రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ 2019 – జనవరి 2020లో 2.68 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులతో మొదటి టోమ్ కు ఎగుమతి చేసే విభాగంలో అగ్రస్థానంలో నిలిచినందుకు కెమికల్ మరియు పెట్రో కెమికల్స్ పరిశ్రమను అభినందించిన శ్రీ సదానంద గౌడ

Posted On: 25 APR 2020 4:44PM by PIB Hyderabad

రసాయనాలు, పెట్రోకెమికల్స్ పరిశ్రమ తొలిసారిగా దేశంలో ఎగుమతి చేసే రంగంగా అవతరించడాన్ని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి. సదానంద గౌడ అభినందించారు. రసాయనాలు మరియు పెట్రో కెమికల్స్ తయారీకి భారతదేశాన్ని ప్రపంచ ప్రముఖ కేంద్రంగా మార్చడానికి పూర్తి మద్ధతు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ విజయంలో తమ విభాగం పోషించిన ముఖ్యమైన పాత్రను ప్రస్తావిస్తూ రసాయనాలు మరియు పెట్రో కెమికల్స్ విభాగం చేసిన నిరంతర ప్రయత్నాలు పరిశ్రము మొదటిసారిగా ఎగుమతి చేసే విభాగంగా ఎదగడానికి దొహదపడ్డాయని శ్రీ గౌడ ట్వీట్ ద్వారా తెలిపారు.

ఏప్రిల్ 2019 నుంచి 2020 జనవరిలో రసాయనాల ఎగుమతి మునుపటి కాలంతో పోలిస్తే 7.43 శాతం పెరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కాలంలో మొత్తం రసాయనాల ఎగుమతి రూ.2.68 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది మొత్తం ఎగుమతుల్లో 14.35 శాతం. 

 

--(Release ID: 1618201) Visitor Counter : 140