ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

సి.ఎస్.సి.ల ద్వారా ఆధార్ సవరణల సదుపాయాన్ని అనుమతించిన యు.ఐ.డి.ఎ.ఐ.

పౌరులకు సేవలు అందించేందుకు 20,000 సి.ఎస్.సి.లు

Posted On: 28 APR 2020 3:19PM by PIB Hyderabad

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి భారీ ఉపశమనం కలిగించేలా, ది యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఏఐ) ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (బి.సి.లు) ఆపరేట్ చేస్తున్న ఎస్.పి.వి. అయిన 20,000  కామన్ సర్వీస్ సెంటర్ (సి.ఎస్.సి) లలో ఆధార్ అప్ డేట్ సదుపాయాన్ని ప్రారంభించేందుకు అనుమతించింది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్స్,  ఎం.ఈ.ఐ.టి.వై మరియు లా అండ్ జస్టిస్ శాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

దాదాపు 20,000 సి. ఎస్.సి. లు పౌరులకు ఈ సేవను అందించగలవని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. బాధ్యతాయుతంగా ఆధార్ పనిని ప్రారంభించాలని, ఈ విషయంలో యుఐడిఏఐ జారీ చేసిన సూచనల మేరకు సి.ఎస్.సి, వి.ఎల్.ఈ.లను ఆయన కోరారు. ఈ సదుపాయం గ్రామీణ పౌరులలో అధిక సంఖ్యలో వారి నివాస స్థలానికి చేరువలో ఆధార్ సేవలను పొందడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

బ్యాంకింగ్ సదుపాయాలతో కూడిన సి.ఎస్.సి.లు తమకు అవసరమైన మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేసి, అవసరమైన ఇతర ఆమోదాలను పొందిన తర్వాత యు.ఐ.డి.ఎ.ఐ. పనులను ప్రారంభించడానికి జూన్ కి గడువును నిర్ణయించింది. ఏదేమైనా ఆధార్ నవీకరణ పనులను త్వరలో ప్రారంభించడానికి యు.ఐ.డి.ఎ.ఐ. కోరిన సాంకేతిక మరియు ఇతర నవీకరణలను వెంటనే పూర్తి చేయాలని అన్ని బి.సి. లను కోరినట్లు సి.ఎస్.సి. సి.ఈ.ఓ. డాక్టర్ దినేష్ త్యాగి తెలిపారు.

సి.ఎస్.సి. ద్వారా ఆధార్ అప్ డేట్ పనులను పునఃప్రారంభించినందుకు కేంద్ర మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ త్యాగి, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సూచించిన విధంగా డిజిటల్ ఇండియా లక్ష్యాలను సాధించే ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్ డౌన్ పరిమితుల సమయంలో సి.ఎస్.సి. ద్వారా ఆధార్ నవీకరణ సేవలను ప్రారంభించడం కూడా పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. ఆధార్ అప్ డేట్ చేయడానికి 20,000 అదనపు కేంద్రాలు అందుబాటులో ఉన్నందున, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు ఈ పని కోసం బ్యాంక్ శాఖల్లోని లేదా పోస్ట్ ఆఫీసుల్లోని ఆధార్ కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేదు. 

 

--


(Release ID: 1618943) Visitor Counter : 269