిల్లీ పోలీస్ కే సంగ్ పేరుతో కరోనా పై పోరాటం లక్ష్యంగా, కరోనా నిర్ములన, దీనిలో రోగ నిరోధక శక్తి ని పెంపొందించే చర్యలు చేపడతారు.
చ్యవనప్రాష్ (దీనిలో ఆమ్లా ముఖ్యమైన పదార్థం), అనుతైలా, సంశమనివటి వంటి సులభమైన మూలికలున్న ఈ పదార్థాలు రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడతాయని శాస్త్రీయంగా రుజువైంది.
ఈ సందర్భంగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కోటేచా, వయోస్థాపన (యాంటీ ఏజింగ్ హెర్బ్) గా గిలోయ్ పాత్రను ప్రస్తావించారు. కోవిడ్-19 పాజిటివ్ కేసులకు యాడ్-ఆన్ థెరపీగా ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముందుండే యోధులుగా ఢిల్లీ పోలీసులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
ఢిల్లీ పోలీసుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఏఐఐఏ చేపడుతున్న చర్యలను ఢిల్లీ పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.ఎన్.శ్రీవాస్తవ ప్రశంసించారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద సహాయాన్ని కోవిడ్ యోధులైన ఢిల్లీ పోలీసు సిబ్బందికి అందించే ప్రతిపాదనతో ఢిల్లీ పోలీస్ విభాగం ముందుకు వచ్చింది. దీనిని దశల వారీగా అమలు చేస్తారు. ఎన్ సి టి ఢిల్లీ పరిథిలో ఉన్న 15 జిల్లాలకు చెందిన 80,000 మంది పోలీసులకు పంపిణీ జరుగుతుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసుల సిబ్బంది, పోలీసు అధికారులకు ఈ పంపిణీ దశలవారీగా జరుగుతుంది. అలాగే వీరందరి ఆరోగ్య వివరాలను కూడా డిజిటల్ గా రికార్డు చేస్తారు. మహమ్మారి ప్రభావం ఎవరిపై ఎలా ఉంది, ఎవరెవరు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు వంటి వివరాలన్నిటిని క్రోడీకరిస్తారు.
***
(Release ID: 1619818)
Visitor Counter : 259