వ్యవసాయ మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్ స‌మ‌యంలో మండీల‌లో ర‌ద్దీ త‌గ్గించ‌డానికి ,పంట ఉత్ప‌త్తుల‌ను స‌కాలంలో మార్కెటింగ్ చేయ‌డానికి డైర‌క్ట్ మార్కెటింగ్ స‌హాయ‌ప‌డుతుంది.

Posted On: 25 APR 2020 7:57PM by PIB Hyderabad

రైతులకుప్రత్యక్ష మార్కెటింగ్ వీలుక‌ల్పించి వారికి మంచి రాబడి వ‌చ్చేవిధంగా భరోసా ఇవ్వడానికి భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండటానికి మండీల‌లో  సామాజిక దూరాన్ని కొనసాగించాలని ప్ర‌భుత్వం సలహా ఇచ్చింది. రైతులు , రైతు బృందాలు , ఎఫ్‌పిఓలు , సహకార సంస్థలు తమ ఉత్పత్తులను పెద్దమొత్తంలో కొనుగోలుదారులు ,పెద్ద రిటైలర్లు , ప్రాసెసర్‌లకు విక్రయించడంలో సులభతరం చేయడానికి ‘డైరెక్ట్ మార్కెటింగ్’ విధానాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రాల‌ను కోర‌డం జ‌రిగింది.
 కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ,2020 ఏప్రిల్ 16 న రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాస్తూ, సహకార , రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్‌పిఓ) మొదలైన వాటి ద్వారా ప్రత్యక్ష మార్కెటింగ్ చేప‌ట్టాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు.  ఇందుకు సంబంధించిన వారంతా దీనిని అనుస‌రించాల‌ని, రైతులందరూ ఈ ప్ర‌క్రియ‌ను పాటించేలా ప్రోత్స‌హించాల‌ని సూచించారు.
లైసెన్సింగ్ విధానాల కోసం పట్టుబట్టకుండా ప్రత్యక్ష మార్కెటింగ్‌ను ప్రోత్సహించడానికి , వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెటింగ్ చేయడంలో రైతులకు  త‌గిన సౌకర్యాలు కల్పించాలని డిపార్ట‌మెంట్‌ రాష్ట్రాలకు సలహా ఇచ్చింది.
టోకు మార్కెట్లను విడదీయడానికి ,సరఫరా వ్య‌వ‌స్థ‌ను పెంచడానికి, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) క్రింద రెండు మాడ్యూళ్ళను ప్రవేశపెట్టారు:

ఎఫ్‌.పి.ఒ మాడ్యూల్:  ఎఫ్‌.పి.ఒ లు నేరుగా ఇ-నామ్ పోర్టల్ ద్వారా వ్యాపారం చేయవచ్చు. వారు సేకరణ కేంద్రాల నుండి  పోటోతో,  క్వాలిటీ  ప్ర‌మాణాలు, ఉత్పత్తి వివరాలను వివ‌రిస్తూ స‌మాచారాన్ని అప్‌లోడ్ చేయవచ్చు . భౌతికంగా మండీలకు చేరుకోకుండా బిడ్డింగ్ సదుపాయాన్ని పొందవచ్చు.
గిడ్డంగి ఆధారిత ట్రేడింగ్ మాడ్యూల్: రైతులు తమ ఉత్పత్తులను డీమ్డ్ మార్కెట్‌గా  ప్ర‌క‌టించిన వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యుడిఆర్‌ఎ) రిజిస్టర్డ్ గిడ్డంగుల నుండి  అమ్ముకోవ‌చ్చు. భౌతికంగా ఉత్పత్తులను సమీప మండీలకు తీసుకురాన‌వ‌స‌రం లేదు.
వివిధ రాష్ట్రాలు డైర‌క్ట్ మార్కెటింగ్ ను అమ‌లు చేస్తున్నాయి. ఇందుకు అవి ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నాయి:

మార్కెట్ యార్డుల వెలుపల వ్యవసాయ ఉత్పత్తుల హోల్‌సేల్ వాణిజ్యంలో నిమగ్నమైనందుకుగాను, కర్ణాటక రాష్ట్రంలోని సహకార సంస్థలు ఎఫ్‌పిఓలకు  ఆ రాష్ట్రం మినహాయింపు ఇచ్చింది;
నోటిఫైడ్ వ్యవసాయ ఉత్పత్తులపై మార్కెట్ రుసుమును తమిళనాడు మినహాయించింది;
 వ్యవసాయ ఫామ్ గేట్ నుండి ఇ-నామ్ ప్లాట్‌ఫామ్‌లో వర్తకం చేయడానికి ఉత్తర ప్రదేశ్ అనుమ‌తి ఇచ్చింది. రైతుల నుండి నేరుగా కొనుగోలు చేయడానికి ప్రాసెసర్‌లకు ఏకీకృత లైసెన్స్ జారీ చేయడాన్ని ప్రోత్సహించింది . ఎఫ్‌పిఓలు గోధుమల సేకరణ కార్యకలాపాలను చేపట్టడానికి అనుమతించింది.

 వ్యాపారులు, ప్రాసెసర్లు  ఎఫ్‌పిఓల ద్వారా ప్రత్యక్ష మార్కెటింగ్‌ను రాజస్థాన్ అనుమ‌తిచ్చింది. దానికి తోడు, రాజస్థాన్‌లోని ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు (పిఎసిఎస్) , లార్జ్ ఏరియా మల్టీ-పర్పస్ కోఆపరేటివ్ సొసైటీస్ (లాంప్స్) ను డీమ్డ్ మార్కెట్లుగా ప్రకటించారు

వ్యక్తులు, సంస్థలు  ప్రాసెసింగ్ యూనిట్లు కాకుండా,  మార్కెట్-యార్డ్ వెలుపల ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి  రైతుల నుండి నేరుగా కొనుగోలు చేయడానికి ద‌ర‌ఖాస్తు రుసుమును  మధ్యప్రదేశ్ కేవ‌లం రూ. 500  లుగా నిర్ణ‌యించింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్  గుజరాత్ కూడా ఎటువంటి లైసెన్స్ అవసరం లేకుండా ప్రత్యక్ష మార్కెటింగ్‌కు అనుమతి ఇచ్చాయి.
ఉత్తరాఖండ్ గిడ్డంగి , కోల్డ్ స్టోరేజ్  ప్రాసెసింగ్ ప్లాంట్లను సబ్- మండీలుగా ప్రకటించింది.
గిడ్డంగులు , కోల్డ్ స్టోరేజీలను మార్కెట్ యార్డులుగా ప్రకటించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నియమ నిబంధనలను సడలించింది
 
డైర‌క్ట్ మార్కెటంగ్ ప్ర‌భావం:

లాక్‌డౌన్ స‌మ‌యంలో   రాజస్థాన్ రాష్ట్రం 1,100 కంటే ఎక్కువ డైర‌క్ట్ మార్కెటింగ్ లైసెన్సులను జారీ చేసింది, ఇందులో రైతులు, ఇప్పటికే ప్రాసెసర్లకు నేరుగా అమ్మడం ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ యార్డులుగా ప్రకటించిన 550 కంటే ఎక్కువ పిఎసిఎస్‌లలో, 150 పిఎసిఎస్ లు ప్రత్యక్ష మార్కెటింగ్ కోసం పనిచేస్తున్నాయి . గ్రామ వ్యాపారులు వాణిజ్య లావాదేవీలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
తమిళనాడులో మార్కెట్ ఫీజు మినహాయింపు కారణంగా, వ్యాపారులు, రైతుల‌నుంచి వారి  వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాల నుండి ఉత్పత్తులను కొనడానికి  ఆస‌క్తి చూపుతున్నార‌ని గ‌మ‌నించ‌డం జ‌రిగింది.

ఉత్తర ప్రదేశ్‌లో రైతులు  వ్యాపారులతో ఎఫ్‌పిఓలు ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేశాయి, తద్వారా వారి ఉత్పత్తులను నగరాల్లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు, ఇది వేస్టేజ్ పోకుండా ఆదా చేస్తుంది. రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాకుండా, ఎఫ్‌పిఓలు , జోమాటో ఫుడ్ డెలివరీ యాప్‌తో అనుసంధానానికి  రాష్ట్రం వీలు క‌ల్పించింది. తద్వారా వినియోగదారులకు స‌ర‌కుల‌ను సజావుగా పంపిణీ చేసేందుకు వీలు క‌ల్పిస్తుంది.
రాష్ట్రాల నుండి అందుకున్న నివేదిక ప్రకారం, వ్యవసాయ ఉత్పత్తులను సమర్థవంతంగా  సకాలంలో మార్కెటింగ్ చేయడానికి  రైతుల‌గ్రూపులు, ఎఫ్‌పిఓలు, సహకార సంస్థలు  అన్ని వాటాదారులకు డైరెక్ట్ మార్కెటింగ్  ఎంతో వీలు క‌లిగిస్తోంది


(Release ID: 1618311) Visitor Counter : 233