రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 సృష్టించిన పెట్టుబడి వాతావరణాన్ని ఉపయోగించుకోవడానికి కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడ సలహా మేర‌కు భారతదేశంలో

వ్యవసాయ-రసాయన ప్రాజెక్టులలో భారత మిషన్లు జేవీ పెట్టుబడులను ఆకర్షించేలా హెచ్ఐఎల్ చ‌ర్య‌లు
- కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి సంక్షోభ నేప‌థ్యంలోనూ హెచ్ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ మంచి పనితీరును క‌న‌బ‌రుస్తోంది

Posted On: 27 APR 2020 5:52PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి ఎదుర్కొంటున్న అడ్డంకులను అధిగమించడానికి రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ శాఖ తన ఆధీనంలో ప్ర‌భుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) సజావుగా ముందుకు న‌డిచేలా త‌గిన చొరవ తీసుకుంటోంది. పెట్టుబడుల కోసం వెతుకుతున్న వివిధ ప్రపంచ స్థాయి సంస్థలతో జాయింట్ వెంచర్లను (జేవీ) అన్వేషించడం ద్వారా ఆయా సంస్థల‌ పనితీరును మ‌రింత బలోపేతం చేసేలా త‌గు సూచ‌న‌లు చేస్తోంది. కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ ఆదేశాల మేరకు డిపార్ట్‌మెంట్ ఈ చర్యల‌ను తీసుకుంటోంది. భారత కార్పొరేట్ సంస్థలు ముఖ్యంగా తన మంత్రిత్వ శాఖ పరిధిలోని పీఎస్‌యులు కోవిడ్ -19 ప్రతికూలతను విదేశాల నుంచి మేటిగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశంగా మార్చుకోనేందుకు గాను ప్రయత్నించాలని మంత్రి సూచించారు. మంత్రి సలహా మేరకు, కేంద్ర రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ శాఖ పరిధిలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఐఎల్ తన వ్యాపార ప‌రిధిని మ‌రింత‌ విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా చైనా, జపాన్, దక్షిణ కొరియాలోని భారత రాయబార కార్యాలయాలు / మిషన్లకు భార‌త్‌లో పెట్టుబడులు పెట్టడానికి సంబంధిత దేశాలలో ఆసక్తిగల వ్యవసాయ-రసాయన తయారీదారుల‌ను ఆహ్వానిస్తూ ప్రతిపాదనలు పంపింది. ప్లాన్-ఆన్-లీజ్ ఏర్పాట్ల‌తో సహా కాంట్రాక్ట్ తయారీ నిమిత్తం భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టే క్ర‌మంలో హెచ్ఐఎల్‌తో జ‌ట్టుక‌ట్టేందుకు వీలుగా సంస్థ ప్ర‌తిపాద‌న‌లు ఆహ్వానించింది.
ప్ర‌తికూల‌త‌ల‌ను అధిగ‌మిస్తూ ముందుకు..
కోవిడ్‌-19 సంక్షోభం కారణంగా చాలా అవరోధాలను ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల‌కు వ్యవసాయ విభాగాలలో డీడీటీ, విత్తనాలు & పురుగు మందులు వంటి అవసరమైన రసాయనాల సరఫరా స‌మ‌యానుకూలంగా జ‌రిగేలా హెచ్ఐఎల్ చ‌ర్య‌లు తీసుకుంటోంది. కోవిడ్ -19 కార‌ణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లవుతున్నందున హెచ్ఐఎల్ సంస్థ‌కు చెందిన వివిధ యూనిట్లలో ఉత్పత్తి ప్రభావిత‌మ‌వుతూ వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ ఏప్రిల్ 24 తో ముగిసిన చివరి వారంలో సంస్థ మేటి అమ్మకాలతో మంచి పనితీరును క‌న‌బ‌రిచింది. మొత్తం 37.99 ఎంటీల వ్యవసాయ-రసాయనాలను విక్రయించింది. 97 ఎంటీల డీడీటీని సంస్థ స‌ర‌ఫ‌రా చేసింది. దీనికి తోడు పెరూ దేశానికి 10 ఎంటీల‌, మాంకోజెబ్ 80% డ‌బ్ల్యూపీ ఎగుమతి ఆర్డర్‌ను కూడా సంస్థ పూర్తి చేయ‌గ‌లిగింది. లోకస్ట్ కంట్రోల్ ప్రోగ్రాం కోసం మలాథియాన్ టెక్నికల్ సరఫరా సంబంధించి హెచ్ఐఎల్ సంస్థ వ్యవసాయ మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందాన్ని రూపొందించింది.



(Release ID: 1618771) Visitor Counter : 109