నౌకారవాణా మంత్రిత్వ శాఖ

నౌకారవాణా మంత్రిత్వ శాఖ కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభం ఓపెన్‌ సోర్స్‌ సాంకేతికత ఆధారంగా అప్‌డేషన్‌ మెరుగైన వీడియో అప్‌లోడ్ సౌకర్యంతో కొత్త ఫీచర్‌

Posted On: 30 APR 2020 4:44PM by PIB Hyderabad

కేంద్ర నౌకారవాణా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ (shipmin.gov.in) అప్‌డేట్‌ అయింది. పునరుద్ధరణ పూర్తయి నూతన రూపు సంతరించుకున్న వెబ్‌సైట్‌ను ఇవాళ ప్రారంభించారు. ఓపెన్‌ సోర్స్‌ సాంకేతికతతో, NIC క్లౌడ్‌ మేఘరాజ్‌ ఆధారంగా రూపకల్పన చేశారు. పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం జారీ చేసిన భారత ప్రభుత్వ వెబ్‌సైట్ల మార్గదర్శకాల (GIGW) ఆధారంగా దీనిని రూపొందించారు.
వెబ్‌సైట్‌ హోమ్‌పేజీ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మెరుగైన వీడియో అప్‌లోడ్ సౌకర్యంతో సామాజిక మాధ్యమాల అనుసంధానం ఫీచర్‌ను ఈ వెబ్‌సైట్‌లో సరికొత్తగా తీసుకొచ్చారు.

 


 

***(Release ID: 1619714) Visitor Counter : 22