ఆర్థిక మంత్రిత్వ శాఖ
జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్ పై టాస్క్ ఫోర్స్ తన తుది నివేదికను ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు అందజేసింది.
Posted On:
29 APR 2020 3:48PM by PIB Hyderabad
జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్ (ఎన్.ఐ.పి.) 2019-25 ఆర్ధిక సంవత్సరాలకు ఎన్.ఐ.పి. పై తుది నివేదికను ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల కేంద్రమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు ఈ రోజు అందజేసింది. 2019-2025 కోసం జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్ పై టాస్క్ ఫోర్స్ నివేదిక సారాంశాన్ని ఆర్ధికమంత్రి 2019 డిసెంబర్ 31వ తేదీన విడుదల చేశారు.
వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2019-20 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2019 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో "ఆధునిక మౌలికసదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయాలు కేటాయించాము. ఈ సమయంలో దీనివల్ల జీవనప్రమాణాలు మెరుగుపడడంతోపాటు నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి." అని పునరుద్ఘాటించారు.
దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి మౌలికసదుపాయాల కల్పించడం కోసం, పౌరులందరికీ జీవన ప్రమాణాలు పెంపొందింపజేయడం కోసం ప్రభుత్వం ఎన్.ఐ.పి. వంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి. ప్రాజెక్ట్ ప్రణాళికను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం (స్వదేశీ మరియు విదేశీ) తో పాటు 2025 ఆర్ధిక సంవత్సరానికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడం దీని ప్రధాన లక్ష్యం.
ఈ రంగంలో ఉన్న మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు రంగం, మౌలిక సదుపాయాల మాస్టర్ లిస్ట్ లో గుర్తించబడిన మౌలిక సదుపాయాల ఉప-రంగాలతో పాటు వివిధ భాగస్వాములు సమకూర్చిన సమాచారాన్ని సమన్వయ పరచడం ద్వారా ఎన్.ఐ.పి. ఒక ఉత్తమ ప్రాతిపదికను తయారుచేసింది. ఎన్.ఐ.పి. ని రూపొందించడానికి బాటమ్-అప్ విధానాన్ని అవలంబించారు. ఒక్కొక్క ప్రాజెక్టుకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చయ్యే ప్రాజెక్టులు (గ్రీన్ ఫీల్డ్ లేదా బ్రౌన్ ఫీల్డ్, అమలులోఉన్నవి లేదా రూపకల్పనలో ఉన్నవి) అన్నింటినీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.
ఎన్.ఐ.పి. నివేదిక సారాంశాన్ని విడుదల చేసిన అనంతరం కేంద్ర మంత్రిత్వశాఖలు / రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన అదనపు / సవరించిన సమాచారం నేపథ్యంలో 2020-25 ఆర్ధిక సంవత్సరానికి మొత్తం మౌలిక సదుపాయాల పెట్టుబడి 111 లక్షల కోట్ల రూపాయలుగా ఎన్.ఐ.పి. టాస్క్ ఫోర్స్ తుది నివేదిక అంచనా వేసింది. ఎన్.ఐ.పి. టాస్క్ ఫోర్స్ తుది నివేదిక మూడు సంపుటాలలో ఉంది. I & II సంపుటాలను డి.ఈ.ఏ. వెబ్ సైట్ www.dea.gov.in, www.pppinindia.gov.in లోనూ, ఆర్ధిక మంత్రిత్వశాఖ పోర్టల్ పైనా అప్ లోడ్ చేయడం జరుగుతుంది. III వ సంపుటం (ఏ) మరియు (బి) లో పొందుపరచిన ప్రాజెక్ట్ సమాచారాన్ని ఇండియా ఇన్వెస్ట్ మెంట్ గ్రిడ్ పోర్టల్ పై అప్ లోడ్ చేయడం జరుగుతుంది.
మొత్తం పెట్టుబడి వ్యయం 111 లక్షల కోట్ల రూపాయలలో 44 లక్షల కోట్ల రూపాయల మేర (ఎన్.ఐ.పి. లో 40 శాతం) ప్రాజక్టులు అమలుదశలో ఉన్నాయి. 33 లక్షల కోట్ల రూపాయల మేర (30 శాతం) ప్రాజెక్టులు ఊహాత్మక దశలో ఉన్నాయి. 22 లక్షల కోట్ల రూపాయల మేర (20 శాతం) ప్రాజెక్టులు సమాచార అభివృద్ధి దశలో ఉన్నాయి. 11 లక్షల కోట్ల రూపాయల మేర (10 శాతం) ప్రాజెక్టుల స్థాయి అందుబాటులో లేదు. భారతదేశంలో విద్యుత్ (24 శాతం); రహదారులు (18 శాతం); పట్టణ (17 శాతం); రైల్వేలు (12 శాతం) చొప్పున మొత్తం 71 శాతం మేర మౌలికసదుపాయాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు అంచనా. భారతదేశంలో ఎన్.ఏ.పి. అమలులో కేంద్రప్రభుత్వం (39 శాతం) రాష్ట్రాలు (40 శాతం) దాదాపు సమాన వాటాలో ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఆతరువాతి స్థానంలో ప్రైవేట్ రంగం (21 శాతం) ఉంది.
భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని పోలికసదుపాయలా రంగాలలో ఇటీవలి మౌలికసదుపాయాల పోకడలను గుర్తించి ముఖ్యాంశాలను తుది నివేదికలో పొందుపరిచారు. ఈ రంగం ప్రగతి, లోటుపాట్లు, సమస్యలను కూడా ఇందులో పొందుపరిచారు. ప్రస్తుతం ఉన్న వివిధ రంగాల వారీ విధానాల తాజా సమాచారంతో పాటు, చేపట్టవలసిన సంస్కరణలు, దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో మౌలికసదుపాయాల పెట్టుబడులకు గల అవకాశాలను ఈ తుది నివేదికలో వివరించారు. మునిసిపల్ బాండ్లతో సహా కార్పొరేట్ బాండ్ మార్కెట్లను తీవ్రతరం చేయడం, మౌలికసదుపాయాల రంగంలో ఆర్ధికాభివృద్ధి సంస్థల ఏర్పాటు, మౌలికసదుపాయాల ఆస్తులపై మోనెటైజేషన్ వేగవంతం చేయడం, భూమి మోనెటైజేషన్ చేయడం ద్వారా ఎన్.ఐ.పి. ని ఆర్ధిక పరిపుష్టం చేయడానికి వివిధ మార్గాలను ఆ నివేదికలో సూచించారు.
మూడు కమిటీలను ఏర్పాటు చేయాలని టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది :
i. ఎన్.ఐ.పి. ప్రగతిని పర్యవేక్షించి, జాప్యాన్ని నివారించేందుకు ఒక కమిటీ;
ii. ప్రతి మౌలికసదుపాయాల మంత్రిత్వశాఖ స్థాయిలో అమలును అనుసరించడానికి ఒక సారధ్య సంఘం; మరియు
iii. ఎన్.ఐ.పి. కి ఆర్ధిక వనరులు కల్పించడానికి డి.ఈ.ఏ. లో ఒక సారధ్య సంఘం.
ప్రాధమిక పర్యవేక్షణ మంత్రిత్వశాఖ పైనా, ప్రాజెక్ట్ ఏజెన్సీ పైనా ఉన్నప్పటికీ, చేపట్టవలసిన సంస్కరణలపైన, నిలిచిపోయిన ప్రోజెక్టుల సమస్యలను పరిష్కరించడానికి, ఉన్నతస్థాయి పర్యవేక్షణ అవసరం ఉంది. గవర్నెన్స్ ఎస్కలేషన్ మాట్రిక్స్ సిఫార్సులతో సహా పర్యవేక్షణ, ఫ్రేమ్ వర్క్ ఎవాల్యూయేషన్ యొక్క ప్రాధమిక అంశాలను ఎన్.ఐ.పి. నివేదిక, సంపుటం-I లో పొందుపరచడం జరిగింది.
ఎన్.ఐ.పి. ప్రాజెక్ట్ సమాచారం అంతా ఎన్.ఐ.పి. కి అందుబాటులో ఉండేవిధంగా, ప్రాజెక్ట్ స్థాయి తాజా సమాచారం అందుబాటులో ఉండి, దేశ, విదేశాల్లోని కాబోయే పెట్టుబడిదారులకు సహాయపడే విధంగా, త్వరలో ఇండియా ఇన్వెస్టుమెంట్ గ్రిడ్ (ఐ.ఐ.జి.) పై పొందుపరచడం జరుగుతుంది. ఈ రంగంలో ఉన్న ప్రతి మంత్రిత్వ శాఖ / రాష్ట్రాలు తమ తమ నూతన ప్రోజెక్టులను, ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా నిర్ణయించుకున్న సమయాల్లో అదనంగా పొందుపరుస్తూ ఉంటే, కాబోయే పెట్టుబడిదారులకు తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది.
****
(Release ID: 1619422)
Visitor Counter : 297
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam