సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వల్ల అంతరాయం లేకుండా ఐఏఎస్ అధికారుల శిక్షణ కార్యక్రమాలను ఆన్ లైన్ ద్వారా కొనసాగిస్తున్న లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీ (ఎల్బిఎస్ఎన్ఏఏ)ని ప్రశంసించిన ఎంఓఎస్ (పి పి) డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 28 APR 2020 5:14PM by PIB Hyderabad

కేంద్ర ఈశాన్య ప్రాంత  అభివృద్ధి శాఖ (ఇండిపెండెంట్ ఛార్జ్)(డిఓఎన్ఈఆర్)పీఎంఓసిబ్బందిప్రజా సమస్యలుపింఛన్లుఅణు ఇంధనఅంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కోవిడ్-19 సంబంధిత అంశాలు లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీ (ఎల్బిఎస్ఎన్ఏఏ)లో అమలవుతున్న తీరుపై విస్తృతంగా చర్చించారు.  ఐఏఎస్ అధికారుల మొదటి దశ శిక్షణతో పాటు అకాడమీకి సంబంధించిన విధుల నిర్వహణకు ఎస్ఓపి లు ఏ విధంగా రుపొందాయో అధికారులు కేంద్ర మంత్రి కి వివరించారు. వారి గదుల నుండే యాక్సిస్ అయ్యేలా తరగతులు ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు.  ఆహారాన్ని వారి గదులకు వెళ్లి అందజేస్తున్నారు. శుభ్రత మాత్రం శిక్షణార్థులు తమకు తాముగా చూసుకుంటున్నారు. చలనచిత్రాలుఆన్ లైన్ చర్చలుఅసైన్మెంట్లు ద్వారా కోవిడ్-19 సంబంధిత వివరాలను సమర్పించడం జరిగింది. 

 

అకాడమీ ప్రస్తుత పరిస్థితుల్లో విపత్తు నిర్వహణలో ఉత్తమ అభ్యాసాలు డాక్యుమెంటేషన్ చేయడంలో చేపడుతున్న చర్యలుమొదటి దశ శిక్షణ సమీక్షతాజా పరిస్థితులకు అనుగుణంగా ఐటీ సదుపాయాలను మెరుగుపరుచుకోవడం వంటి వివరాలను ఎల్బిఎస్ఎన్ఏఏ డైరెక్టర్ కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ విపత్తులను ఎదుర్కొనే చర్యలకు సివిల్ సర్వీసెస్ సంఘం సహకారం అందించడంస్థానిక సామజిక వర్గాలకు సేవలు అందించడం వాటిని చర్యలను కూడా చేపట్టినట్టు అకాడమీ డైరెక్టర్ వివరించారు. 

టెక్నాలజీలెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వినూత్న ఉపయోగం ద్వారా అకాడమీ తన శిక్షణను పునరావిష్కరణ చేసింది. ఆఫీసర్ ట్రైనీలచే అన్ని ఇన్‌పుట్‌లు అసైన్‌మెంట్‌లు తమ సొంత జ్ఞాన్ పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ అకాడమీ తీసుకున్న చర్యలను ప్రశంసించారుసంక్షోభాన్ని తగ్గించడానికి ఇలాంటి మరెన్నో వినూత్న ప్రయత్నాలు జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

<><><><><> 



(Release ID: 1619090) Visitor Counter : 120