ఆర్థిక మంత్రిత్వ శాఖ

IRS అధికారుల అభిప్రాయాల పేరిట సామాజిక మాధ్యమాల్లో ఓ నివేదిక తాము ఎలాంటి నివేదిక కోరలేదన్న CBDT IRS అధికారుల శైలిపై విచారణ ప్రారంభమైంది: CBDT

నాడు పోస్టు చేయడమైనది: 26 APR 2020 8:16PM by PIB Hyderabad


    కొవిడ్‌-19 పరిస్థితులను చక్కదిద్దడానికి కొంతమంది IRS అధికారులు సూచనలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక నివేదిక తిరుగుతోందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) వెల్లడించింది. తాము IRS సహా ఏ ఇతర అధికారులను కొవిడ్‌-19 సంబంధిత నివేదిక అడగలేదని CBDT స్పష్టీకరించింది. వ్యక్తిగత అభిప్రాయాలు మరియు అధికారిక విషయాలపై ప్రజల్లోకి వెళ్ళే ముందు అధికారులు ఎటువంటి అనుమతి తీసుకోలేదని, ఇది ప్రవర్తన నియమావళి ఉల్లంఘననేని తేల్చి చెప్పింది. దీనిపై విచారణ ప్రారంభించినట్లు CBDT తెలిపింది.

    CBDT/ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక అభిప్రాయాలను సదరు నివేదిక ఏ విధంగానూ ప్రతిబింబించదని CBDT పునరుద్ఘాటించింది.


(రిలీజ్ ఐడి: 1618523) సందర్శకుల సూచీ సంఖ్య : : 239
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada