శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఆర్ అండ్ డి ఆధారిత సాంకేతిక సొల్యూషన్లు, ఉత్పత్తులతో పాటుగా కోవిడ్-19పై పోరాటానికి హ్యాండ్ శానిటైజర్లు, సబ్బులు, డిస్ ఇన్ఫెక్టెంట్లు వంటి తక్షణ సహాయ సామగ్రి సరఫరా చేస్తున్న సిఎస్ఐఆర్

Posted On: 25 APR 2020 4:11PM by PIB Hyderabad

#CSIRFightsCovid19
 

కరోనా మహమ్మారిపై పోరాటం తరచు చేతులు కడుక్కోవడంతో ప్రారంభమై వైరస్ నిరోధానికి అది మొదటి అస్త్రంగా మారింది. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు వివిధ రకాల వైరస్ ల వెలుపలి ప్రోటీన్లను నిస్సారం చేసి వాటికి అంటి పెట్టుకుని ఉన్న వెలుపలి పొరను కూడా నాశనం చేయడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. ఈ మహమ్మారి ప్రపంచం అంతటా త్వరితంగా విస్తరిస్తుండడంతో శానిటైజర్ల స్టాక్ లు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నకిలీ శానిటైజర్లు కూడా భారీగా మార్కెట్ లో దిగడం మొదలయింది.

సార్స్-కోవ్-2 వైరస్ పై పోరాటంలో శానిటైజేషన్, పరిశుభ్రత ప్రథమ శ్రేణి అస్ర్తాలు కావడంతో సిఎస్ఐఆర్ లాబ్ లు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు సురక్షితమైన రసాయన రహిత, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు, డిస్ ఇన్ఫెక్టెంట్లు సిద్ధం చేశాయి. “దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిష్కారాలు ముందుంచడంలో సిఎస్ఐఆర్ ముందుంటుం ది” అని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మండే అన్నారు. అలాగే “కోవిడ్-19పై కూడా మా ప్రయోగశాలలు పోరాటానికి దిగి ఎంతో ఉన్నతమైన తమ శాస్ర్తీయ అనుభవం ఉపయోగించి ఔషధాలు, వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నాయి. అదే విధంగా అవి తక్షణ అవసరమైన హ్యాండ్ శానిటైజర్లు, సబ్బులు, డిస్ ఇన్ఫెక్టెంట్ల అభివృద్ధి బాధ్యత కూడా చేపట్టాయి” అన్నారాయన.

దేశంలోని భిన్న ప్రాంతాల్లో పని చేస్తున్న సిఎస్ఐఆర్ లాబ్ లు హ్యాండ్ శానిటైజర్లు, డిస్ ఇన్ఫెక్టెంట్లు తయారుచేసి తక్షణ సహాయం అందిస్తున్నాయి.
- ఇప్పటివరకు సిఎస్ఐఆర్ కు చెందిన లాబరేటరీలు 50 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్లు, డిస్ ఇన్ఫెక్టెంట్లు ఉత్పత్తి చేసి సమాజంలోని లక్ష మందికి పైగా ప్రజలకు పంపిణీ చేశాయి.

- అలాగే లాబరేటరీలు స్థానిక యంత్రాంగాలతో అనుసంధానం అయి పోలీసు, మునిసిపల్ కార్పొరేషన్లు, విద్యుత్ సరఫరా సంస్థలు, వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, పంచాయతీలు, బ్యాంకుల సిబ్బందికి శానిటైజర్లు, డిస్ ఇన్ఫెక్టెంట్లు పంపిణీ చేస్తున్నాయి.

- సిఎస్ఐఆర్ లేబరేటరీలు స్థానికంగా లభించే ముడిసరకుతో తక్కువ ధరకు అందుబాటులో ఉండే సమర్థవంతమైన, సురక్షితమైన శానిటైజర్లు, డిస్ ఇన్ఫెక్టెంట్లు అభివృద్ధి చేస్తున్నాయి. ఉదాహరణకి హిమాచలప్రదేశ్ లోని పాలంపూర్ లో పని చేస్తున్న సిఎస్ఐఆర్-ఐహెచ్ బిటి శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి రసాయనాలు లేని  తేయాకులో ఉపయోగించే వస్తువులు, సహజసిద్ధమైన ఫ్లేవర్లు మాత్రమే ఉపయోగించి శానిటైజర్లు అభివృద్ధి చేశాయి.

- సిఎస్ఐఆర్-ఐఐసిటి ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజింగ్ జెల్ తయారీ ప్రాసెస్ ప్రామాణికం చేసి, 800 లీటర్ల శానిటైజర్ ను తెలంగాణ పోలీసులు, గ్రేటర్ హైదరాబాద్ ముసినిపల్ కార్పొరేషన్ సిబ్బందికి పంపిణీ చేసింది. సిఎస్ఐఆర్-సిఎల్ఆర్ఐ చెన్నై కరైకుడి జిల్లాలో జిల్లా యంత్రాంగం, మునిసిపల్ కార్పొరేషన్, మెడికల్ కళాశాలలు, పోలీసు స్టేషన్లు, పంచాయతీ సిబ్బందికి వందలాది లీటర్ల శానిటైజర్ సరఫరా చేశాయి.

- లక్నోలో పలు సిఎస్ఐఆర్-ఐఐటిఆర్ లాబ్ లు అత్యవసర సర్వీసుల సిబ్బంది తయారుచేసిన 2000 లీటర్ల హ్యాండ్ శానిటైజర్లు పంపిణీ చేశాయి. అలాగే ఈ సంస్థ హ్యాండ్ శానిటైజర్ యూనిట్లను జిల్లా యంత్రాంగం, స్వచ్ఛ గంగా విభౄగం, విద్యుత్ సరఫరా వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కళాశాలలకు అందించింది. సిఎస్ఐఆర్-ఎన్ బిఆర్ఐ ఇద్దరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి హెర్బల్ ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ టెక్నాలజీని బదిలీ చేసింది. లక్నోలోని విభిన్న ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు, శానిటైజేషన్ సిబ్బంది, పోలీసు సిబ్బందికి 1500 లీటర్ల శానిటైజర్లు పంపిణీ చేసింది. లక్నోలోని సిఎస్ఐఆర్-సిమాప్ తమ సంస్థలోనే తయారుచేసిన 1000 బాటిల్స్ హ్యాండ్ శానిటైజర్ (హాంకూల్), 1000 బాటిల్స్ ఫ్లోర్ డిస్ ఇన్ఫెక్టెంట్లు (స్వాబీ), 50 లీటర్ల ఫ్లోర్ క్లీనర్ (క్లీన్జెర్మ్) లక్నో నగరర నిగమ్, జిల్లా మాజిస్ర్టేట్ కు పంపిణీ చేసింది.

- ఈశాన్యంలో సిఎస్ఐఆర్-నీస్ట్ 1300 లీటర్ల హ్యాండ్ శానిటైజర్ జోర్హాట్ లోని వైమానిక దళ కార్యాలయానికి, జిల్లా యంత్రాంగం, జోర్హట్ రైల్వే స్టేషన్, పోలీసు స్టేషన్ సిబ్బందికి, ఒఎన్ జిసి, ఇంఫాల్ లోని ఎఫ్ సిఐ, మునిసిపల్ కార్పొరేషన్, సమీపంలోని గ్రామీణ ప్రజలకు అందించడానికి సిబ్బందికి పంపిణీ చేసింది.
- జమ్ములో సిఎస్ఐఆర్-ఐఐఐఎం వైద్యకళాశాల, వైమానిక దళ, భారత సైన్య సిబ్బందికి 1800 లీటర్ల హ్యాండ్ శానిటైజర్ పంపిణీ చేసింది. డెహ్రాడూన్ కు చెందిన సిఎస్ఐఆర్-ఐఐపి  1000 లీటర్ల హ్యాండ్ శానిటైజర్ను డూన్ హాస్పిటల్, పోలీసు శాఖ, రాష్ట్ర వైపరీత్యాల సహాయ దళానికి సరఫరా చేసింది.

- పశ్చిమంలో భావ్ నగర్ లోని సిఎస్ఐఆర్-సిఎస్ఎంసిఆర్ఐ శాస్త్రవేత్తలు భావ్ నగర్ మెడికల్ కళాశాలకు (బిఎంసి) హ్యాండ్ శానిటైజర్ సరఫరా చేసింది.

- భువనేశ్వర్ లోని సిఎస్ఐఆర్-ఐఐఎంటి మూలికా పదార్థాలతో సువాసనా భరితమైన, ఇన్ఫెక్షన్ రహిత ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్, ఇన్ఫెక్షన్ రహిత సబ్బు తయారుచేయడానికి కృషి చేస్తోంది.

- పాలంపూర్ లోని సిఎస్ఐఆర్-ఐహెచ్ బిటి అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ నుంచి రక్షణకు ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో హెర్బల్ సోప్ తయారుచేసింది. ఎలాంటి మినరల్ ఆయిల్ ఎస్ఎల్ఇఎస్ (సోడియం ల్యూరెత్ సల్ఫేట్), ఎస్ డిఎస్ (సోడియం డోడిసిల్ సల్ఫేట్) లేని ఈ కాంపోజిషన్ సమర్థవంతమైన యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ టెక్నాలజీని వాణిజ్యపరమైన ఉత్పత్తి కోసం హిమాచల్ ప్రదేశ్ కి చెందిన రెండు కంపెనీలకు బదిలీ చేశాయి. ఇది దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ అందుబాటులోకి వస్తుంది.

- ఇవి కాకుండా పలు సిఎస్ఐఆర్ లాబ్ లు వివిధ ఎంఎస్ఎంఇలు, పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో భారీ పరిమాణంలో శానిటైజర్ల ఉత్పత్తికి సహాయపడుతున్నాయి.
 


(Release ID: 1618315) Visitor Counter : 246